3rd T20: స్వదేశంలో టీ20ల్లో 1000 పరుగులు: చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లీ

హైదరాబాద్: వాంఖడె వేదికగా వెస్టిండిస్‌తో జరుగుతున్న మూడో టీ20లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అరుదైన ఘనత సాధించాడు. స్వదేశంలో టీ20ల్లో వెయ్యి పరుగులు పూర్తి చేసిన భారత తొలి క్రికెటర్‌గా నిలిచాడు. హేడెన్ వాల్స్ వేసిన 14వ ఓవర్ ఆఖరి బంతిని సిక్స్‌గా మలచడం ద్వారా కోహ్లీ ఈ ఘనత సాధించాడు.
ఈ మ్యాచ్‌కి ముందు ఈ మైలురాయిని అందుకోవడానికి కోహ్లీ మరో 6 పరుగుల దూరంలో ఉన్నాడు. రిషబ్ పంత్ ఔటైన తర్వాత క్రీజులోకి వచ్చిన విరాట్ కోహ్లీ మరింత దూకుడుగా ఆడుతున్నాడు. ఈ క్రమంలోనే స్వదేశంలో టీ20ల్లో వెయ్యి పరుగులు సాధించిన తొలి భారత క్రికెటర్‌గా అరుదైన రికార్డుని తన ఖాతాలో వేసుకున్నాడు.
మొత్తంగా టీ20ల్లో ఈ ఘనత సాధించిన మూడో ఆటగాడిగా నిలిచాడు. అంతకముందు న్యూజిలాండ్ ఓపెనర్ మార్టిన్ గుప్టిల్(1430), కోలిన్ మున్రో(1000) ఈ ఘనత సాధించారు. సొంతగడ్డపై విరాట్ కోహ్లీ ఇప్పటివరకు 29 ఇన్నింగ్స్‌లు ఆడి ఈ పరుగులు సాధించాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications