బీసీసీఐ ట్వీట్.. హార్దిక్, రాహుల్‌ల మధ్య ఏం జరుగుతుంది?!!

ముంబై: బుధవారం వాంఖెడే మైదానంలో జరిగిన చివరి టీ20లో భారత్ 67 పరుగుల తేడాతో విండీస్‌పై భారీ విజయం సాధించింది. దీంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 2-1తో సొంతం చేసుకుంది. కేఎల్ రాహుల్ (91), రోహిత్ శర్మ (71), విరాట్ కోహ్లీ (70) ఆకాశమే హద్దుగా చెలరేగడంతో మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా 240 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనకు బరిలోకి దిగిన విండీస్ 173 పరుగులే చేసింది. దీపక్ చాహర్, భువీ, షమీ, కుల్‌దీప్ రెండేసి వికెట్లు తీశారు.

డ్రెస్సింగ్ రూమ్ బోసిపోయింది:
మ్యాచ్ అనంతరం టీమిండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా స్టేడియానికి వచ్చి సహచర క్రికెటర్లను కలిశాడు. ఈ సందర్భంగా తన బెస్ట్ ఫ్రెండ్ కేఎల్ రాహుల్‌ను ఇంటర్వ్యూ చేసాడు. నేను లేకుండా ఆడేస్తున్నారు అని రాహుల్‌తో హార్దిక్ అన్నాడు. 'నీ కోసమే చూస్తున్నాం. డ్రెస్సింగ్ రూమ్‌కు తొందరగా రా. నువ్వు లేక డ్రెస్సింగ్ రూమ్ బోసిపోయింది. కనీసం నా కోసమైనా వచ్చేయ్' అంటూ రాహుల్ అన్నాడు.

బెస్ట్ ఫ్రెండ్స్ మధ్య ఏం జరుగుతుంది:
దీనికి సంబంధించి వీడియోను భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) తన అధికారిక ట్వీటర్ ఖాతాలో పోస్ట్ చేసింది. 'ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ తిరిగి కలిసినప్పుడు 'వాంఖడేలో ఏం జరుగుతుంది? అని ట్వీట్ చేసింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అభిమానులు తమదైన స్టయిల్లో కామెంట్లు పెడుతున్నారు.

అతియా శెట్టితో డేటింగ్:
హార్దిక్ పాండ్యా, కేఎల్ రాహుల్‌లు బెస్ట్ ఫ్రెండ్స్ అని అందరికి తెలిసిన విషయమే. ఇద్దరూ జట్టులో ఉంటే ఆ హడావుడే వేరు. ప్రపంచకప్ ముందు 'కాఫీ విత్ కరణ్' షోలో పాల్గొని మహిళల గురించి అసభ్యంగా మాట్లాడి వార్తల్లోకి ఎక్కారు. బీసీసీఐ కూడా ఈ వ్యవహారాన్ని చాలా సీరియస్‌గానే తీసుకుంది. కొన్ని మ్యాచ్‌ల సస్పెన్ కూడా విధించింది. ఇదిలా ఉంటే.. బాలీవుడ్ సీనియర్ నటుడు సునీల్ శెట్టి కుమార్తె అతియా శెట్టితో రాహుల్ డేటింగ్ చేస్తున్న విషయం తెలిసిందే.
ప్రతి మ్యాచ్ ఎంతో కీలకం:
ప్రెజెంటేషన్ సమయంలో రాహుల్ మాట్లాడుతూ... 'సిరీస్‌ను గెలిచినందుకు ఎంతో సంతోషంగా ఉంది. వచ్చే ఏడాది టీ20 ప్రపంచకప్ ఉంది. ఇక ప్రతి మ్యాచ్ ఎంతో కీలకమైనది. వాటి నుంచి ఎన్నో పాఠాలు నేర్చుకోవచ్చు. మొదటగా బ్యాటింగ్ చేసి విజయాలు సాధించిన రికార్డులు తక్కువగా ఉన్నాయి. ఈ రోజు మంచి అవకాశం లభించింది. ఈ మ్యాచ్‌తో మాలో ఆత్మవిశ్వాసం పెరిగింది. తొలుత బ్యాటింగ్ చేయాల్సి వచ్చినప్పుడు ఎలా ఆడాలో అర్థమైంది' అని తెలిపాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications