చెన్నైలో 3వ టీ20: బుమ్రా, ఉమేశ్, కుల్దీప్‌లకు విశ్రాంతి


హైదరాబాద్: భారత్-వెస్టిండిస్ జట్ల మధ్య ఆదివారం చెన్నై వేదికగా జరిగే మూడో టీ20కి ప్రధాన పేసర్లు ఉమేశ్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, చైనామన్ కుల్దీప్ యాదవ్‌లకు టీమ్ మేనేజ్‌మెంట్ విశ్రాంతిని కల్పించింది. అలాగే యువబౌలర్ సిద్దార్థ్ కౌల్‌కు అవకాశం కల్పించింది.
3వ టీ20లో సిద్దార్థ్ కౌల్‌కు అవకాశం
ఈ మేరకు బీసీసీఐ శుక్రవారం ట్వీట్ చేసింది. మూడు టీ20ల సిరిస్‌ను ఇప్పటికే టీమిండియా 2-0తో కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. రంజీ క్రికెట్‍లో పంజాబ్ జట్టు తరపున అద్భుత ప్రదర్శన కనబర్చిన సిద్దార్థ్ కౌల్‌కు ఆఖరి టీ20లో సెలక్టర్లు చోటు కల్పించారు.

మూడు వన్డేలు, రెండు టీ20లు ఆడిన కౌల్
భారత్ తరపున కౌల్ ఇప్పటివరకు మూడు వన్డేలు, రెండు టీ20లు ఆడాడు. వన్డేల్లో ఒక్క వికెట్ కూడా తీయనప్పటికి టీ20ల్లో మాత్రం మాడు వికెట్లు తీశాడు. నవంబర్ 21 నుంచి కోహ్లీ నాయకత్వంలోని టీమిండియా ఆస్ట్రేలియా జట్టుతో తలపడనుంది. ఇందులో భాగంగా ఈ ముగ్గురు బౌలర్లకు విశ్రాంతి కల్పించినట్లు తెలుస్తోంది.

కోహ్లీకి విశ్రాంతి
ఆస్ట్రేలియా పర్యటనను దృష్టిలో ఉంచుకుని టీమిండియా రెగ్యులర్ కెప్టెన్ విరాట్ కోహ్లీకి ప్రస్తుతం జరుగుతున్న టీ20 సిరిస్ నుంచి సెలక్టర్లు విశ్రాంతినిచ్చిన సంగతి తెలిసిందే. దీంతో రోహిత్ శర్మకు కెప్టెన్సీ పగ్గాలు అప్పగించారు.
విండీస్‌తో జరిగిన రెండు టీ20ల్లో స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ మొత్తం ఐదు వికెట్లు పడగొట్టాడు. కోల్‌కతా వేదికగా జరిగిన తొలి మ్యాచ్‌లో 13పరుగులిచ్చి మూడు వికెట్లు తీశాడు. ఇక ఫాస్ట్ బౌలర్ బుమ్రా కూడా రెండు మ్యాచ్‌ల్లో మూడు వికెట్లు పడగొట్టగా, ఉమేశ్ యాదవ్ తొలి మ్యాచ్‌లో మాత్రమే ఆడాడు.

3వ టీ20కి టీమిండియా:
రోహిత్ శర్మ(కెప్టెన్), శిఖర్ ధావన్, కేఎల్ రాహుల్, దినేశ్ కార్తీక్(వికెట్ కీపర్), మనీష్ పాండే, శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్(వికెట్ కీపర్), కృనాల్ పాండ్యా, వాషింగ్టన్ సుందర్, యజువేంద్ర చాహాల్, భువనేశ్వర్ కుమార్, ఖలీల్ అహ్మద్, నదీమ్, సిద్ధార్ద్ కౌల్
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications