లక్నోలో రెండో టీ20: సిరిస్‌పై కన్నేసిన టీమిండియా

లక్నో: పొరపాట్ల నుంచి పాఠాలు నేర్చుకుంటామని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అన్నాడు. మూడు టీ20ల సిరిస్‌లో భాగంగా భారత్-వెస్టిండిస్ జట్ల మధ్య లక్నో వేదికగా మంగళవారం రెండో టీ20 ప్రారంభం కానుంది. ఈ టీ20కి ముందు రోహిత్ శర్మ మీడియాతో మాట్లాడాడు.
"లక్ష్య ఛేదన అంత సులభం కాదని మాకు తెలుసు. మా పొరపాట్ల నుంచి పాఠాలు నేర్చుకుంటాం. బౌలర్లు బంతితో అద్భుతంగా రాణించారు. సీమర్లకు పిచ్ బాగా సహకరించింది. తేలిక కాకున్నా స్పిన్నర్లు సైతం చెలరేగారు. మంచి ప్రాంతాల్లో వారు బంతులు వేశారు. పరిస్థితులను చక్కగా వినియోగించుకున్నారు" అని అన్నాడు.
"అరంగేట్రం కుర్రాళ్లు కృనాల్ పాండ్యా, ఖలీల్ అహ్మద్ అద్భుత ప్రదర్శన చేశారు. ముంబై ఇండియన్స్‌కు ఆడుతున్న కృనాల్‌ను మూడేళ్లుగా దగ్గర్నుంచి గమనిస్తున్నా. అతడు బౌలింగ్‌కు వచ్చినప్పుడు పొలార్డ్ బ్యాటింగ్ చేస్తున్నాడు. అతడికి బౌలింగ్ చేస్తానని కృనాల్ అడిగాడు. ఈ కుర్రాళ్లు సవాళ్లు స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నారు' అని రోహిత్ శర్మే అన్నాడు.
ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన తొలి టీ20లో టీమిండియా ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. దీంతో మూడు టీ20ల సిరిస్‌లో 1-0 ఆధిక్యంలో నిలిచింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications