For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

హెచ్‌సీఏ విజ్ఞప్తి మేరకే ఉప్ప‌ల్‌లో తొలి టీ20.. నా అధ్యక్షతన తొలి మ్యాచ్‌ ఇదే!!


India vs West Indies: First T20I Match Shifted to hyderabad On HCA Request


హైదరాబాద్‌: బంగ్లాదేశ్ పర్యటనను ఘనంగా ముగించిన టీమిండియా స్వదేశంలో వెస్టిండీస్‌తో వన్డే, టీ20 సిరీస్‌లకు సిద్దమయింది. డిసెంబర్ 6న ప్రారంభం కానున్న టీ20 సిరీస్‌లో భాగంగా మొదటి మ్యాచ్‌ హైదరాబాద్‌లో జరుగనుంది. ముందస్తు షెడ్యూల్ ప్రకారం కాకుండా.. తొలి టీ20, మూడో టీ20 మ్యాచ్ వేదిక‌లలో బీసీసీఐ మార్పులు చేసింది.

తొలి టీ20 ముంబైలో డిసెంబర్‌ 6వ తేదీన జరగాల్సి ఉండగా.. ఆ మ్యాచ్‌ను హైదరాబాద్‌కు మార్చారు. హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ) అధ్యక్షుడిగా ఇటీవల ఎన్నికైన మహ్మద్‌ అజహరుద్దీన్‌ విజ్ఞప్తి మేరకు తొలి మ్యాచ్‌ను హైదరాబాద్ నగరంలో నిర్వహించడానికి బీసీసీఐ మొగ్గుచూపిందట. ఈ విషయాన్ని తాజాగా అజహర్‌ మాట్లాడుతూ తెలిపాడు.

'ఉప్పల్‌ స్టేడియంలో డిసెంబర్‌ 11వ తేదీన జరగాల్సిన మ్యాచ్‌ను మా (హెచ్‌సీఏ) విజ్ఞప్తి మేరకు 6వ తేదీనే నిర్వహిస్తున్నారు​. విండీస్‌తో తొలి టీ20 మ్యాచ్‌ హైదరాబాద్‌లో జరుగనుంది. హెచ్‌సీఏలో నా అధ్యక్షతన తొలి మ్యాచ్‌ ఇదే. మైదానానికి వచ్చే క్రికెట్‌ అభిమానులకు అన్ని వసతులు ఏర్పాటు చేస్తున్నాం. పోలీస్‌ సెక్యూరిటితో పాటు ప్రైవేట్‌ సెక్యురిటీని కూడా ఏర్పాటు చేస్తున్నాం. శుక్రవారం నుండి మ్యాచ్‌ టికెట్లు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంటాయి' అని అజహర్‌ తెలిపారు.

విండీస్‌తో జరగనున్న టీ20 సిరీస్‌కు స్టార్‌ ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌ దూరమయ్యాడు. ముస్తాక్‌ అలీ టీ20 టోర్నమెంట్‌లో భాగంగా మహారాష్ట్రతో జరిగిన మ్యాచ్‌లో ధావన్‌ ఎడమ మోకాలికి గాయమైంది. గాయం తీవ్రత ఎక్కువగా ఉండడంతో అతడు కోలుకోవడానికి కొంత సమయం పట్టే అవకాశం ఉందని బీసీసీఐ తెలిపింది. దీంతో ధావన్‌ స్థానంలో కేరళ వికెట్‌ కీపర్‌ సంజూ శాంసన్‌ను ఎంపిక చేసింది.

Complete schedule of India vs West Indies 2019:

# 1st T20I: December 6 in Hyderabad

# 2nd T20I: December 8 in Thiruvananthapuram

# 3rd T20I: December 11 in Mumbai

# 1st ODI: December 15 in Chennai

# 2nd ODI: December 18 in Visakhapatnam

# 3rd ODI: December 22 in Cuttack

India's squad for 3 T20Is:
Virat Kohli (C), Rohit Sharma (VC), KL Rahul, Shreyas Iyer, Manish Pandey, Rishabh Pant (WK), Shivam Dube, Washington Sundar, Ravindra Jadeja, Yuzvendra Chahal, Kuldeep Yadav, Deepak Chahar, Mohammed Shami, Bhuvneshwar Kumar, Sanju Samson.

Story first published: Thursday, November 28, 2019, 16:50 [IST]
Other articles published on Nov 28, 2019
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+