Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

శార్దూల్‌ ఠాకూర్‌ ఆటకు కోహ్లీ ఫిదా.. హ్యాట్సాఫ్‌ అంటూ ప్రశంసలు!!

India vs West Indies 3rd ODI: Virat Kohli posts a cheeky tweet for Shardul Thakur

కటక్: ఆదివారం బారాబతి స్టేడియంలో విండీస్‌తో జరిగిన మూడో వన్డేలో టీమిండియా 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 316 పరుగుల లక్ష్య ఛేదనలో ఓపెనర్లు కేఎల్ రాహుల్‌ (89 బంతుల్లో 77; 8 ఫోర్లు, 1 సిక్స్‌), రోహిత్‌ శర్మ (63 బంతుల్లో 63; 8 ఫోర్లు, 1 సిక్స్‌) లు అర్ధ సెంచరీలు చేయగా.. కెప్టెన్ విరాట్ కోహ్లీ (81 బంతుల్లో 85; 9 ఫోర్లు) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. అయితే చివర్లో పేసర్ శార్దూల్‌ ఠాకూర్‌ ఆడిన ఇన్నింగ్స్‌ మ్యాచ్‌కే హైలైట్‌గా నిలిచింది.

తొలి బంతికే బౌండరీ

తొలి బంతికే బౌండరీ

విండీస్ పేసర్ కీమో పాల్‌ వేసిన 47వ ఓవర్‌ తొలి బంతికి కోహ్లీ ఔట్‌ కాగానే భారత అభిమానులు విజయంపై ధీమాగా లేరు. ఒకవైపు ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా ఉన్నా.. మరోవైపు బౌలర్లు ఉండడంతో అభిమానులు కాస్త కంగారుపడ్డారు. సరిగ్గా ఆ సమయంలో క్రీజ్‌లోకి వచ్చిన శార్దూల్‌.. తాను ఆడిన తొలి బంతినే బౌండరీ బాదాడు. ఇక కాట్రెల్‌ వేసిన 48 ఓవర్‌ మూడో బంతిని సిక్స్‌ కొట్టిన శార్దూల్‌.. ఆ ఓవర్‌ నాలుగో బంతిని ఫోర్‌ కొట్టాడు.

6 బంతుల్లో 17 పరుగులు

6 బంతుల్లో 17 పరుగులు

శార్దూల్‌ ఠాకూర్‌ 6 బంతులు ఆడి 2 ఫోర్లు, 1 సిక్స్‌తో అజేయంగా 17 పరుగులు సాధించడంతో భారత్‌ సునాయాస విజయాన్ని అందుకున్నాడు. అందరూ జడేజా మ్యాచ్‌ను గెలిపిస్తాడు అనుకుంటుండగా.. శార్దూల్‌ అందరి అంచనాలను తక్రిందులు చేస్తూ ఒంటిచేత్తో టీమిండియాకు అపురూప విజయాన్ని అందించాడు. ఈ ఒక్క ఇన్నింగ్స్‌తో శార్దూల్‌ ఓవర్ నైట్ స్టార్ అయ్యాడు.

హ్యాట్సాఫ్‌ ఠాకూర్‌:

హ్యాట్సాఫ్‌ ఠాకూర్‌:

మ్యాచ్‌ అనంతరం మైదానంలోకి వచ్చిన కోహ్లీ విన్నింగ్ జోడి జడేజా-శార్దూల్‌లను అభినందించాడు. ప్రత్యేకంగా శార్దూల్‌ను భుజంపై తడిమి ప్రశంసించాడు. శార్దూల్‌ ఆటకు ఫిదా అయిన కోహ్లీ ట్వీటర్‌లో సైతం శార్దూల్‌ను కొనియాడాడు. మరాఠీ భాషలో 'తులా మాన్లా రే ఠాకూర్‌' (హ్యాట్సాఫ్‌ ఠాకూర్‌) అంటూ రాసుకొచ్చాడు. ఇద్దరు కలిసి దిగిన ఓ ఫొటోను షేర్ చేసాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. శార్దూల్‌ ఆడేటప్పుడు డగౌట్‌లో ఉన్న కోహ్లీ సహచరులతో తెగ ఎంజాయ్ చేసాడు.

కోహ్లీకి మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌:

అద్భుత ఇన్నింగ్స్ ఆడిన కోహ్లీ 'మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌'కు ఎంపికయ్యాడు. ఈ మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ కోహ్లీకి 57వది. దీంతో అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక మ్యాన్ ఆఫ్‌ ది మ్యాచ్‌లు అందుకున్న క్రికెటర్ల జాబితాలో దక్షిణాఫ్రికా దిగ్గజం జాక్వస్‌ కలిస్‌ (57)తో సమంగా నిలిచాడు. అంతేకాదు వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లలో కలిస్‌ (11,579)ను అధిగమించాడు. కోహ్లీ 11,609 పరుగులతో ఏడో స్థానానికి చేరుకున్నాడు.

Story first published: Monday, December 23, 2019, 12:18 [IST]
Other articles published on Dec 23, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+