5వ వన్డే: సిక్స్ బాదాడు, వికెట్ తీసినా సైలెంట్‌గా సంబరాలు (వీడియో)

హైదరాబాద్: తిరువనంతపురం వేదికగా భారత్‌తో జరుగుతున్న ఆఖరి వన్డేలో వెస్టిండిస్ బ్యాట్స్‌మన్ మార్లోన్ శామ్యూల్స్ ధీటుగా బదులిచ్చాడు. అసలు వీరిద్దరి ప్రస్తావన ఎందుకంటే.... ముంబై వేదికగా జరిగిన నాలుగో వన్డేలో శామ్యూల్స్ వికెట్ తీసిన యువ పేసర్ ఖలీల్ అహ్మద్ రెచ్చిపోయి మరీ సంబరాలు చేసుకున్న సంగతి తెలిసిందే.
ఈ సంబరాలపై అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) ఖలీల్ అహ్మద్‌కి వార్నింగ్ ఇవ్వడంతో పాటు ఒక డీమెరిట్ పాయింట్‌ను కూడా జత చేర్చింది. దీంతో ఆఖరి వన్డేలో వీరిద్దరి మరోసారి ఎదురుపడ్డారు. దీంతో ఖలీల్ బౌలింగ్‌లో భారీ సిక్స్ బాది గత మ్యాచ్ సంబరాలకు బదులు తీర్చుకున్నాడు.
8వ ఓవర్ రెండో బంతిని
ఖలీల్ వేసిన ఇన్నింగ్స్ 8వ ఓవర్ రెండో బంతిని.. లాంగాఫ్ దిశగా స్టాండ్స్‌లో పడేలా శామ్యూల్స్ బాదేశాడు. ఆఫ్ స్టంప్‌కి వెలుపలగా పడిన బంతిని ఏకంగా 81 మీటర్ల దూరంలో పడేలా శామ్యూల్స్ బాదాడు. అయితే, ఆ తర్వాత ఇన్నింగ్స్ 12వ ఓవర్ వేసిన జడేజా బౌలింగ్‌లో శామ్యూల్స్‌ని పెవిలియన్‌కు చేర్చాడు.
సైలెంట్‌గానే సంబరాలు చేసుకున్న పోవెల్
ఆ తర్వాత కొద్దిసేపటికే ఖలీల్ విండిస్ బ్యాట్స్‌మన్ పొవెల్ వికెట్ పడగొట్టినప్పటికీ సైలెంట్‌గానే సంబరాలు చేసుకున్నాడు. కాగా, ఈ మ్యాచ్‌లో భారత బౌలర్లు చెలరేగడంతో వెస్టిండిస్ జట్టు 31.5 ఓవర్లలో 104 పరుగులకే ఆలౌటైంది. దీంతో భారత్‌కు 105 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని నిర్దేశించింది.

వెస్టిండిస్ జట్టులో కేవలం ముగ్గురు
వెస్టిండిస్ జట్టులో కేవలం ముగ్గురు బ్యాట్స్‌మన్ మాత్రమే రెండంకెల స్కోరు చేయగా... కెప్టెన్ జాసన్ హోల్డర్ 25 పరుగులతో టాస్ స్కోరర్‌గా నిలిచాడు. ఆ తర్వాత రెండో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా శామ్యూల్స్(24) నిలిచాడు. విండిస్ జట్టులో ఎనిమిది మంది బ్యాట్స్‌మెన్ సింగిల్ డిజిట్స్‌కే పరిమితమైపోయారు.
భారత బౌలర్లలో రవీంద్ర జడేజాకు నాలుగు వికెట్లు
భారత బౌలర్లలో రవీంద్ర జడేజా నాలుగు వికెట్లు పడగొట్టగా, బుమ్రా, అహ్మద్‌కు రెండు, కుల్దీప్ యాదవ్, భువనేశ్వర్ కుమార్ తలో వికెట్ తీసుకున్నారు. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్‌కు దిగిన వెస్టిండిస్ జట్టు ఇన్నింగ్స్ నాలుగో బంతికే ఓపెనర్ పావెల్ డకౌట్‌గా వెనుదిరగగా.. ఆ తర్వాత క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయింది.

రికార్డు స్థాయిలో విండీస్‌పై
రికార్డు స్థాయిలో విండీస్‌పై వరుసగా ఎనిమిదో వన్డే సిరీస్, సొంతగడ్డపై వరుసగా ఆరో సిరీస్‌పై కోహ్లీసేన కన్నేసింది. ఐదు వన్డేల ఈ సిరీస్‌లో భారత్ ఇప్పటికే 2-1తో ఆధిక్యంలో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో భారత విజయాన్ని ఇప్పటికే బౌలర్లు సులభతరం చేశారు. ఈ మ్యాచ్‌లో గనుక టీమిండియా విజయం సాధిస్తే 3-1తో సిరీస్‌ను సొంతం చేసుకుంటుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications