Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

India vs West Indies: 1000వ వ‌న్డేలో తిప్పేసిన చాహ‌ల్, సుంద‌ర్‌.. భార‌త్‌ ముందు స్వ‌ల్ప‌ ల‌క్ష్యం!

India vs West Indies: Chahal took 4, Washington Sundar took 3 wickets.. West Indies all out Just 176 runs

అహ్మ‌దాబాద్‌: ప్ర‌తిష్టాత్మ‌వ 1000వ వ‌న్డేలో టీమిండియా బౌల‌ర్లు చెల‌రేగారు. క‌లిసిక‌ట్టుగా బౌలింగ్ చేసి కరేబియ‌న్ల‌ను స్వ‌ల్ప స్కోరుకే ప‌రిమితం చేశారు. ముఖ్యంగా భార‌త స్పిన్న‌ర్లు య‌జుర్వేంద్ర చాహ‌ల్, వాషింగ్ట‌న్ సుంద‌ర్ ధాటికి క‌రేబియ‌న్లు క్రీజులో నిల‌వ‌లేక‌పోయారు. వీరికి పేస‌ర్లు మ‌హ్మ‌ద్ సిరాజ్‌, ప్ర‌సిద్ధ్ కృష్ణ కూడా తోడ‌వ‌డంతో వెస్టిండీస్ స్వ‌ల్ప స్కోర్‌కే ప‌రిమితం అయింది.

భార‌త బౌల‌ర్ల విజృంభ‌ణ‌

భార‌త బౌల‌ర్ల విజృంభ‌ణ‌

టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన వెస్టిండీస్ ఏ ద‌శ‌లోనూ మంచి స్కోర్ సాధించేలా క‌నిపించ‌లేదు. టీమిండియా బౌల‌ర్లు విజృంభించ‌డంతో వ‌రుస‌గా వికెట్లు కోల్పోయింది. ఇన్నింగ్స్ మూడో ఓవ‌ర్‌లో 8 ప‌రుగులు చేసిన‌ విండీస్ ఓపెన‌ర్ షాయ్ హోప్‌ను హైద‌రాబాద్‌ బౌల‌ర్ మహ్మ‌ద్ సిరాజ్ ఔట్ చేశాడు. దీంతో వెస్టిండీస్ 18 ప‌రుగుల‌కే తొలి వికెట్ కోల్పోయింది. అనంత‌రం జ‌ట్టు స్కోర్ 44 ప‌రుగుల వ‌ద్ద ఉండ‌గా మ‌రో ఓపెన‌ర్ బ్రాండన్ కింగ్(13)ను వాషింగ్ట‌న్ సుంద‌ర్ ఔట్ చేశాడు. అదే ఓవ‌ర్‌లో డారెన్ బ్రావో (18)ను కూడా సుంద‌ర్ ఎల్బీ రూపంలో ఔట్ చేశాడు.

100 వికెట్ల క్ల‌బ్‌లో చాహ‌ల్‌

అనంత‌రం బౌలింగ్‌కు వ‌చ్చిన చాహ‌ల్ చెల‌రేగాడు. వ‌రుస ఓవ‌ర్ల‌లో నికోల‌స్ పూర‌న్ (18), కీర‌న్ పొలార్డ్‌, బ్రూక్స్‌ను ఔట్ చేశాడు. చాహ‌ల్ ధాటికి వెస్టిండీస్ కెప్టెన్ పొలార్డ్ డ‌కౌట్‌గా వెనుదిరిగాడు. అంతేకాకుండా ఈ వికెట్ల‌తో వ‌న్డే క్రికెట్లో చాహ‌ల్ 100 వికెట్ల క్ల‌బ్‌లో చేరాడు. 60 వ‌న్డేల్లో 100 వికెట్లు తీసిన చాహ‌ల్.. అత్యంత వేగంగా ఈ జాబితాలో చేరిన రెండో భార‌త స్పిన్‌ బౌల‌ర్‌గా నిలిచాడు. మొత్తంగా ఐదో భార‌త బౌల‌ర్‌గా నిలిచాడు.

ఆదుకున్న హోల్డ‌ర్‌

ఆ వెంట‌నే అకేల్ హోసేన్‌ను ప్ర‌సిద్ద్ కృష్ణ డ‌కౌట్ చేయ‌డంతో 79 ప‌రుగుల‌కే 7 వికెట్లు కోల్పోయి వెస్టిండీస్ పీక‌ల్లోతు క‌ష్టాల్లో ప‌డింది. దీంతో విండీస్ 100 ప‌రుగులు కూడా సాధించేలా క‌నిపించలేదు. అయితే ఈ క్ర‌మంలో ఆల్‌రౌండ‌ర్ జేస‌న్ హోల్డ‌ర్‌, ఫాబియన్ అలెన్ వెస్టిండీస్‌ను ఆదుకున్నారు. వీరిద్ద‌రు ఎనిమిదో వికెట్‌కు 78 ప‌రుగుల మంచి భాగ‌స్వామ్యాన్ని నెలకొల్పారు. ఈ క్ర‌మంలో ప్ర‌మాద‌క‌రంగా మారుతున్న ఈ జోడిని 37వ ఓవ‌ర్‌లో వాషింగ్ట‌న్ సుంద‌ర్ విడ‌దీశాడు. 29 ప‌రుగులు చేసిన ఫాబియన్ అలెన్‌ను ఔట్ చేశాడు.

ఇండియా ముందు స్వ‌ల్ప ల‌క్ష్యం

అనంత‌రం జేస‌న్ హోల్డ‌ర్ హాఫ్ సెంచ‌రీ పూర్తి చేసుకున్నాడు. వ‌న్డే కెరీర్‌లో హోల్డ‌ర్‌కు ఇది 11వ హాఫ్ సెంచ‌రీ. అయితే 57 ప‌రుగులు చేసిన హోల్డ‌ర్‌ను ప్రసిద్ధ్ కృష్ణ ఫెమిలియ‌న్ పంపాడు. దీంతో వెస్టిండీస్ 167 ప‌రుగుల వ‌ద్ద తొమ్మిదో వికెట్ కోల్పోయింది. చివ‌రి వికెట్‌గా 13 ప‌రుగులు చేసిన జోసెఫ్‌ను చాహ‌ల్ ఔట్ చేశాడు. దీంతో 43.5 ఓవ‌ర్ల‌లో వెస్టిండీస్ 176 ప‌రుగుల‌కు ఆలౌటైంది. దీంతో భార‌త్ ముందు క‌రేబియ‌న్లు 177 ప‌రుగుల‌ స్వ‌ల్ప ల‌క్ష్యాన్ని మాత్ర‌మే ఉంచగ‌లిగారు. భార‌త బౌల‌ర్ల‌లో చాహ‌ల్ 4, వాషింగ్ట‌న్ సుంద‌ర్ మూడు వికెట్ల‌తో స‌త్తా చాటారు. మ‌హ్మ‌ద్ కృష్ణ 2, సిరాజ్ ఒక వికెట్ తీశారు.

Story first published: Sunday, February 6, 2022, 17:15 [IST]
Other articles published on Feb 6, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+