సై'నీ' అరంగేట్ర మ్యాచ్ చూసి వారిద్దరి మిడిల్ స్టంప్స్ ఎగిరిపడ్డాయి: గంభీర్

న్యూఢిల్లీ: యువ పేసర్ నవదీప్ సైనీ ప్రదర్శనతో ఢిల్లీ, డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ (డీడీసీఏ) సభ్యులు బిషన్ సింగ్ బేడీ, చేతన్ చౌహాన్‌ల వికెట్లు పడ్డాయని టీమిండియా మాజీ ఓపెనర్, బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్ పేర్కొన్నాడు. శనివారం రాత్రి వెస్టిండీస్‌తో జరిగిన తొలి టీ20లో అరంగేట్రం చేసిన సైనీ అద్భుత ప్రదర్శన చేసాడు. 4 ఓవర్లలో 17 పరుగులే ఇచ్చి మూడు కీలక వికెట్లు తీసాడు. అయిదో పూరన్ (20), హెట్‌మయర్ (0)లను ఔట్ చేయగా.. చివరి ఓవర్‌లో పొలార్డ్ (49)ని పెవిలియన్ చేర్చాడు.

వాళ్ల స్టంప్స్ ఎగిరిపడ్డాయి:
అరంగేట్ర అంతర్జాతీయ మ్యాచ్‌లోనే సైనీ (3/17) ఆకట్టుకోవడంపై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది. ఈ సందర్భంగా సైనీ మెంటార్ గౌతమ్ గంభీర్ ట్విటర్ వేదికగా అతన్ని మెచ్చుకోవడంతో పాటు డీడీసీఎ సభ్యులను విమర్శించాడు. 'సైనీ నువ్వు బౌలింగ్ చేయకముందే.. బిషన్ సింగ్ బేడీ, చేతన్ చౌహన్‌ల వికెట్లు తీశావు. నీ అరంగేట్ర మ్యాచ్ చూసి వారిద్దరి మిడిల్ స్టంప్స్ ఎగిరిపడ్డాయి' అని గంభీర్ పేర్కొన్నాడు.

వేగంతో బంతులేయడం మాటలు కాదు:
మ్యాచ్ అనంతరం భువనేశ్వర్ మాట్లాడుతూ.. 'సైనీ 145-150 కిలోమీటర్ల వేగంతో బంతులు వేస్తున్నాడు. మ్యాచ్ ఆసాంతం 150 కిలోమీటర్ల వేగంతో బంతులేయడం మాటలు కాదు. వికెట్ నెమ్మదిగా ఉన్నా.. త్వరగా వికెట్లు తీశాడు. ఈ మ్యాచ్‌లో అద్భుతంగా బౌలింగ్ చేశాడు. ఏ ఆటగాడికైనా అంతర్జాతీయ మ్యాచ్‌లో వికెట్లు తీస్తే మరింత ఆత్మవిశ్వాసం వస్తుంది. దేశవాళీ క్రికెట్, ఐపీఎల్, భారత్-ఎ మ్యాచ్‌ల్లో సైనీ తనకంటూ ప్రత్యేక స్థానం ఏర్పరుచుకున్నాడు' అని భువీ పేర్కొన్నాడు.

మంచి నైపుణ్యం ఉంది:
కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా సైనీ ప్రదర్శనను మెచ్చుకున్నాడు. కోహ్లీ మాట్లాడుతూ... 'బౌలర్లు అందరూ ఆకట్టుకున్నారు. ముఖ్యంగా ఢిల్లీకి చెందిన సైనీ బౌలింగ్ అమోగం. అతడిలో మంచి నైపుణ్యం, ప్రతిభ ఉంది. 150 కిలోమీటర్ల వేగంతో బంతులేస్తున్నాడు. చాలా ఫిట్‌గా ఉన్నాడు. తనకంటూ ఒక పేరును సంపాదించాడు. అంతర్జాతీయ స్థాయిలో వికెట్లు తీయాలని ఆకలితో ఉన్నాడు. అతను కెరీర్‌లో ఇంకా ఎదుగుతాడు' అని కోహ్లీ చెప్పుకొచ్చారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications