For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

మైదానంలో కోహ్లీ ఎందుకు అంత ఉత్సాహంగా ఉంటాడో తెలుసుకోవాలనుంది: పొలార్డ్‌

India vs West Indies: Ask Virat Kohli Why He Is So Animated On Field: Kieron Pollard


విశాఖ: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మైదానంలో ఎందుకు అంత ఉత్సాహంగా ఉంటాడో తెలుసుకోవాలనుంది అని వెస్టిండీస్‌ కెప్టెన్‌ కీరోన్‌ పొలార్డ్‌ అంటున్నాడు. ఫీల్డ్‌లో అంత దూకుడుగా ఉండటానికి కారణం ఏంటో తెలుసుకోవాలి అని తన మనసులో మాటను బయటపెట్టాడు. పరుగుల సునామీ సృష్టిస్తున్న కోహ్లీ ఎప్పుడూ మైదానంలో దూకుడుగానే ఉంటాడు. ప్రత్యర్థి ఎవరైనా కవ్విస్తే.. కచ్చితంగా బదులిస్తాడు.

టీ20 సిరీస్‌లో విండీస్‌ బౌలర్‌ కెస్రిక్‌ విలియమ్స్‌ను 'నోట్‌ బుక్‌' సెలబ్రేషన్‌ ద్వారా ఎగతాళి చేసిన విషయం తెలిసిందే. చివరి టీ20లో సిక్స్ కొట్టిన అనంతరం కూడా నియంత్రణ కోల్పోయాడు. చెన్నై వన్డేలో రవీంద్ర జడేజా రనౌట్‌ అయిన విషయంలో కోహ్లీ జోక్యం చేసుకున్నాడు. అంపైర్ మీద అసహనం వ్యక్తం చేస్తూ బౌండరీ లైన్ వద్దకు వచ్చేసాడు. కోహ్లీ అలా దూకుడుగా ఉండడంతో రెండో వన్డే అనంతరం పొలార్డ్‌ పరోక్షంగా ప్రస్తావించాడు.

పొలార్డ్‌ పోస్ట్‌ మ్యాచ్‌ కాన్పరెన్స్‌లో కోహ్లీ మాట్లాడుతూ... 'కోహ్లీ అత్యుత్సాహానికి నాకు జవాబు తెలీదు. మైదానంలో ఎప్పుడూ అంత దూకుడుగా ఎందుకు ఉంటాడో తెలుసుకోవాలి. అలా ఎందుకు ఉంటాడో కోహ్లీని మీరే అడగండి. నాకైతే తెలీదు. కోహ్లీని అడిగి నాకు సమాధానం చెప్పండి. ఎందుకంటే నాకు తెలుసుకోవాలని ఉంది' అని పేర్కొన్నాడు. రెండో వన్డేలో భారత్‌ నిర్దేశించిన 388 పరుగుల టార్గెట్‌ను ఛేదించడంలో విండీస్‌ విఫలమైంది. 280 పరుగులకే ఆలౌట్ అవ్వడంతో టీమిండియా 107 పరుగుల తేడాతో విజయం సాధించింది. షాయ్‌ హోప్‌ (78), నికోలస్‌ పూరన్‌ (75)లు హాఫ్‌ సెంచరీలు చేశారు.

రెండో వన్డేలో వెస్టిండీస్‌ పొలార్డ్‌, కోహ్లీలు ఎదుర్కొన్న తొలి బంతికే 'గోల్డెన్‌ డక్‌'గా పెవిలియన్ చేరిన విషయం తెలిసిందే. మహ్మద్‌ షమీ వేసిన 30 ఓవర్‌ రెండో బంతికి నికోలస్‌ పూరన్‌ ఔట్‌ కాగా.. ఆ మరుసటి బంతికి పొలార్డ్‌ ఔటయ్యాడు. ఆఫ్‌ స్టంప్‌ పైకి వేసిన బాల్‌ను పొలార్డ్‌ షాట్ ఆడగా.. అది కాస్తా ఎడ్జ్‌ తీసుకుని కీపర్‌ రిషభ్‌ పంత్‌ చేతుల్లో పడింది. దాంతో పొలార్డ్‌ గోల్డెన్‌ డక్‌గా పెవిలియన్ చేరాడు.

కోహ్లీ కూడా ఆడిన తొలి బంతికే పెవిలియన్‌ చేరి గోల్డెన్‌ డక్‌ అయ్యాడు. అయితే కోహ్లీని పొలార్డ్‌ ఔట్ చేయడం విశేషం. 38వ ఓవర్ మూడో బంతిని పొలార్డ్‌ స్లో బౌన్సర్‌గా వేయగా.. పుల్‌ చేసిన కోహ్లీ క్యాచ్ ఔట్ అయ్యాడు. దీంతో కోహ్లీ కూడా తాను ఎదుర్కొన్న తొలిబంతికే పెవిలియన్‌ బాట పట్టాడు. వన్డే క్రికెట్‌లో కెప్టెన్‌లిద్దరూ ఇలా మొదటి బంతికే డకౌటవడం ఇదే తొలిసారి.

Story first published: Thursday, December 19, 2019, 17:02 [IST]
Other articles published on Dec 19, 2019
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+