Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

400 సిక్సుల క్లబ్‌లో రోహిత్ శర్మ: తొలి భారత క్రికెటర్‌గా రికార్డు

India vs West Indies 3rd T20, Live Score: Rohit Sharma to bring up 400 sixes in international cricket

హైదరాబాద్: వాంఖడె వేదికగా వెస్టిండిస్‌తో జరుగుతున్న మూడో టీ20లో టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ అరుదైన రికార్డుని తన ఖాతాలో వేసుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో అన్ని ఫార్మాట్లలో కలిపి 400 అంతర్జాతీయ సిక్సర్లు బాదిన తొలి భారత క్రికెటర్‌గా చరిత్ర సృష్టించాడు.

షెల్టర్ కాట్రెల్ వేసిన ఓవర్‌లో

బుధవారం విండిస్‌తో ప్రారంభమైన ఆఖరి టీ20లో వెస్టిండిస్ బౌలర్ షెల్టర్ కాట్రెల్ వేసిన ఇన్నింగ్స్ మూడో ఓవర్ తొలి బంతిని సిక్స్‌గా మలిచి రోహిత్ శర్మ ఈ రికార్డుని తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ మ్యాచ్‌కి ముందు రోహిత్ శర్మ ఈ మైలురాయిని అందుకోవడానికి కేవలం ఒక సిక్స్ దూరంలో ఉన్నాడు.

డీప్ మిడ్ వికెట్ మీదుగా

షెల్టర్ కాట్రెల్ వేసిన లెంత్ బాల్‌ను ముందు కొచ్చి డీప్ మిడ్ వికెట్ మీదుగా రోహిత్ భారీ సిక్సుగా మలిచాడు. ఫలితంగా అంతర్జాతీయ క్రికెట్‌లో 400 సిక్సర్లు బాదిన తొలి భారత క్రికెటర్‌గా నిలిచాడు. మూడు ఫార్మాట్లు కలిపి 400కు పైగా సిక్సర్లు బాదిన ఆటగాళ్ల జాబితాలో షాహిద్ అఫ్రిది(పాకిస్థాన్), క్రిస్ గేల్(వెస్టిండిస్)లు మాత్రమే ఉన్నారు.

534 సిక్సర్లతో క్రిస్ గేల్ అగ్రస్థానంలో

ఈ జాబితాలో 534 సిక్సర్లతో క్రిస్ గేల్ అగ్రస్థానంలో ఉండగా... అఫ్రిది 476 సిక్సులతో రెండో స్థానంలో ఉన్నాడు. ఇప్పుడు వీరి సరసన రోహిత్ శర్మ చేరాడు. ఇప్పటివరకు వన్డేల్లో 232 సిక్సులు, టెస్టుల్లో 52, టీ20ల్లో 116 సిక్సులతో రోహిత్ శర్మ ఖాతాలో మొత్తం 400 సిక్సులు ఉన్నాయి.

అత్యధిక సిక్సులు బాదిన ఆటగాడిగా రోహిత్

దీంతో పాటు ఈ ఏడాది అత్యధిక సిక్సులు బాదిన ఆటగాళ్ల జాబితాలో రోహిత్ శర్మ అగ్రస్థానంలో ఉన్నాడు. ఇప్పటికే 68 సిక్సులు బాదాడు. కాగా, 2017లో 65 సిక్సులు బాదిన రోహిత్ శర్మ.... 2018లో 74 సిక్సులు బాదాడు. భారత పర్యటనలో భాగంగా వెస్టిండిస్ జట్టు 3 టీ20లు, 3 వన్డేల సిరిస్ ఆడుతోంది.

Story first published: Wednesday, December 11, 2019, 19:47 [IST]
Other articles published on Dec 11, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+