3-1తో సిరిస్ కైవసం: 5వ వన్డేలో టీమిండియా నమోదు చేసిన రికార్డులివే

హైదరాబాద్: తిరువనంతపురం వేదికగా వెస్టిండిస్‌తో జరిగిన ఐదో వన్డేలో భారత్ 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో ఐదు వన్డేల సిరిస్‌ను టీమిండియా 3-1తో సొంతం చేసుకుంది. వెస్టిండిస్ నిర్దేశించిన 105 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 14.5 ఓవర్లలో ఒక వికెట్ కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది.
ఒక మ్యాచ్ టైగా ముగిసిన సంగతి తెలిసిందే. తాజా విజయంతో రికార్డు స్థాయిలో విండీస్ జట్టుపై వరుసగా ఎనిమిదో వన్డే సిరీస్ విజయాన్ని, సొంతగడ్డపై వరుసగా ఆరో వన్డే సిరీస్‌ను కోహ్లీసేన నెగ్గడం విశేషం. ఈ మ్యాచ్‌లో నాలుగు వికెట్లు తీసిన టీమిండియా ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికయ్యాడు.
మ్యాన్ ఆఫ్ ద సిరిస్ అవార్డుని కెప్టెన్ కోహ్లీ గెలుచుకున్నాడు. ఓపెనర్ శిఖర్ ధావన్ 6 పరుగులకే పెవిలియన్‌కు చేరగా, రోహిత్ శర్మ మరోసారి హాఫ్ సెంచరీతో మెరిశాడు. మొత్తం 56 బంతులు ఎదుర్కొన్న రోహిత్ శర్మ 5 ఫోర్లు, 4 సిక్సర్లతో 63 పరుగులు చేశాడు. కెప్టెన్ కోహ్లీ 33 పరుగులు చేశాడు. అంతకముందు టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండిస్ 104 పరుగులకే ఆలౌటైంది.
ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ వన్డేల్లో 200వ సిక్సర్ బాదాడు. కేవలం 187 ఇన్నింగ్సుల్లోనే రోహిత్ శర్మ ఈ ఘనత సాధించాడు. అంతేకాదు వెస్టిండీస్‌పై ఒక సిరీస్‌లో అత్యధిక పరుగులు 360 చేసిన రెండో భారత ఆటగాడిగా అరుదైన రికార్డుని తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ జాబితాలో కోహ్లీ 444 పరుగులతో అగ్రస్థానంలో ఉన్నాడు.
ఈ మ్యాచ్‌లో టీమిండియా అనేక రికార్డులను నమోదు చేసింది. అవేంటో ఒక్కసారి చూద్దాం...

#1 అత్యధిక మ్యాన్ ఆఫ్ ద సిరిస్ అవార్డులు అందుకున్న భారత క్రికెటర్లు వీరే
14 - సచిన్ టెండూల్కర్
7 - యువరాజ్ సింగ్
6 - సౌరవ్ గంగూలీ
6 - విరాట్ కోహ్లీ

రోహిత్ శర్మ
#2 వన్డేల్లో అత్యంత వేగంగా 200 సిక్సులు బాదిన ఆటగాడిగా రోహిత్ శర్మ రికార్డు సృష్టించాడు. అంతకముందు ఈ రికార్డు షాహిద్ అఫ్రిది(195 ఇన్నింగ్స్‌లు) పేరిట ఉంది.
187 - రోహిత్ శర్మ
195 - షాహిద్ అఫ్రిది
214 - ఏబీ డివిలియర్స్
228 - బ్రెండన్ మెక్ కల్లమ్
241 - క్రిస్ గేల్
248 - ధోని
343 - సనత్ జయసూర్య

#3 భారత్ ఇప్పటివరకు గెలిచిన ద్వైపాక్షిక సిరిస్‌ల వివరాలు
* 8 vs SL, 2007 - present
8 vs WI, 2007 - present
6 vs Zim, 1998 - present
4 vs Eng, 2011-17

#4 వన్డేల్లో 200 సిక్సులు బాదేందుకు తీసుకున్న బంతులు:
4203 - షాహిద్ అఫ్రిది
6308 - బ్రెండన్ మెక్‌కల్లమ్
8387 - రోహిత్ శర్మ
9390 - ఏబీ డివిలియర్స్
10197 - క్రిస్ గేల్
10368 - మహేంద్ర సింగ్ ధోని
11774 - సనత్ జయసూర్య

#5 వన్డేల్లో అతి తక్కువ బంతులను సంధించిన మ్యాచ్ వివరాలివే:
180 - India v England, Chandigarh, 1985
191 - Kenya v NZ, Chennai, 2011
264 - SL v WI, Mumbai, 2006
264 - India v England, Bangalore, 2008
267 - WI v Zim, Ahmedabad, 2006
280 - #INDvsWI, Thiruvananthapuram, 2018

#6 వన్డేల్లో 200 సిక్సులు బాదేందుకు తీసుకున్న ఇన్నింగ్స్‌లు:
187 - రోహిత్ శర్మ
195 - షాహిద్ అఫ్రిది
214 - ఏబీ డివిలియర్స్
228 - బ్రెండన్ మెక్ కల్లమ్
241 - క్రిస్ గేల్
248 - ధోని
343 - సనత్ జయసూర్య

ఓపెనర్‌గా రోహిత్ శర్మ
#7 ఓపెనర్‌గా రోహిత్ శర్మ వన్డేల్లో 1000కి పైగా పరుగులు సాధించడం ఇది మూడోసారి(2013, 2017, 2018) కావడం విశేషం. ఈ జాబితాలో రోహిత్ శర్మ కంటే ముందు సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీ, సనత్ జయసూర్యలు ముందున్నారు.

కోహ్లీ-రోహిత్‌ల జోడీ రికార్డు
#8 వన్డేల్లో కోహ్లీ-రోహిత్‌ల జోడీ 4000 పరుగులను పూర్తి చేసుకుంది. ఈ క్రమంలో వీరిద్దరూ కలిసి 66 సార్లు భాగస్వామ్యాల్లోనే ఈ మైలురాయిని అందుకున్నారు. ఈ క్రమంలో రాహుల్ ద్రవిడ్-సౌరవ్ గంగూలీ(80) రికార్డుని బద్దలు కొట్టారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications