వెస్టిండీస్‌తో వన్డే జట్టు ప్రకటన, పంత్ అరంగ్రేట మార్గం సుగమం


న్యూ ఢిల్లీ: వెస్టిండీస్‌తో గౌహతి వేదికగా ఆదివారం మధ్యాహ్నం నుంచి జరగనున్న తొలి వన్డే మ్యాచ్ కోసం 12 మందితో కూడిన భారత జట్టుని శనివారం బీసీసీఐ ప్రకటించింది. ఇటీవల ముగిసిన రెండు టెస్టుల సిరీస్‌లో 92, 92 పరుగులతో మెరిసిన రిషబ్ పంత్ ఈ జట్టులో చోటు దక్కించుకున్నాడు. అయితే.. రెగ్యులర్ వికెట్ కీపర్ ధోనీ కూడా జట్టులోనే ఉండటంతో.. కేవలం బ్యాట్స్‌మెన్‌గా మాత్రమే అతడిని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది.

ధావన్, రోహిత్ శర్మ తమ స్థానాల్ని నిలబెట్టుకోగా
జట్టు ఎంపిక తీరు చూస్తుంటే.. రిషబ్ పంత్ వన్డే అరంగేట్రానికి మార్గం సుగుమమైనట్లేనని తెలుస్తోంది. ఓపెనర్లుగా శిఖర్ ధావన్, రోహిత్ శర్మ తమ స్థానాల్ని నిలబెట్టుకోగా.. మిడిలార్డర్‌లో విరాట్ కోహ్లి, అంబటి రాయుడు, రిషబ్ పంత్, మహేంద్రసింగ్ ధోని, రవీంద్ర జడేజాకి అవకాశం దక్కింది. ఈ క్రమంలో అంబటి నాలుగో స్థానంలో పంత్ ఐదో స్థానంలో వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి.

పంత్..కు 5 స్థానం అప్పగించి ధోనీ 6స్థానంలో
గతంలో ఈ స్థానాన్ని ధోనీ భర్తీ చేసినప్పటికీ టెస్టుల్లో తన సత్తా చాటిన పంత్.. యువకెరటానికి ఐదో స్థానం అప్పగించి ధోనీ ఆరో స్థానంలో బ్యాటింగ్‌కు రావొచ్చు. వరల్డ్ కప్‌ను దృష్టిలో ఉంచుకుని ధోనీని వికెట్ కీపర్‌గానే జట్టులోకి ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ఇక బౌలింగ్ విభాగంలో జడేజాతో పాటు స్పిన్నర్లు కుల్దీప్ యాదవ్, చాహల్ చోటు దక్కించుకోగా.. ఫాస్ట్ బౌలర్ల కోటాలో ఉమేశ్ యాదవ్, మహ్మద్ షమీ, ఖలీల్ అహ్మద్ ఎంపికయ్యారు.

ఖలీల్ అహ్మద్‌కి చోటు దక్కడం అనుమానంగా
అయితే.. తుది జట్టులో మాత్రం ఖలీల్ అహ్మద్‌కి చోటు దక్కడం అనుమానంగానే కనిపిస్తోంది. జట్టు ఎంపిక ప్రకారం.. మూడు ఫేసర్లు ముగ్గురు స్పిన్నర్లతో కోహ్లీసేన బరిలోకి దిగనున్నట్లు కనిపిస్తోంది. ఇప్పటికే గువహటి చేరుకున్న భారత ఆటగాళ్లు ముమ్మర సాధన చేస్తున్నారు. ఆసియా కప్ నుంచి విరామం తీసుకున్న విరాట్ మళ్లీ వన్డే జట్టులో పునరాగమనం చేశారు.
కోహ్లీ, ధోనీ, రోహిత్‌ల ముందు మరికొన్ని రికార్డులు
అరంగ్రేట టెస్టులో అదరగొట్టిన యువ ఆటగాడు రిషబ్‌పంత్ ఈ సారి వన్డేలో మరింత ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాడు. వెస్టిండీస్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో 184 పరుగులు చేసిన పంత్ అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో మూడో స్థానంలో నిలిచాడు. విండీస్‌తో జరగబోయే వన్డే సిరీస్‌లో కోహ్లీ, ధోనీ, రోహిత్‌లు బద్దలు కొట్టేందుకు మరికొన్ని రికార్డులు వారి ముందు ఉన్నాయి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications