For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

రాయుడు సెంచరీ: ధోని అభినందన, నిలబడి చప్పట్లు కొట్టిన కోహ్లీ (వీడియో)

India vs Westindies 2018 4th Odi : Dhoni,Virat Kohli Appreciates Ambati Rayudu's Century | Oneindia
India vs West Indies, 4th ODI in Mumbai: Ambati Rayudu completes century

హైదరాబాద్: ముంబైలోని బ్రబౌర్న్ స్టేడియంలో జరుగుతున్న నాలుగో వన్డేలో భారత మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ అంబటి రాయుడు సెంచరీ సాధించాడు. విరాట్ కోహ్లీ(16) ఔటైన తర్వాత క్రీజులోకి వచ్చిన అంబటి రాయుడు దూకుడుగా ఆడి 80 బంతుల్లోనే 8 ఫోర్లు, 4 సిక్సుల సాయంతో 100 పరుగులు మైలురాయిని అందుకున్నాడు.

వన్డేల్లో రాయుడికి ఇది మూడో సెంచరీ కావడం విశేషం. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేస్తున్న భారత్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 377 పరుగులు చేసింది. ఓపెనర్ రోహిత్ శర్మ(162: 137 బంతుల్లో 20 ఫోర్లు, 4 సిక్సులు) భారీ సెంచరీని నమోదు చేశాడు. వన్డేల్లో రోహిత్ శర్మ 150కిపైగా పరుగులు చేయడం ఇది ఏడోసారి కావడం విశేషం.

1
44269

ఓపెనర్ శిఖర్ ధావన్ (38), కెప్టెన్ విరాట్ కోహ్లీ (16) తక్కువ స్కోరుకే ఔటవడంతో.. జట్టు స్కోరు 101 వద్ద క్రీజులోకి వచ్చిన రాయుడితో కలిసి రోహిత్ శర్మతో మూడో వికెట్‌కి అభేద్యంగా 211 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. ఈ ఏడాది ఐపీఎల్‌లో మెరుగైన ప్రదర్శన చేయడం ద్వారా రాయుడు మళ్లీ భారత జట్టులోకి పునరాగమనం చేసిన సంగతి తెలిసిందే.

Story first published: Monday, October 29, 2018, 17:30 [IST]
Other articles published on Oct 29, 2018
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+