
చివరి క్షణాల్లో భువీ స్థానంలో ఉమేశ్‌కు
దీంతో చివరి క్షణాల్లో భువీ స్థానంలో ఉమేశ్‌యాదవ్‌కు చోటు కల్పించారు. ఇక తర్వాత మంగళవారం విండీస్‌తో లక్నోలో జరిగే రెండో టీ20కి భువనేశ్వర్ అందుబాటులో ఉంటాడా లేదా అనే విషయం సందేహంగా మారింది. మరోవైపు యువ పేసర్ ఖలీల్ అహ్మద్, కృనాల్ పాండ్యా..భారత్ తరపున టీ20ల్లో అరంగేట్రం చేశారు. కెప్టెన్ రోహిత్‌శర్మ నుంచి ఇద్దరు క్యాప్‌లు అందుకున్నారు. విండీస్ జట్టలో అలెన్, పియరీ, థామస్ తొలిసారి టీ20ల్లో బరిలోకి దిగారు.

లక్ష్యం చిన్నదే అయినా తడబడిన భారత్
ఆదివారం పరుగులు కష్టంగా వచ్చిన తొలి టీ20లో టీమ్ ఇండియా 5 వికెట్ల తేడాతో వెస్టిండీస్‌పై విజయం సాధించింది. కుల్‌దీప్ యాదవ్ (3/13), కృనాల్ పాండ్య (1/15), ఖలీల్ అహ్మద్ (1/16)ల పదునైన బౌలింగ్‌తో మొదట విండీస్ 8 వికెట్లకు 109 పరుగులే చేయగలిగింది. 27 పరుగులతో అలెన్ టాప్ స్కోరర్‌గా నిలిచాడు. లక్ష్యం చిన్నదే అయినా భారత్ తడబడింది.

మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్‌గా కుల్దీప్
దినేశ్ కార్తీక్ (31 నాటౌట్; 34 బంతుల్లో 3ఫోర్లు, 1సిక్సు), కృనాల్ పాండ్య (21 నాటౌట్; 9 బంతుల్లో 3ఫోర్లు) నిలబడడంతో భారత్ 17.5 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. మనీష్ పాండే (19; 24 బంతుల్లో 2ఫోర్లు) విలువైన పరుగులు చేశాడు. కుల్‌దీప్ యాదవ్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' అవార్డు లభించింది. రెండో టీ20 మంగళవారం లఖ్‌నవూలో జరుగుతుంది.

అరంగ్రేటంలో అదరగొట్టిన కృనాల్, ఖలీల్:
ఈ మ్యాచ్‌తో ఇద్దరు భారత ఆటగాళ్లు ఆల్‌రౌండర్ కృనాల్ పాండ్య, పేస్ బౌలర్ ఖలీల్ అహ్మద్ అరంగేట్రం చేశారు. తొలి మ్యాచ్‌లోనే చక్కని ప్రదర్శన చేశారు. 4 ఓవర్లలో 15 పరుగులే ఇచ్చి ఒక వికెట్ తీసిన కృనాల్.. ఛేదనలో 21 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఇక ఖలీల్ (1/16) పొదుపైన బౌలింగ్‌తో విండీస్ కట్టడిలో కీలక పాత్ర పోషించాడు.


Click it and Unblock the Notifications













