5వ వన్డే: విండిస్ 104 ఆలౌట్, జడేజాకు 4 వికెట్లు

హైదరాబాద్: తిరువనంతపురం వేదికగా వెస్టిండిస్‌తో జరుగుతున్న ఆఖరి వన్డేలో భారత బౌలర్లు చెలరేగారు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్‌కు దిగిన వెస్టిండిస జట్టును 104 పరుగులకే ఆలౌట్ చేశారు. భారత బౌలర్లలో రవీంద్ర జడేజా నాలుగు వికెట్లు పడగొట్టగా, బుమ్రా, అహ్మద్‌కు రెండు, కుల్దీప్ యాదవ్, భువనేశ్వర్ కుమార్ తలో వికెట్ తీసుకున్నారు.

ముగ్గురు బ్యాట్స్‌మన్ మాత్రమే రెండంకెల స్కోరు
వెస్టిండిస్ జట్టులో కేవలం ముగ్గురు బ్యాట్స్‌మన్ మాత్రమే రెండంకెల స్కోరు చేయగా... కెప్టెన్ జాసన్ హోల్డర్ 25 పరుగులతో టాస్ స్కోరర్‌గా నిలిచాడు. ఆ తర్వాత రెండో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా శామ్యూల్స్(24) నిలిచాడు. విండిస్ జట్టులో ఎనిమిది మంది బ్యాట్స్‌మెన్ సింగిల్ డిజిట్స్‌కే పరిమితమైపోయారు.
జడేజాకు నాలుగు వికెట్లు
భారత బౌలర్లలో రవీంద్ర జడేజా నాలుగు వికెట్లు పడగొట్టగా, బుమ్రా, అహ్మద్‌కు రెండు, కుల్దీప్ యాదవ్, భువనేశ్వర్ కుమార్ తలో వికెట్ తీసుకున్నారు. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్‌కు దిగిన వెస్టిండిస్ జట్టు ఇన్నింగ్స్ నాలుగో బంతికే ఓపెనర్ పావెల్ డకౌట్‌గా వెనుదిరగగా.. ఆ తర్వాత క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయింది.

ఆఖరి వన్డేలో విఫలమైన హోప్, హెట్‌మయర్
సిరీస్‌లో అద్భుతంగా రాణించిన ఆ జట్టు మిడిలార్డర్ బ్యాట్స్‌మన్ హోప్ (0), హెట్‌మయర్ (9) ఆఖరి వన్డేలో దారుణంగా విఫలమవడంతో మిగతా బ్యాట్స్‌మెన్ కూడా పెవిలియన్‌కు క్యూ కట్టారు. రికార్డు స్థాయిలో విండీస్‌పై వరుసగా ఎనిమిదో వన్డే సిరీస్, సొంతగడ్డపై వరుసగా ఆరో సిరీస్‌పై కోహ్లీసేన కన్నేసింది.

ఇప్పటికే 2-1తో ఆధిక్యంలో ఉన్న కోహ్లీ సేన
కాగా, ఐదు వన్డేల ఈ సిరీస్‌లో భారత్ ఇప్పటికే 2-1తో ఆధిక్యంలో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో భారత విజయాన్ని ఇప్పటికే బౌలర్లు సులభతరం చేశారు. ఈ మ్యాచ్‌లో గనుక టీమిండియా విజయం సాధిస్తే 3-1తో సిరీస్‌ను సొంతం చేసుకుంటుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications