పుణె వన్డేలో ధోని స్టన్నింగ్ క్యాచ్: తొలి వికెట్ బుమ్రాకే (వీడియో)

హైదరాబాద్: ఐదు వన్డేల సిరిస్‌లో భాగంగా వెస్టిండిస్‌తో పుణె వేదికగా జరుగుతున్న మూడో వన్డేలో వికెట్ కీపర్ మహేంద్ర సింగ్ ధోని సూపర్ క్యాచ్‌తో ఔరా అనిపించాడు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ వెస్టిండిస్ జట్టుని బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. బ్యాటింగ్ చేపట్టిన విండీస్ ఆరో ఓవర్‌లో తొలి వికెట్‌ను కోల్పోయింది.
చంద్రపాల్ హేమరాజ్
ఇన్నింగ్స్ ఆరో ఓవర్ వేసిన బుమ్రా బౌలింగ్‌లో ఓపెనర్ చంద్రపాల్ హేమరాజ్ (15: 20 బంతుల్లో 2 ఫోర్లు, ఒక సిక్స్) వరుసగా 4, 6 బాది.. తర్వాత బంతిని కూడా హిట్ చేసేందుకు ప్రయత్నించాడు. దీంతో బ్యాట్ ఎడ్జ్ తాకిన బంతి ఫైన్‌లెగ్‌లో గాల్లోకి లేవగా.. మెరుపు వేగంతో పరుగెత్తుకుంటూ వెళ్లిన వికెట్ కీపర్ ధోని డైవ్ కొట్టి మరీ క్యాచ్‌ని అందుకున్నాడు.
ధోని పరిగెత్తుకుంటూ వెళ్లి డైవ్
వాస్తవానికి ఫైన్‌లెగ్‌లో ఫీల్డింగ్ చేస్తున్న ఖలీల్ అహ్మద్ ఆ క్యాచ్‌ని అందుకుంటాడని అంతా భావించారు. కానీ, అతను బౌండరీ లైన్‌కి సమీపంలో ఉండటాన్ని గ్రహించిన ధోని పరిగెత్తుకుంటూ వెళ్లి డైవ్ చేస్తూ క్యాచ్‌ని అందుకున్నాడు. అప్పటికే వరుస బంతుల్లో ఫోర్, సిక్స్ కొట్టి మంచి ఊపు మీదు ఉన్న హెమ్రాజ్‌కు సైతం ధోని క్యాచ్‌ను అందుకున్న తీరు చూసి ప్రేక్షకులు ఆశ‍్చర్యపోయారు.
తొలి వికెట్ బుమ్రా సొంతమైంది
దీంతో మూడో వన్డేలో తొలి వికెట్ బుమ్రా సొంతమైంది. ధోని పట్టిన బెస్ట్ క్యాచ్‌ల్లో ఒకటిగా నిలుస్తుందని విశ్లేషకులు చర్చించుకుంటున్నారు. ఆ తర్వాత కొద్దిసేపటికే మరో ఓపెనర్ కీరన్ పొవెల్ (21) కూడా బుమ్రా బౌలింగ్‌లోనే స్లిప్‌లో రోహిత్ శర్మకి క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. దీంతో 13 ఓవర్లు ముగిసే సమయానికి వెస్టిండీస్ 55/2తో నిలిచింది.

మూడు మార్పులతో బరిలోకి దిగిన టీమిండియా
ఇదిలా ఉంటే ఈ మ్యాచ్‌లో భారత జట్టు మూడు మార్పులతో బరిలోకి దిగింది. ఉమేశ్ యాదవ్, షమీ, జడేజాల స్థానంలో భువనేశ్వర్, బుమ్రాతో పాటు ఖలీల్ అహ్మాద్‌లు తుది జట్టులో చోటు దక్కించుకున్నారు. ముగ్గురు పేసర్లతో భారత్ ఈ మ్యాచ్‌లో బరిలోకి దిగుతోంది. మరోవైపు తాము టాస్ గెలిస్తే, మొదట బౌలింగ్ చేసేవాళ్లమని విండీస్ కెప్టెన్ హోల్టర్ తెలిపాడు. విండీస్ జట్టు ఒక మార్పుతో బరిలోకి దిగింది. లెగ్ స్పిన్నర్ దేవేంద్ర బిషూ స్థానంలో ఆల్‌రౌండర్ ఫాబియన్ అలెన్ వన్డే ఆరంగేట్రం చేస్తున్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications