Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

India vs West Indies హెడ్ టూ హెడ్ రికార్డ్సు! పై చేయి ఎవ‌రిదంటే..

India vs West Indies Head to Head Records.. Who Is the Most Matches Won

మ‌రో 5 రోజుల్లో భార‌త్, వెస్టిండీస్ మ‌ధ్య వ‌న్డే సిరీస్ ప్రారంభంకానుంది. ఈ వ‌న్డే సిరీస్ స‌మ‌రానికి అహ్మ‌దాబాద్ స్టేడియం వేదిక‌గా నిలవ‌నుంది. వ‌న్డే సిరీస్ ముగిసిన వెంట‌నే టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. టీ20 సిరీస్‌కు కోల్‌క‌తాలోని ఈడెన్ గార్డెన్స్ వేదిక‌గా నిల‌వ‌నుంది. ఇందు కోసం భార‌త జ‌ట్టు ఇప్ప‌టికే కోల్‌క‌తా చేరుకుంది. కాగా ఇప్ప‌టివ‌ర‌కు భార‌త్, వెస్టిండీస్ మ‌ధ్య‌ జ‌రిగిన వ‌న్డే, టీ20ల్లో ఎవ‌రు పై చేయి సాధించారనే చ‌ర్చ మొద‌లైంది.

మ‌న‌దే స్వ‌ల్ప అధిక్యం

మ‌న‌దే స్వ‌ల్ప అధిక్యం

ఇప్ప‌టి వ‌ర‌కు భార‌త్, వెస్టిండీస్ మ‌ధ్య జ‌రిగిన వ‌న్డేల్లో మ‌న జ‌ట్టే స్వ‌ల్ప అధిక్యంలో ఉంది. ఇప్ప‌టివ‌ర‌కు ఇంటా, బ‌య‌టా క‌లిపి ఇరు జ‌ట్లు 133 వ‌న్డే మ్యాచ్‌ల్లో త‌ల‌ప‌డ్డాయి. ఇందులో టీమిండియా 64 మ్యాచ్‌ల్లో విజ‌యం సాధించ‌గా.. వెస్టిండీస్ 63 మ్యాచ్‌ల్లో విజ‌యం సాధించింది. రెండు మ్యాచ్‌లు టై కాగా, మ‌రో 4 మ్యాచ్‌లు ర‌ద్దయ్యాయి.

కాగా స్వ‌దేశంలో ఇప్ప‌టివ‌ర‌కు వెస్టిండీస్‌పై టీమిండియా 29 మ్యాచ్‌ల్లో గెలిచింది. 28 ఓడిపోయింది. దీంతో ఇరు జ‌ట్ల మ‌ధ్య వ్య‌త్యాసం స్వ‌ల్పంగానే ఉంది. అలాగే వెస్టిండీస్‌లో ఆ జ‌ట్టుపై భార‌త్ 16 మ్యాచ్‌లు గెల‌వ‌గా.. ఆ జ‌ట్టు 20 గెలిచింది. ఇత‌ర వేదిక‌ల్లో త‌ల‌ప‌డిన‌ప్పుడు భార‌త్ 19, వెస్టిండీస్ 15 వ‌న్డేల్లో గెలిచాయి.

టీ20ల్లో ఇండియాదే పై చేయి

టీ20ల్లో ఇండియాదే పై చేయి

ఇక టీ20ల విష‌యానికొస్తే భార‌త్, వెస్టిండీస్‌ ఇప్ప‌టి వ‌ర‌కు ఈ ఫార్మాట్లో 17 సార్లు త‌ల‌ప‌డ్డాయి. 10 సార్లు భార‌త్ గెల‌వ‌గా.. వెస్టిండీస్ 6 సార్లు గెలిచింది. ఒక మ్యాచ్ ర‌ద్ద‌యింది. స్వ‌దేశంలో జ‌రిగిన మ్యాచ్‌ల్లో భార‌త్ 5 గెల‌వ‌గా, విండీస్ రెండే గెలిచింది. ఇక వెస్టిండీస్‌లో జ‌రిగిన మ్యాచ్‌ల్లో ఇరు జ‌ట్లు రెండేసి మ్యాచ్‌లు గెలిచాయి. ఇక ఇత‌ర‌త్రా వేదిక‌ల్లో భార‌త్ 3, విండీస్ 2 గెలిచాయి.

టెస్టు రికార్డులు

టెస్టు రికార్డులు

ఈ ప‌ర్య‌ట‌న‌లో టెస్టు సిరీస్ నిర్వ‌హించ‌డం లేదు. అయితే ఇప్ప‌టివ‌ర‌కు టెస్ట్ ఫార్మాట్లో ఇరు జ‌ట్లు త‌ల‌ప‌డిన మ్యాచ్‌ల్లో హెడ్ టూ హెడ్ రికార్డుల‌ను ప‌రిశీలిస్తే క‌రేబియ‌న్లే పై చేయిగా ఉంది. ఇప్ప‌టివ‌ర‌కు భార‌త్, వెస్టిండీస్ 98 టెస్ట్ మ్యాచ్‌ల్లో త‌ల‌ప‌డ్డాయి. ఇందులో భార‌త్ 22 మ్యాచ్‌లు గెల‌వ‌గా.. వెస్టిండీస్ 30 గెలిచింది. 46 టెస్ట్ మ్యాచ్‌లు డ్రాగా ముగిశాయి. భార‌త్‌లో జ‌రిగిన టెస్ట్ మ్యాచ్‌ల్లో విండీస్‌దే పై చేయిగా ఉంది. భార‌త్ 13 గెల‌వ‌గా.. విండీస్ 14 గెలిచింది. ఇక వెస్టిండీస్‌లో జ‌రిగిన టెస్టుల్లో ఆ జ‌ట్టు 16 గెల‌వ‌గా.. ఇండియా 9 గెలిచింది.

IND VS WI: ODI, T20I India's Squad Selection పై విమర్శలు | Oneindia Telugu
షెడ్యూల్‌

షెడ్యూల్‌

కాగా భార‌త్, వెస్టిండీస్ మ‌ధ్య ఫిబ్ర‌వ‌రి 6, 9, 11 తేదీల్లో అహ్మ‌దాబాద్ వేదిక‌గా 3 మ్యాచ్‌ల వ‌న్డే సిరీస్ జ‌ర‌గ‌నుంది. ఇక 16, 18, 20 తేదీల్లో కోల్‌క‌తా వేదిక‌గా 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్ జ‌ర‌గ‌నుంది.

Story first published: Tuesday, February 1, 2022, 11:54 [IST]
Other articles published on Feb 1, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+