ముంబైలో 4th ODI: కోహ్లీసేన బ్యాటింగ్... తుది జట్టులో ఆ ఇద్దరు

హైదరాబాద్: ముంబై వేదికగా భారత్-వెస్టిండిస్ జట్ల మధ్య 4వ వన్డే ప్రారంభమైంది. ముంబైలోని బ్రబౌర్న్ స్టేడియంలో నాలుగో వన్డే మొదలైంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత్ కెప్టెన్ విరాట్ కోహ్లీ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్‌లో టీమిండియా రెండు మార్పులతో బరిలోకి దిగుతోంది.
రిషబ్ పంత్, స్పిన్నర్ చాహల్‌పై వేటు వేసి రవీంద్ర జడేజా, కేదార్ జాదవ్‌లకు జట్ట మేనేజ్‌మెంట్ చోటు కల్పించింది. సిరీస్ అవకాశాలను నిలబెట్టుకోవాలంటే ఈ మ్యాచ్‌లో భారత్ తప్పక గెలవాల్సిందే. ఐదు వన్డేల సిరీస్‌లో ఇప్పటికే మూడు వన్డేల ముగియగా ఇరు జట్లు 1-1తో సమానంగా నిలిచాయి.
చివరి రెండు వన్డేలు కీలకంగా
దీంతో చివరి రెండు వన్డేలు కీలకంగా మారాయి. గౌహతి వన్డేలో టీమిండియా, పుణె వన్డేలో వెస్టిండిస్ విజయం సాధించగా.. వైజాగ్ వన్డే డ్రాగా ముగిసిన సంగతి తెలిసిందే. ఈ సిరిస్‌లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ హ్యాట్రిక్ సెంచరీతో ఫామ్‌లో ఉండగా.. వెస్టిండీస్ జట్టులో షై హోప్, హెట్‌మెయర్‌లు నిలకడగా రాణిస్తున్నారు.
బ్రబౌర్న్ స్టేడియంలో తొమ్మిదేళ్ల సుధీర్ఘ విరామం
నాలుగో వన్డేలో విజయం సాధించి సిరిస్ ఆధిక్యాన్ని అందుకోవాలని ఇరు జట్లు చూస్తున్నాయి. మరోవైపు బ్రబౌర్న్ స్టేడియంలో తొమ్మిదేళ్ల సుధీర్ఘ విరామం తర్వాత వన్డే జరగడం ఇదేతొలిసారి. నిజానికి ఈ మ్యాచ్ ముంబైలోని వాంఖడె స్టేడియంలో జరగాల్సి ఉంది. కానీ, ఆర్థిక అవరోధాలను చూపుతూ ముంబై క్రికెట్ సంఘం (ఎంసీఏ) ఈ మ్యాచ్‌ని నిర్వహించలేమని చేతులెత్తేసింది.

వాంఖడెకు అతి సమీపంలోనే
దీంతో సుప్రీం కోర్టు నియమించిన పాలకుల కమిటీ ఆదేశాల మేరకు 29న వాంఖడేలో నిర్వహించే మ్యాచ్ వేదికను క్రికెట్ క్లబ్ ఆఫ్ ఇండియా(సీసీఐ) స్టేడియానికి బీసీసీఐ మార్చింది. దీంతో దీంతో దాదాపు తొమ్మిదేళ్ల తర్వాత మళ్లీ ఈ స్టేడియంలో అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ జరగనుంది. బ్రబౌర్న్ స్టేడియం కూడా వాంఖడెకు అతి సమీపంలోనే ఉండటం విశేషం.
జట్ల వివరాలు:
భారత్ జట్టు: రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, విరాట్ కోహ్లి, అంబటి రాయుడు, మహేంద్రసింగ్ ధోని, కేదార్ జాదవ్, రవీంద్ర జడేజా, భువనేశ్వర్ కుమార్, కుల్దీప్ యాదవ్, ఖలీల్ అహ్మద్, జస్‌ప్రీత్ బుమ్రా
వెస్టిండీస్: చందర్‌పాల్ హేమ్‌రాజ్, కీరన్ పావెల్, షై హోప్, హెట్‌మెయర్, శామ్యూల్స్, రోమన్ పావెల్, హోల్డర్, ఫాబియన్ అలెన్, ఆష్లే నర్స్, మెకాయ్, రోచ్
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications