For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ముంబైలో 3rd T20: కేఎల్ రాహుల్ సెంచరీ మిస్, విండిస్ విజయ లక్ష్యం 241

India vs West Indies 3rd T20, Live Score: Rahul, Rohit, Kohli fireworks help India post 240

హైదరాబాద్: వాంఖడె వేదికగా వెస్టిండిస్‌తో జరుగుతున్న ఆఖరి టీ20లో భారత బ్యాట్స్‌మెన్ చెలరేగారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 240 పరుగులు చేసింది. ఫలితంగా వెస్టిండిస్ జట్టుకు 241 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది.

భారత జట్టులో రోహిత్‌శర్మ(71; 34 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్సులు), కేఎల్‌ రాహుల్‌(91; 56 బంతుల్లో 9 ఫోర్లు, 4 సిక్సులు), విరాట్‌ కోహ్లీ(70; 29 బంతుల్లో 4 ఫోర్లు, 7 సిక్సులు) హాఫ్ సెంచరీలతో చెలరేగారు. వెస్టిండిస్ బౌలర్లలో షెల్డన్ కాట్రెల్, విలియమ్స్, కీరన్ పొలార్డ్ తలో వికెట్ తీసుకున్నారు.

టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న వెస్టిండిస్
అంతకముందు టాస్ గెలిచి వెస్టిండిస్ కెప్టెన్ కీరన్ పొలార్డ్ టీమిండియాను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. వాంఖెడే పిచ్‌ బ్యాటింగ్‌కు అనుకూలించడంతో పాటు ఛేజింగ్‌కు సులువు అవుతుందనే ఉద్దేశంతో పొలార్డ్‌ ఈ నిర్ణయం తీసుకున్నాడు. ఈ మ్యాచ్‌‌లో రెండు కీలక మార్పులు చేసింది.

1
46123

ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా, మణికట్టు స్పిన్నర్‌ యజ్వేంద్ర చహల్‌ల స్థానంలో మహ్మద్‌ షమీ, కుల్దీప్‌ యాదవ్‌లు జట్టులోకి వచ్చారు. గత రెండు మ్యాచ్‌ల్లో ఫీల్డింగ్‌లో పేలవ ప్రదర్శన కనబర్చిన వాషింగ్టన్‌ సుందర్‌ను కోహ్లీ పక్కకు పెడతాడని అంతా భావించారు.

అయితే, టీమ్‌ మేనేజ్‌మెంట్‌ అతడికి మరోసారి అవకాశం కల్పించింది. మరోవైపు విండీస్‌ జట్టులో ఎలాంటి మార్పులు చోటుచేసుకోలేదు. గత మ్యాచ్‌‌లో ఆడిన జట్టుతోనే బరిలోకి దిగుతోంది. ఈ ఏడాది ఆగస్టులో టీమిండియా విండీస్‌ పర్యటన సందర్భంగా కరీబియన్‌ జట్టును వైట్‌వాష్‌ చేసిన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో కోహ్లీసేనపై విజయం సాధించి విండీస్‌ ప్రతీకారం తీర్చుకోవాలని భావిస్తోంది. దీంతో ఈ మ్యాచ్ ఆసక్తికరంగా మారింది. వాంఖడె స్టేడియంలో ఇప్పటివరకు జరిగిన 6 టీ20ల్లో తొలుత ఫీల్డింగ్ ఎంచుకున్న జట్టు ఐదు సార్లు విజయం సాధించగా... ఒకసారి మాత్రమే ఓటమిపాలైంది.

మూడు టీ20ల సిరిస్‌లో ఇరు జట్లు చెరో మ్యాచ్ గెలవడంతో సిరిస్ 1-1తో సమం అయింది. దీంతో ఈ మ్యాచ్ కీలకంగా మారింది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు సిరిస్ విజేతగా నిలుస్తుంది. మూడేళ్ల క్రితం టీ20 వరల్డ్‌కప్ సెమీఫైనల్లో విండీస్‌ చేతిలో ఓడాక ఇరు జట్లు తొలిసారి వాంఖడేలో తలపడుతున్నాయి.

జట్ల వివరాలు:
ఇండియా: రోహిత్ శర్మ, లోకేష్ రాహుల్, విరాట్ కోహ్లీ (కెప్టెన్), రిషబ్ పంత్ (వికెట్ కీపర్), శ్రేయాస్ అయ్యర్, శివం దుబే, వాషింగ్టన్ సుందర్, భువనేశ్వర్ కుమార్, కుల్దీప్ యాదవ్, దీపక్ చాహర్, మహ్మద్ షమీ

వెస్టిండీస్: లెండ్ల్ సిమన్స్, ఎవిన్ లూయిస్, బ్రాండన్ కింగ్, షిమ్రాన్ హెట్మియర్, నికోలస్ పూరన్ (వికెట్ కీపర్), కీరోన్ పొలార్డ్ (కెప్టెన్), జాసన్ హోల్డర్, ఖారీ పియరీ, హేడెన్ వాల్ష్, షెల్డన్ కాట్రెల్, కెస్రిక్ విలియమ్స్

Story first published: Wednesday, December 11, 2019, 21:05 [IST]
Other articles published on Dec 11, 2019
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+