వాంఖేడెలో కాదు: భారత్ Vs విండిస్ నాలుగో వన్డే వేదిక మార్పు


హైదరాబాద్: ఐదు వన్డేల సిరిస్‌లో భాగంగా భారత్-వెస్టిండిస్ జట్ల మధ్య జరగాల్సిన నాలుగో వన్డే వేదిక మారింది. అక్టోబర్ 29న జరిగే మ్యాచ్‌కు వాంఖడే మైదానానికి బదులు బ్రబౌర్న్ స్టేడియం ఆతిథ్యం ఇవ్వనుంది. "సుప్రీం కోర్టు నియమించిన పాలకుల కమిటీ ఆదేశాల మేరకు 29న వాంఖడేలో నిర్వహించే మ్యాచ్ వేదికను క్రికెట్ క్లబ్ ఆఫ్ ఇండియా(సీసీఐ) స్టేడియానికి మారుస్తున్నాం" అని బీసీసీఐ ఓ ప్రకటనలో పేర్కొంది.
షెడ్యూల్ ప్రకారం ముంబైలోని వాంఖడె మైదానం ఆతిథ్యం ఇవ్వాలి
షెడ్యూల్ ప్రకారం ఈ వన్డేకు ముంబైలోని వాంఖడె మైదానం ఆతిథ్యం ఇవ్వాల్సి ఉంది. కానీ, ఆర్థిక అవరోధాలను చూపుతూ ముంబై క్రికెట్ సంఘం (ఎంసీఏ) ఈ మ్యాచ్‌ని నిర్వహించలేమని చేతులెత్తేసింది. వన్డే కోసం కనీసం టెండర్లు పిలిచే పరిస్థితి లేకపోవడంతో వాంఖడేలో మ్యాచ్ నిర్వహణ కష్టమని ముంబయి క్రికెట్ సంఘం (ఎంసీఏ) బీసీసీఐకి వెల్లడించింది.

ఎంసీఏ అధికారులు గురువారం బీసీసీఐ సీనియర్ అధికారితో భేటీ
ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని... వీటిపై చర్చించేందుకు ఎంసీఏ అధికారులు గురువారం బీసీసీఐ సీనియర్ అధికారితో భేటీ అయ్యారు. ఈ నేపథ్యంలో మ్యాచ్‌ను బోర్డు నిర్వహించేలా చూడాలని కోరారు. గతంలో బాంబే హైకోర్టు ఎంసీఏ పాలన కోసం ఇద్దరు రిటైర్డ్ న్యాయమూర్తులు నియమించింది. సెప్టెంబర్ 14న వారు పదవుల నుంచి తొలగిపోయారు.

ఎంసీఏ బ్యాంకు ఖాతాను ఎవరు నిర్వహించాలనే
అప్పటి నుంచి ఎంసీఏ బ్యాంకు ఖాతాను ఎవరు నిర్వహించాలనే దానిపై స్పష్టత లేదు. దీంతో క్రికెట్ పాలకుల కమిటీ (సీవోఏ) సూచన మేరకు మ్యాచ్‌ను క్రికెట్ క్లబ్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలోని బ్రాబౌర్న్ స్టేడియానికి మార్చినట్లు బీసీసీఐ తెలిపింది. బ్రాబౌర్న్ స్టేడియం కూడా వాంఖడెకు అతి సమీపంలోనే ఉంటుంది.

ఈ సిరీస్‌లో వన్డే వేదిక మారడం ఇది రెండోసారి
2009లో ఆస్ట్రేలియాతో టెస్టు తర్వాత ఇక్కడ మ్యాచ్‌లు నిర్వహించడం లేదు. అప్పటి నుంచి ఎక్కువగా ఈ స్టేడియాన్ని పర్యాటక జట్ల ప్రాక్టీస్ కోసం వాడుతున్నారు. ఇదిలా ఉంటే, ఈ సిరీస్‌లో వన్డే వేదిక మారడం ఇది రెండోసారి. అక్టోబర్ 24న ఇండోర్‌లో జరగాల్సిన రెండో వన్డేను కాంప్లిమెంటరీ పాస్‌ల వివాదం కారణంగా విశాఖకు తరలించిన సంగతి తెలిసిందే.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications