For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

'కోహ్లీసేన భయం లేకుండా ఆడింది.. ప్రతిఒక్కరూ గెలుపు కోసం శ్రమించారు'

India vs West Indies 3rd T20: Sourav Ganguly lauds Team India for fearless batting

ముంబై: భారత మాజీ కెప్టెన్, బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ సిరీస్ గెలిచిన టీమిండియాపై ప్రశంసలు కురిపించారు. నిర్ణయాత్మక మూడో టీ20లో కోహ్లీసేన భయం లేకుండా ఆడింది. జట్టులోని ప్రతిఒక్కరూ తమ స్థానాల కోసం కాకుండా దేశాన్ని గెలిపించడం కోసం ఆడారు అని గంగూలీ అన్నారు. కీలక పోరులో టీమిండియా ఓడుతుందని ఎవరూ అనుకోరని, టీమిండియా విజయం సాధించడంలో నాకు ఆశ్చర్యమేమి కలగలేదని ఆయన పేర్కొన్నారు.

వెల్‌డన్‌ టీమిండియా:

వెల్‌డన్‌ టీమిండియా:

తాజాగా టీమిండియాను అభినందిస్తూ సౌరవ్ గంగూలీ ట్వీట్ చేశారు. 'భారత్ సిరీస్‌ను కోల్పోతుందని చాలా మంది అనుకోరు. టీమిండియా గెలుపు నాకు ఆశ్చర్యం కలిగించలేదు. ఈ మ్యాచ్‌లో భారత్‌ అత్యద్భుతంగా బ్యాటింగ్‌ చేసింది. కోహ్లీసేన భయం లేకుండా ఆడింది. ప్రతిఒక్కరూ తమ స్థానాల కోసం కాకుండా దేశాన్ని గెలిపించడం కోసం ఆడారు. వెల్‌డన్‌ టీమిండియా' అంటూ దాదా ట్వీట్‌లో రాసుకొచ్చారు.

భారత్ భారీ విజయం:

భారత్ భారీ విజయం:

మూడో టీ20లో వెస్టిండీస్‌పై భారత్ 67 పరుగుల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. ముందుగా బ్యాటింగ్‌కు చేసిన భారత్‌ 20 ఓవర్లలో 3 వికెట్లకు 240 పరుగుల భారీ స్కోరు చేసింది. రోహిత్‌ శర్మ (71), కేఎల్ రాహుల్ (91), విరాట్ కోహ్లీ (70) చెలరేగారు. లక్ష్య ఛేదనలో వెస్టిండీస్‌ 20 ఓవర్లలో 8 వికెట్లకు 173 పరుగులు చేసింది. కెప్టెన్ పొలార్డ్‌ (39 బంతుల్లో 68; 5 ఫోర్లు, 6 సిక్స్‌లు) రాణించాడు. భారత బౌలర్లలో దీపక్‌ చాహర్, భువనేశ్వర్, మొహమ్మద్ షమీ, కుల్దీప్‌ యాదవ్ తలా రెండు వికెట్లు తీశారు.

చెన్నైలో తొలి వన్డే:

ఈనెల 15 నుంచి భారత్‌, వెస్టిండీస్‌ జట్లు మూడు వన్డేలు ఆడనున్న విషయం తెలిసిందే. తొలి వన్డే ఈనెల 15న చెన్నైలో.. రెండో వన్డే 18న విశాఖపట్నంలో.. మూడో వన్డే 22న కటక్‌లో జరుగుతాయి. గాయపడిన రెగ్యులర్ ఓపెనర్ శిఖర్‌ ధావన్‌ స్థానంలో టెస్టు ఓపెనర్‌ మయాంక్‌ అగర్వాల్‌కు బీసీసీఐ సెలెక్టర్లు అవకాశం ఇచ్చారు. వెస్టిండీస్‌తో జరిగే మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌కు బుధవారం సెలెక్టర్లు 15 మందితో కూడిన జట్టును ప్రకటించారు. మయాంక్‌ చోటు దక్కించుకోవడంతో సంజూ శాంసన్‌కు నిరాశే ఎదురైంది.

Story first published: Thursday, December 12, 2019, 16:23 [IST]
Other articles published on Dec 12, 2019
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+