Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

3వ వన్డే: ధోని మెరుపులు, వెస్టిండిస్‌పై భారత్ ఘన విజయం

హైదరాబాద్: వెస్టిండిస్‌తో జరిగిన మూడో వన్డేలో టీమిండియా 93 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. 252 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండీస్‌ బ్యాట్స్‌ మెన్‌ పెవిలియన్‌కు క్యూ కట్టారు. ఏ ఒక్క బ్యాట్స్‌మన్‌ క్రీజులో నిలదొక్కుకునే ప్రయత్నం చేయకపోవడంతో విండీస్‌ 38.1 ఓవర్లలో 158 పరుగులకే ఆలౌటైంది.

భారత స్పిన్నర్లు అశ్విన్‌(3/28), కుల్‌దీప్‌ యాదవ్‌(3/41)ల దెబ్బకు కరీబియన్లు తోకముడిచారు. ఇక విండీస్‌ ఆటగాళ్లలో మొహమ్మద్ (40) పరుగులతో టాస్ స్కోరర్‌గా నిలిచాడు. ఆ తర్వాత పావెల్‌(30), షాయ్‌ హోప్(23), హోప్(19)లు మినహా ఎవరూ రెండెంకల పరుగులు చేయలేదు.

Jason Holder invites Virat Kohli to bat first

ఐదు వన్డేల సిరీస్‌లో భారత్‌ 2-0తో ఆధిక్యం సాధించింది. భారత బౌలర్లలో కుల్దీప్‌ యాదవ్‌ 3 వికెట్లతో మరోసారి రెచ్చిపోగా, అశ్విన్‌ కూడా 3 వికెట్లు తీసి తన సత్తా చాటాడు. ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా రెండు వికెట్లు తీయగా, పేసర్‌ ఉమేశ్‌ యాదవ్‌, పార్ట్‌టైమ్‌ బౌలర్‌ జాదవ్‌లకు తలో వికెట్‌ దక్కింది.

అంతకు ముందు టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ నిర్ణీత 50 ఓవర్లకు 4 వికెట్లు కోల్పోయి 251 పరుగులు చేసింది. ధోని(78), రహానేల(71) అర్ధ సెంచరీలకు తోడు జాదవ్‌(40), యువరాజ్‌(39)లు రాణించారు. అద్భుతమైన బ్యాటింగ్‌తో అదరగొట్టిన ధోనికి మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు లభించింది.

టాస్ గెలిచి వెస్టిండిస్ ఫీల్డింగ్

అంతకు ముందు టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ నిర్ణీత 50 ఓవర్లకు 4 వికెట్లు కోల్పోయి 251 పరుగులు చేసింది. ఛాంపియన్స్‌ ట్రోఫీ నుంచి అద్భుత ప్రదర్శన చేస్తున్న ఓపెనర్‌ ధావన్‌ వరుసగా ఏడు మ్యాచ్‌ల అనంతరం తొలిసారిగా సింగిల్‌ డిజిట్‌కే అవుటయ్యాడు.

దీంతో భారత్‌కు చక్కటి శుభారంభం లభించలేదు. జట్టు స్కోరు 11 వద్ద ఫామ్‌లో ఉన్న శిఖర్‌ ధావన్‌(2) కమిన్స్‌ వేసిన మూడో ఓవర్లో వెనుదిరిగాడు. అనంతరం స్వల్ప వ్యవధిలోనే కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి(11)ని పెవిలియన్‌ పంపాడు. దీంతో 34 పరుగులకే భారత్ రెండు వికెట్లు కోల్పోయింది.

ఈ దశలో పేలవ ఫామ్‌తో ఒత్తిడిలో ఉన్న యువరాజ్‌ చక్కటి ఆటతీరుతో రహానేకు తోడ్పాటునందించాడు. కుదురుకునేందుకు కాస్త సమయం తీసుకున్న అతను ఆ తర్వాత స్వేచ్ఛగా ఆడాడు. చక్కటి ఫోర్లతో క్రీజులో కుదురుకుంటున్న దశలో బిషూ బౌలింగ్‌లో థర్డ్‌ అంపైర్‌ రివ్యూతో ఎల్బీగా వెనుదిరిగాడు.

Jason Holder invites Virat Kohli to bat first

మూడో వికెట్‌కు వీరి మధ్య 66 పరుగులు వచ్చాయి. దీంతో 26.1 ఓవర్లలో భారత్ 100 పరుగుల మైలురాయిని అందుకుంది. ఆ తర్వాత రహానే, ధోనిల జోడి ఇన్నింగ్స్‌ను నిర్మించింది. 83 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్న రహానే జట్టు స్కోరు 170 పరుగుల వద్ద కమిన్స్‌ బౌలింగ్‌లో రహానే అవుటయ్యాడు.

ధోని, రహానే నాలుగో వికెట్‌కు 70 పరుగులు జత చేశారు. క్రీజులో కుదురుకునేందుకు మొదట్లో నిదానంగా ఆడిన ధోనీ(78 నాటౌట్‌: 79 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సుల)తో ఆ తర్వాత చెలరేగాడు. కేదార్‌తో కలిసి వేగం పెంచిన ధోనీ 66 బంతుల్లో కెరీర్‌లో 63వ అర్ధసెంచరీని సాధించాడు.

ఆ తర్వాతి ఓవర్‌లో వరుసగా రెండు భారీ సిక్సర్లు కొట్టడంతో హోల్డర్ 17 పరుగులు సమర్పించుకున్నాడు. ఆ వెంటనే ఇద్దరు కలిసి ఫోర్లు బాదారు. ఫలితంగా ఐదో వికెట్‌కు 7.4 ఓవర్లలోనే అజేయంగా 81 పరుగులు జత చేయడంతో విండీస్ ముందు మంచి లక్ష్యాన్ని ఉంచగలిగారు.

Dhoni

ధోనీతో పాటు మరో ఎండ్‌లో ఉన్న కేదార్‌ జాదవ్‌(40 నాటౌట్‌: 26 బంతుల్లో 4 ఫోర్లు, ఒక సిక్సు) తనదైన శైలిలో విజృంభించడంతో భారత స్కోరు 250 పరుగులు దాటింది. ఇన్నింగ్స్‌ తొలి 40 ఓవర్లలో 151 పరుగులు సాధించిన టీమిండియా చివరి 10 ఓవర్లలో 100 పరుగులు చేసింది. అద్భుతమైన బ్యాటింగ్‌తో అదరగొట్టిన ధోనికి మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు లభించింది.

భారత్, వెస్టిండిస్ జట్ల మధ్య మూడో వన్డే ప్రారంభమైంది. నార్త్‌సౌండ్‌ వేదికగా వివ్‌ రిచర్డ్స్‌ మైదానంలో జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన వెస్టిండిస్ కెప్టెన్ జాసన్ హోల్డర్ ఫీల్డింగ్‌ ఎంచుకున్నాడు. స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ జట్టులోకి వచ్చాడు. యువ ఆటగాడు రిషబ్‌ పంత్‌కు మూడో వన్డేలో కూడా చోటు దక్కలేదు.

ఆంటిగ్వాలో ప్రస్తుతం భారీ వర్షాలు పడుతున్నాయి. ఈ క్రమంలో రాత్రి కురిసిన వర్షంతో మైదానం తడిగా ఉండటంతో టాస్‌ ఆలస్యమైంది. తొలి వన్డే వర్షం కారణంగా రద్దు కాగా రెండో వన్డేలో కోహ్లీ సేన భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే.

India Vs West Indies, 3rd ODI: Jason Holder invites Virat Kohli to bat first

దీంతో ఇప్పటికే సిరీస్‌లో 1-0తో ఉన్న కోహ్లీసేన ఆధిక్యాన్ని మరింత పెంచుకోవాలని చూస్తోంది. సొంతగడ్డపై పరువు కాపాడుకోవాలంటే ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ను సమం చేయాలని వెస్టిండిస్ ఉంది. మూడో వన్డేలో కోహ్లీ సేన ఫేవరేట్‌గా బరిలోకి దిగుతుంది.

జట్ల వివరాలు:
టీమిండియా: విరాట్ కోహ్లీ (కెప్టెన్‌), రహానే, ధావన్, యువరాజ్, ధోని, పాండ్యా, జాదవ్, కుల్దీప్, అశ్విన్, భువనేశ్వర్, ఉమేశ్‌ యాదవ్‌.
వెస్టిండిస్: జాసన్ హోల్డర్‌ (కెప్టెన్‌), లూయిస్, హోప్, షాయ్‌ హోప్, మొహమ్మద్, చేజ్, పావెల్‌, అంబ్రిస్, నర్స్, జోసెఫ్, బిషూ, కమిన్స్‌.

Story first published: Monday, November 13, 2017, 12:15 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+