Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

నేడే సిరీస్ పోరు: జోష్‌లో వెస్టిండీస్‌.. ఒత్తిడిలో భారత్!!

India vs West Indies 3rd T20I: Preview, Predicted XI, Weather report, Virat Kohli needs to make crucial changes in decider

ముంబై: మూడు టీ20ల సిరీస్‌లో భారత్, వెస్టిండీస్‌ జట్లు ఆఖరి సమరానికి సిద్ధమయ్యాయి. ఇరు జట్లు చెరో మ్యాచ్‌ నెగ్గడంతో ఫైనల్ పోరు రసవత్తరంగా మారింది. సొంతగడ్డపై టీమిండియా చావోరేవో స్థితిలో నిలిచింది. బుధవారం రాత్రి వాంఖడే మైదానంలో జరిగే చివరిదైన మూడో మ్యాచ్‌లో గెలిచిన వారికే ట్రోఫీ దక్కుతుంది. గత మ్యాచ్‌ విజయం ఇచ్చిన ఉత్సాహంతో విండీస్‌ జోష్‌లో ఉంటే.. ఫీల్డింగ్‌, బౌలింగ్ సమస్యలతో సతమతమవుతున్న భారత్ ఒత్తిడిలో ఉంది. అయితే అన్నీ అధిగమించి సిరీస్ కొట్టాలని కోహ్లీసేన తహతహలాడుతోంది.

రోహిత్‌పై ఆశలు:

రోహిత్‌పై ఆశలు:

ఈ సిరీస్‌లో ఇప్పటివరకు పెద్దగా ప్రభావం చూపని 'హిట్‌మ్యాన్‌' రోహిత్‌ శర్మ సొంత మైదానంలో సత్తాచాటాలని ఉవ్విళ్లూరుతున్నాడు. మరో ఓపెనర్‌ లోకేశ్‌ రాహుల్‌ ఫామ్‌ కొనసాగించాలని చూస్తున్నాడు. తొలి మ్యాచ్‌లో సూపర్‌ ఇన్నింగ్స్‌తో జట్టును గెలిపించిన కెప్టెన్‌ విరాట్ కోహ్లీ.. గత మ్యాచ్‌లో నిరాశపరిచాడు. అయితే కీలక మ్యాచ్‌లలో కోహ్లీ రాణించిన సందర్భాలు చాలానే ఉన్నాయి.

శాంసన్‌కు నిరాశే:

శాంసన్‌కు నిరాశే:

రెండు మ్యాచ్‌లలో పెద్దగా బ్యాటింగ్ చేసే అవకాశం రాని శ్రేయాస్ అయ్యర్ నాలుగో స్థానంలో కీలక ఆటగాడు. అవకాశం వస్తే చెలరేగేందుకు సిద్ధంగా ఉన్నాడు. ఇక వరుసగా విఫలమవుతున్న కీపర్ రిషబ్ పంత్‌కు కోహ్లీ మద్దతుగా ఉన్నాడు. దీంతో సంజు శాంసన్‌కు మరోసారి నిరాశే ఎదురుకావొచ్చు. పంత్‌ ఈ మ్యాచ్‌లో మెరుపులు మెరిపించకపోతే.. జట్టులో స్థానం గల్లంతయ్యే అవకాశాలున్నాయి.

దూబే జోరు కొనసాగిస్తే:

దూబే జోరు కొనసాగిస్తే:

బ్యాటింగ్‌ ఆర్డర్‌లో ప్రమోషన్‌ పొంది మంచి ఇన్నింగ్స్‌తో అలరించిన ముంబై ఆల్‌రౌండర్‌ శివం దూబే అదే జోరు కొనసాగిస్తే మిడిలార్డర్‌లో భారత్‌ గట్టెక్కుతుంది. ఇతనికి తోడు మరో ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా కూడా బ్యాట్ జుళిపిస్తే తిరుగుండదు. అయితే స్లాగ్‌ ఓవర్లపై భారత బ్యాట్స్‌మెన్‌ దృష్టి పెట్టాల్సి ఉంటుంది.

సుందర్‌ స్థానంలో కుల్‌దీప్‌:

సుందర్‌ స్థానంలో కుల్‌దీప్‌:

పేసర్ భువనేశ్వర్ కుమార్ త్వరగా లయ అందుకోవాల్సి ఉంది. భారీగా పరుగులు ఇస్తున్న దీపక్‌ చాహర్‌ స్థానంలో మొహమ్మద్ షమీని తీసుకునే అవకాశం ఉంది. అయితే చాహర్‌ భవిష్యత్ ఆశాకిరణం కాబట్టి కోహ్లీ ఆడించేందుకు మొగ్గుచూపొచ్చు. వాషింగ్టన్‌ సుందర్‌ పవర్‌ప్లేలో పరుగులను నియంత్రిస్తున్నా.. వికెట్లు తీయకపోవడం ఆందోళనకరం. గత ఐదు మ్యాచ్‌ల్లో కేవలం 3 వికెట్లే పడగొట్టాడు. దీంతో సుందర్‌ బదులు కుల్‌దీప్‌ను పరీక్షించినా ఆశ్చర్యం లేదు. యుజువేంద్ర చహల్ కీలక స్పిన్నర్ అన్న విషయం తెలిసిందే.

జోష్‌లో వెస్టిండీస్‌:

జోష్‌లో వెస్టిండీస్‌:

కెప్టెన్‌ కీరన్‌ పొలార్డ్‌ సారథ్యంలో వెస్టిండీస్‌ బలంగా ఉంది. బౌలింగ్‌లో కాస్త బలహీనంగా ఉన్నా.. బ్యాటింగ్‌లో మాత్రం దుమ్ములేపుతోంది. సిమన్స్‌, లూయిస్‌, కింగ్‌, హెట్‌మైర్‌, పూరన్‌, పొలార్డ్‌, హోల్డర్‌ అంతా మంచి టచ్‌లో ఉన్నారు. ముంబై ఇండియన్స్‌ తరఫున వాంఖడేలో చాలా మ్యాచ్‌లు ఆడిన పొలార్డ్‌ అనుభవం జట్టుకు కలిసిరానుంది. పేసర్లు హోల్డర్‌, కాట్రెల్‌, కెస్రిక్‌తో పాటు లెగ్‌ స్పిన్నర్‌ హెడెన్‌ వాల్ష్‌ రాణిస్తే.. కోహ్లీసేనకు కష్టాలు తప్పకపోవచ్చు.

పిచ్‌, వాతావరణం:

పిచ్‌, వాతావరణం:

వాంఖడే వికెట్‌ అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ లక్ష్యఛేదన చాలా సులువు. టాస్‌ నెగ్గిన జట్టు ఫీల్డింగే ఎంచుకుంటుంది. మంచుకురిసే రాత్రి వేళ బౌలర్లకు పట్టుదొరకడం కష్టం కావొచ్చు.పేస్‌తో పాటు చక్కటి బౌన్స్‌తో పేసర్లు రాణించవచ్చు. ఏవిధంగా బ్యాట్స్‌మెన్‌కు కూడా పండగే. వాతావరణం చల్లగా ఉండనుంది. మ్యాచ్‌కు వరుణుడి ముప్పు లేదు.

తుది జట్లు (అంచనా):

తుది జట్లు (అంచనా):

భారత్: రోహిత్ శర్మ, లోకేశ్ రాహుల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్‌, శివమ్‌ దూబె, రవీంద్ర జడేజా, భువనేశ్వర్ కుమార్, దీపక్‌ చాహర్‌/మొహమ్మద్ షమీ, వాషింగ్టన్‌ సుందర్‌/ కుల్‌దీప్‌ యాదవ్, యుజువేంద్ర చహల్.

వెస్టిండీస్‌: పొలార్డ్‌ (కెప్టెన్‌), సిమన్స్‌, లూయిస్‌, కింగ్‌, హెట్‌మైర్‌, పూరన్‌, హోల్డర్‌, పియర్‌, కెస్రిక్‌, కాట్రెల్‌, వాల్ష్‌.

Story first published: Wednesday, December 11, 2019, 9:07 [IST]
Other articles published on Dec 11, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+