Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ముంబైలో 4వ వన్డే: రోహిత్, రాయుడు సెంచరీలు.. విండిస్‌ టార్గెట్ 378

 India vs West Indies, 4th ODI in Mumbai: Rohit, Rayudu centuries power hosts to 377/5

హైదరాబాద్: ముంబైలోని బ్రబౌర్న్ స్టేడియంలో జరుగుతున్న నాలుగో వన్డేలో ఆతిథ్య జట్టు వెస్టిండిస్‌కు భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. ఈ మ్యాచ్‌లో ఓపెనర్ రోహిత్ శర్మ (162: 137 బంతుల్లో 20 ఫోర్లు, 4 సిక్సులు), మిడిలార్డర్ బ్యాట్స్‌మన్ అంబటి రాయుడు(100: 81 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్సులు) సెంచరీలతో చెలరేగడంతో భారత జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 377 పరుగులు చేసింది.

దీంతో వెస్టిండిస్ జట్టుకు టీమిండియా 378 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది. వెస్టిండిస్ బౌలర్లలో రోచ్ రెండు వికెట్లు పడగొట్టగా పాల్, నర్స్ చెర్ వికెట్ తీసుకున్నారు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ప్రారంభించిన భారత జట్టు ఇన్నింగ్స్‌ను దాటిగా ఆరంభించింది. జట్టు స్కోరు 71 పరుగుల వద్ద ఓపెనర్ శిఖర్ ధావన్(38) తక్కువ స్కోరుకే పెవిలియన్ చేరాడు.

1
44269
ధావన్ ఔట్, తొడగొట్టిన విండిస్ బౌలర్

ధావన్ ఔట్, తొడగొట్టిన విండిస్ బౌలర్

40 బంతుల్లో 4ఫోర్లు, 2 సిక్సుల సాయంతో 38 పరుగులు చేసిన ధావన్ పేలవరీతిలో వికెట్ చేజార్చుకున్నాడు. కీమోపాల్ బౌలింగ్‌లో కీరన్ పావెల్‌కు క్యాచ్ ఇచ్చి ధావన్ వెనుదిరిగాడు. ఇన్నింగ్స్‌ 12వ ఓవర్ వేసిన కీమో పాల్ బౌలింగ్‌లో బంతిని మిడ్‌వికెట్ దిశగా తరలించేందుకు ధావన్ ప్రయత్నించాడు. బంతి బ్యాట్‌కి సరిగా కనెక్ట్ కాకపోవడంతో.. నేరుగా బంతి వెళ్లి కీరన్ పొవెల్ చేతుల్లో పడింది.

నిరాశ పరిచిన కెప్టెన్ విరాట్ కోహ్లీ

నిరాశ పరిచిన కెప్టెన్ విరాట్ కోహ్లీ

దీంతో ధావన్ తరహాలో తొడగొడుతూ బౌలర్ కీమో పాల్ సంబరాలు చేసుకున్నాడు. ధావన్ ఔటైన తర్వాత క్రీజులోకి వచ్చిన కోహ్లీ కూడా 16 పరుగులకే ఔట్ కావడంతో అభిమానులు నిరాశకు గురయ్యారు. కీమర్ రోచ్ బౌలింగ్‌లో అనవసర షాట్ ఆడి ఔటయ్యాడు. రోచ్‌ వేసిన 16.4వ బంతిని ఆడబోయి వికెట్ కీప‌ర్ షెయ్‌ హోప్‌ చేతికి కోహ్లీ చిక్కాడు.

రోహిత్ శర్మ 21వ సెంచరీ

దీంతో రోహిత్ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే బాధ్యత తీసుకున్నాడు. అంబటి రాయుడితో కలిసి రోహిత్ శర్మ సమయోచితంగా ఆడుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. ఈ క్రమంలో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్న రోహిత్.. 98 బంతుల్లో 13 ఫోర్లు, సిక్సర్‌తో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆ తర్వాత రోహిత్ శర్మ తన దూకుడుని పెంచాడు.

162 పరుగుల వద్ద హేమ్‌రాజ్‌కు క్యాచ్ ఇచ్చిన రోహిత్

రోహిత్ జోరుని చూస్తే అంతా డబుల్ సెంచరీ చేస్తాడని అనుకున్నారు. అయితే, రోహిత్ 162 పరుగుల వద్ద నర్స్ బౌలింగ్‌లో చందర్‌పాల్ హేమ్‌రాజ్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఆ తర్వాత అంబటి రాయుడు కూడా సెంచరీని నమోదు చేశాడు. వన్డేల్లో రోహిత్ శర్మకు ఇది 21వ సెంచరీ కాగా, రాయుడికి మూడో సెంచరీ కావడం గమనార్హం.

మూడో సెంచరీ సాధించిన అంబటి రాయుడు

మూడో సెంచరీ సాధించిన అంబటి రాయుడు

81 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్సర్లతో కెరీర్‌లో మూడో సెంచరీ సాధించిన అంబటి రాయుడు ఆ తర్వాత రనౌటై పెవిలియన్ చేరాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన ధోని 23, కేదార్ జాదవ్ (16 నాటౌట్), రవీంద్ర జడేజా (7 నాటౌట్) పరుగులు చేశారు. ఇదిలా ఉంటే ఈ మ్యాచ్‌లో కోహ్లీ చేసిన 16 పరుగులే ఈ ఏడాది వన్డేల్లో అత్యల్ప స్కోరు కావడం గమనార్హం.

Story first published: Monday, October 29, 2018, 18:21 [IST]
Other articles published on Oct 29, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+