ప్రాక్టీస్‌లో ఆటగాళ్లు: టీమిండియాను కలిసిన అనుకోని అతిథి!
హైదరాబాద్: ఐదు వన్డేల సిరిస్‌తో పాటు ఒక టీ20 కోసం టీమిండియా వెస్టిండిస్ పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇరు జట్ల మధ్య తొలి వన్డే భారత కాలమానం ప్రకారం శుక్రవారం సాయంత్రం 6.30 గంటలకు ప్రారంభంకానుంది. తొలి వన్డే నేపథ్యంలో ఇరు జట్లకు చెందిన ఆటగాళ్లు శుక్రవారం నెట్ ప్రాక్టీస్ చేశారు.
క్వీన్స్ పార్క్ ఓవల్ మైదానంలో జరుగుతున్న తొలి వన్డే కోసం ఇరు జట్లు నెట్ ప్రాక్టీస్‌లో పాల్గొన్నాయి. శిఖర్ ధావన్, రహానె, ధోని, హార్ధిక్ పాండ్యా, రిషబ్‌పంత్‌లు ఈ ప్రాక్టీస్ సెషన్‌లో పాల్గొన్నారు. ఇటీవలే లండన్‌లో ముగిసిన ఛాంపియన్స్ ట్రోఫీ పైనల్లో కోహ్లీసేన ఓటమి పాలైన సంగతి తెలిసిందే.
ధోని, రిషబ్ పంత్, హార్దిక్ పాండ్యాలతో బ్రావో సోదరులు
క్వీన్స్ పార్క్ ఓవల్ మైదానంలో భారత ఆటగాళ్లు ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో అక్కడికి వెస్టిండీస్ ఆటగాళ్లు డారెన్ బ్రావో, డ్వేన్ బ్రావో వచ్చారు. టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనితో డ్వేన్ బ్రావోకి మంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఈ సందర్భంగా బ్రావో సోదరులు ధోని, రిషబ్ పంత్, హార్దిక్ పాండ్యతో తమ అనుభవాలను పంచుకుంటూ సందడి చేశారు.
నెట్ ప్రాక్టీస్‌లో చెమటోడ్చుతున్న భారత ఆటగాళ్లు
తొలి వన్డే నేపథ్యంలో భారత ఆటగాళ్లు శుక్రవారం చెమటోడ్చారు. వెస్టిండిస్ పర్యటనకు రోహిత్ శర్మ దూరం కావడంతో ఓపెనర్ శిఖర్ ధావన్‌కి జోడీగా రహానె బరిలోకి దిగుతాడని కెప్టెన్ కోహ్లీ ప్రకటించిన సంగతి తెలిసిందే.
పంత్‌కు ధోని సూచనలు
తొలి వన్డే నేపథ్యంలో భారత ఆటగాళ్లు శుక్రవారం నెట్ ప్రాక్టీస్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగ్ టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని, యువ ఆటగాడు రిషబ్ పంత్‌కు సూచనలు చేస్తోన్న దృశ్యం.

మొత్తం ఐదు వన్డేలు, ఒక టీ20
వెస్టిండిస్ పర్యటనలో భాగంగా టీమిండియా మొత్తం ఐదు వన్డేలు, ఒక టీ20 ఆడనుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications