విలియమ్స్ బౌలింగ్‌లో సిక్స్.. కోహ్లీ రియాక్షన్ అదుర్స్ (వీడియో)!!

ముంబై: బుధవారం రాత్రి వాంఖెడే స్టేడియంలో జరిగిన చివరి టీ20లో భారత్ 67 పరుగుల తేడాతో వెస్టిండీస్‌పై ఘన విజయం సాధించింది. ఈ విజయంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను భారత్ 2-1తో కైవసం చేసుకుంది. కెప్టెన్ విరాట్ కోహ్లీ (29 బంతుల్లో 70 నాటౌట్; 4 ఫోర్లు, 7 సిక్స్‌లు) రెచ్చిపోయి 21 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసాడు. వాంఖెడే స్టేడియంలో గత మ్యాచ్‌లో ఎదురైన పరాజయానికి భారత్ ప్రతీకారం తీర్చుకుంది.

కళ్లతో సంబరాలు:
హైదరాబాద్ టీ20లో తన చేతిని వర్చువల్ 'నోట్‌బుక్'గా మార్చి టిక్ కొడుతున్నట్లు విన్యాసం చేసి హల్చల్ చేసిన కోహ్లీ మరోసారి అలాంటి ఘటననే పునరావృతం చేసాడు. విండీస్ బౌలర్ కెస్రిక్ విలియమ్స్ వేసిన 18 ఓవర్ నాలుగో బంతిని కోహ్లీ మిడ్ వికెట్ మీదుగా సిక్స్ కొట్టాడు. అది భారీ సిక్సర్‌గా వెళ్లడంతో.. కోహ్లీ తన కళ్లను పెద్దవిగా చేసి సంబరాలు చేసుకున్నాడు. అంతేకాదు బౌలర్ వద్దకు వెళ్లి తన నోటికి పనిచెప్పాడు.
కోహ్లీ రియాక్షన్ అదుర్స్:
విరాట్ కోహ్లీ రియాక్షన్‌కు సంబందించిన వీడియోను ఓ క్రికెట్ అభిమాని సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. అదికాస్తా వైరల్ అయింది. ఈ వీడియో అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. పలువురు అభిమానులు లైక్స్ కొడుతూ 'కోహ్లీ రియాక్షన్ అదుర్స్' అంటూ కామెంట్లు పెడుతున్నారు. బ్యాటింగ్ చేస్తుండగా తనను కవ్వించిన చాలా మంది బౌలర్లకు కోహ్లీ కౌంటర్ ఇచ్చిన సందర్భాలు చాలానే ఉన్నాయి.

నోట్‌బుక్ సెలబ్రేషన్:
గతంలో ఓ మ్యాచ్ సందర్భంగా కోహ్లీ వికెట్ తీసిన విలియమ్స్ నోట్‌బుక్ సంబరాలు చేసుకున్నాడు. హైదరాబాద్ మ్యాచులో విలియమ్స్ వేసిన 16వ ఓవర్ రెండో బంతిని అతని తలపై నుంచి కోహ్లీ నేరుగా బౌండరీ బాదాడు. ఆ తర్వాతి బంతిని లాంగాన్‌లో సిక్సర్ కొట్టాడు. సిక్సర్ కొట్టిన తర్వాత విలియమ్స్‌కు కోహ్లీ కౌంటర్ ఇచ్చాడు. కోహ్లీ తన జేబులో నుంచి నోట్‌బుక్‌ను తీసి మూడు సార్లు టిక్కులు కొడుతున్నట్లు సెలబ్రేషన్ చేసుకున్నాడు.

స్వదేశంలో 1000 పరుగులు:
విరాట్ కోహ్లీ 21 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసిన విషయం తెలిసిందే. అంతర్జాతీయ టీ20ల్లో కోహ్లీకి ఇది ఫాస్టెస్ట్ ఫిఫ్టీ. అయితే ఓవరాల్‌గా భారత్ తరఫున ఐదవది. మూడో టీ20లో కోహ్లీ 7 సిక్స్‌లు బాదాడు. అంతర్జాతీయ టీ20ల్లో కోహ్లీకి ఇది అత్యుత్తమం. స్వదేశంలో అంతర్జాతీయ టీ20ల్లో 1000 పరుగులు పూర్తి చేసిన నాలుగో క్రికెటర్‌గా కోహ్లీ రికార్డుల్లోకి ఎక్కాడు. భారత్ తరఫున తొలి క్రికెటర్.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications