షమీపై వేటు: బీసీసీఐ నిర్ణయంపై ట్విట్టర్‌లో నెటిజన్ల మండిపాటు


హైదరాబాద్: వెస్టిండిస్‌తో జరిగే చివరి మూడు వన్డేలకు బీసీసీఐ గురువారం 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టుని ప్రకటించిన సంగతి తెలిసిందే. తొలి రెండు వన్డేలకు విశ్రాంతినిచ్చిన సీనియర్ పేసర్లు భువనేశ్వర్ కుమార్, జస్ప్రీత్ బుమ్రాలకు సెలక్టర్లు తిరిగి జట్టులో చోటు కల్పించారు.
ఈ క్రమంలో మరో పేసర్ మహమ్మద్ షమీని సెలక్టర్లు తప్పించారు. అయితే షమీని తప్పించడం పట్ల క్రికెట్ అభిమానులు నిరాశకు గురయ్యారు. మొదటి రెండు వన్డేల్లో పేలవ ప్రదర్శన చేసిన ఉమేశ్ యాదవ్‌ని కాదని, మహమ్మద్ షమీన తప్పించడంపై నెటిజన్లు సోషల్ మీడియాలో మండిపడుతున్నారు.

షమీని తప్పించడంపై నెటిజన్ల మండిపాటు
రెండో వన్డేలో ఉమేశ్ కంటే మెరుగ్గానే షమి బౌలింగ్ చేశాడని ఇలాంటి సమయంలో షమీని తప్పించడం సరైన నిర్ణయం కాదని అన్నారు. మరి కొందరైతే షమీని తప్పించడం పట్ల ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఐదు వన్డేల సిరిస్‌లో భాగంగా తొలి రెండు వన్డేల కోసం ప్రకటించిన జట్టులో వీరిద్దరూ చోటు దక్కించుకున్నారు. ఈ రెండు వన్డేల్లో వీరిద్దరూ నామమాత్ర ప్రదర్శనతోనే సరిపెట్టుకున్నారు.

రెండు వన్డేలు కలిపి మూడు వికెట్లు తీసిన షమీ
రెండు వన్డేలు కలిపి షమీ మూడు వికెట్లు తీశాడు. గువహటి వేదికగా జరిగిన తొలి వన్డేలో షమీ పది ఓవర్లు వేసి... రెండు వికెట్లు తీయడంతో పాటు 81 పరుగులు సమర్పించుకున్నాడు. ఈ క్రమంలో ఓ చెత్త రికార్డుని కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక, విశాఖపట్నం వేదికగా జరిగిన రెండో వన్డేలోనూ పది ఓవర్లు వేసిన షమీ కేవలం ఒక్క వికెట్ తీసి 59 పరుగులు ఇచ్చాడు.

ఉమేశ్ వల్లే రెండో వన్డే టైగా ముగిసింది
మరోవైపు ఉమేశ్ యాదవ్ విషయానికొస్తే తొలి వన్డేలో 10 ఓవర్లు వేసి వికెటేమీ తీయకుండా 64 పరుగులు సమర్పించుకున్నాడు. రెండో వన్డేలో ఒక్క వికెట్ తీసి 78 పరుగులు సమర్పించుకున్నాడు. ఇక, రెండో వన్డేలో 49ఓవర్‌లో బౌలింగ్ చేసిన షమి కేవలం ఆరు పరుగులు మాత్రమే ఇవ్వగా, ఆఖరి ఓవర్(50వ) వేసిన ఉమేశ్ యాదవ్ ఒక వికెట్ తీసి 14 పరుగులిచ్చాడు. దీంతో మ్యాచ్ టైగా ముగిసింది.

ఉమేశ్‌తో పోలిస్తే షమీనే అద్భుత ప్రదర్శన
విండిస్‌తో జరిగిన రెండు వన్డేల్లోనూ ఉమేశ్ యాదవ్‌తో పోలిస్తే షమీనే అద్భుత ప్రదర్శన చేశాడు. అయినా సరే, షమీని కాదని ఉమేశ్ యాదవ్‌కి చోటు ఎలా కల్పిస్తారంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు మండిపడుతున్నారు. ఐదు వన్డేల సిరిస్‌లో భాగంగా మూడో వన్డే పూణె వేదికగా శనివారం ప్రారంభం కానుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications