భారత్‌కు విండీస్ షాక్: తేలిపోయిన టీమిండియా, నాలుగో వన్డేలో ఓటమి
నార్త్ సౌండ్:వెస్టిండీస్‌తో జరిగి నాలుగో వన్డేలో భారత్‌కు షాక్ తగిలింది. తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్‌ను భారత్ 189 పరుగులకు కట్టడి చేసింది. 190 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 49.4 ఓవర్లకు 178 పరుగుల వద్ద కుప్పకూలింది.
వరుస విజయాాలతో సిరీస్ సొంతం చేసుకోవాలనుకున్న భారత్‌కు సిరీస్‌లో తొలి ఓటమిని రుచి చూపించింది విండీస్. ఆఖరి వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో 11 పరుగుల తేడాతో భారత్‌పై విండీస్ గెలిచింది. తద్వారా సిరీస్ ఆశలను సజీవంగా ఉంచుకుంది.

ఐదు వన్డేల సిరీస్‌లో భారత్ 2-1తో ఆధిక్యంలో ఉంది. భారత బ్యాట్స్‌మెన్ రహానె( 91 బంతుల్లో 60 పరుగులు), ధోనీ(114 బంతుల్లో 54 పరుగులు) మినహా ఎవరూ రాణించలేదు.
విండీస్ కెప్టెన్ జేసన్ హోల్డర్ బౌలింగ్‌లో అసాధారణ ప్రతిభ కనబర్చాడు. 9.4 ఓవర్లు వేసిన అతడు 27 పరుగులు ఇచ్చి ఐదు వికెట్లు తీశాడు. అందులో రెండు మెయిడిన్ ఓవర్లు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌ను కెప్టెన్ హోల్డర్ అందుకున్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications