పుణెలో మూడో వన్డే: హోప్ సెంచరీ మిస్, భారత్ విజయ లక్ష్యం 284

హైదరాబాద్: పుణె వేదికగా భారత్‌తో జరుగుతున్న మూడో వన్డేలో వెస్టిండిస్ బ్యాట్స్‌మన్ షాయ్ హోప్ (95, 113 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సులు) చెలరేగగా, చివర్లో ఆష్లే నర్స్ (40, 22 బంతుల్లో 4 పోర్లు, 2 సిక్సులు) మెరుపు ఇన్నింగ్స్ ఆడటంతో నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి విండీస్ 283 పరుగులు చేసింది. దీంతో టీమిండియాకు 284 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది.
హోప్‌తో పాటు.. విండీస్ బ్యాట్స్‌మెన్లలో హెట్‌మెయిర్(37), జాసన్ హోల్డర్(32) మాత్రమే చెప్పుకోదగ్గ ప్రదర్శన చేశారు. దాదాపు నెల తర్వాత మళ్లీ భారత జట్టులోకి వచ్చిన భువనేశ్వర్ కుమార్ 10 ఓవర్లు వేసి ఏకంగా 70 పరుగులు సమర్పించుకోగా.. జస్‌ప్రీత్ బుమ్రా 35 పరుగులు మాత్రమే ఇచ్చి నాలుగు కీలక వికెట్లు పడగొట్టగా... కుల్దీప్ రెండు, ఖలీల్ అహ్మద్ ఒక వికెట్ తీశారు.

టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన వెస్టిండిస్
ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన వెస్టిండిస్ జట్టుకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఈ మ్యాచ్‌తో జట్టులోకి వచ్చిన భారత పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా విండీస్‌ను దెబ్బతీశాడు. ఓపెనర్లు పోవెల్(21), హెమ్రాజ్(15)లను పెవిలియన్‌కు చేర్చాడు. ఈ మ్యాచ్‌లో హెమ్రాజ్ ఇచ్చిన క్యాచ్ ధోని అందుకున్న విధానం మ్యాచ్ వీక్షిస్తోన్న ప్రేక్షకులను ఆశ్చర్యపరిచింది.

ధోని స్టన్నింగ్ క్యాచ్
వరుస బంతుల్లో ఫోర్, సిక్స్ కొట్టి మంచి ఊపు మీదు ఉన్న హెమ్రాజ్ బ్యాక్‌వర్డ్ స్క్వేర్ లెగ్ దిశగా బౌండరీ కొట్టే యత్నం చేశాడు. కానీ బంతి టాప్ ఎడ్జ్ తీసుకోవడంతో గాల్లోకి లేచింది. దీంతో ఆ బంతిని అందుకోవడానికి ధోని పరుగుత్తుకుంటూ వెళ్లి మరి, అద్భుత డైవ్‌తో క్యాచ్ అందుకున్నాడు. ఆ తర్వాత శామ్యూల్స్‌ను ఖలీల్ పెవిలియన్ చేర్చగా.. క్రీజులోకి విధ్వంసకర బ్యాట్స్‌మన్ హెట్‌మెయిర్ వచ్చాడు.
హాఫ్ సెంచరీ దిశగా దూసుకెళ్లిన హెట్‌మెయర్
వచ్చి రావడంతోనే ఫోర్లు, సిక్స్‌లతో దాటిగా ఆడిన హెట్‌మెయిర్.. హాఫ్ సెంచరీ దిశగా దూసుకెళ్లాడు. ముఖ్యంగా.. స్పిన్నర్లని లక్ష్యంగా చేసుకుని హెట్‌మెయర్ భారీ సిక్సర్లు బాదేశాడు. జట్టు స్కోరు 111 వద్ద హిట్‌మెయర్‌ని ఔట్ చేయడం ద్వారా కుల్దీప్ యాదవ్ విడదీశాడు. ఆ తర్వాత ఒంటరిగా పోరాడుతూ విండీస్‌ను షాయ్ హోప్ మెరుగైనస్థితిలో నిలిపాడు.
95 పరుగుల వద్ద షాయ్ హోప్ ఔట్
సెంచరీకి చేరువగా వచ్చిన షెయ్ హోప్(95)ను కూడా బుమ్రానే ఔట్ చేసి విండీస్‌ను కట్టడి చేశాడు.44 ఓవర్‌లో చక్కటి బంతితో బుమ్రా హోప్‌ను బౌల్డ్ చేశాడు. చివర్లో క్రీజులోకి వచ్చిన ఆష్లే నర్స్ ఫోర్లు, సిక్సర్లతో భారత బౌలర్లపై విరుచుకుపడి పరుగుల వరద పారించాడు. చాహల్ వేసిన 45వ ఓవర్లో ఫోర్, సిక్స్ బాది నర్స్ వేగం అందుకున్నాడు.
49వ ఓవర్‌లో 21 పరుగులు రాబట్టిన నర్స్
ఆ తర్వాత భువీ వేసిన 49వ ఓవర్లో నర్స్ ఒక్కడే ఒక సిక్స్.. రెండు ఫోర్లు బాది 21 పరుగులు రాబట్టాడు. దీంతో వెస్టిండీస్ జట్టు 283 పరుగులు చేయగలిగింది. వెస్టిండీస్ జట్టులో 21 ఫోర్లు, 12 సిక్సర్లు నమోదవడం విశేషం. కాగా, భారత బౌలర్లలో బుమ్రా నాలుగు, కుల్దీప్ రెండు, ఖలీల్ అహ్మద్, చాహల్ చెరో వికెట్ తీసుకున్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications