Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

India vs West indies: పొట్టి ఫార్మాట్‌ను కొట్టెదెవ‌రు? నేటి నుంచే టీ20 సిరీస్‌.. ఇరు జ‌ట్ల‌కు గాయాల టెన్ష‌న్‌

India vs West Indies: 3 matches T20 series start from today

కోల్‌క‌తా: భార‌త్‌, వెస్టిండీస్ మ‌ధ్య వ‌న్డే స‌మ‌రం ముగిసింది. ఇక నేటి నుంచి టీ20 స‌మ‌రం మొద‌లుకానుంది. వ‌న్డే సిరీస్‌ను ఏక‌ప‌క్షంగా గెలుచుకున్న టీమిండియాకు టీ20 సిరీస్‌ను గెల‌వ‌డం అంత సులువు కాక‌పోవ‌చ్చు. ఎందుకంటే టీ20ల్లో క‌రేబియ‌న్ జ‌ట్టు ఎప్పుడూ బ‌ల‌మైన‌దే. టీ20 ఫార్మాట్‌లో అత్య‌ధికంగా ప్ర‌పంచ‌క‌ప్‌లు గెలిచిన‌ది ఆ జ‌ట్టే అంటేనే అర్థం చేసుకోవ‌చ్చు. టీ20ల్లో విండీస్ జ‌ట్టు ఎంత బ‌ల‌మైన‌దో. ఇక నేడు జ‌ర‌గ‌నున్న తొలి టీ20 మ్యాచ్ రాత్రి 7:30 గంట‌ల‌కు ప్రారంభం కానుంది.

ఇరు జ‌ట్ల‌కు గాయాల టెన్ష‌న్

ఇరు జ‌ట్ల‌కు గాయాల టెన్ష‌న్

టీ20 సిరీస్‌కు ముందు ఇరు జ‌ట్ట‌ను గాయాలు వెంటాడుతున్నాయి. టీమిండియాలో గాయాల‌ కార‌ణంగా ఇప్ప‌టికే వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్, అక్ష‌ర్ ప‌టేల్, వాషింగ్ట‌న్ సుంద‌ర్ టీ20 సిరీస్‌కు దూర‌మ‌య్యారు. వీరి స్థానంలో ఇప్ప‌టికే రుతురాజ్ గైక్వాడ్, దీప‌క్ హుడా, కుల్దీప్ యాద‌వ్‌ను జట్టులోకి తీసుకున్నారు. మ‌రో వైపు వెస్టిండీస్ జ‌ట్టును కూడా గాయాలు ఇబ్బందిపెడుతున్నాయి. ఆ జ‌ట్టు కెప్టెన్ కీర‌న్‌ పొలార్డ్ గాయం కార‌ణంగా వ‌న్డే సిరీస్‌లోని చివ‌రి రెండు మ్యాచ్‌లు ఆడ‌లేదు. అయితే ఇంకా కోలుకున్నాడా? లేదా? అనే దానిపై ఇంకా స్ప‌ష్టత రాలేదు. దీంతో టీ20 సిరీస్‌లో ఆడేది, లేనిది తెలియాల్సి ఉంది.

గెలుపే లక్ష్యంగా

గెలుపే లక్ష్యంగా

టీ20 సిరీస్‌లో ఇరు జ‌ట్లు గెలుపే ల‌క్ష్యంగా బ‌రిలోకి దిగుతున్నాయి. రోహిత్ శ‌ర్మ కెప్టెన్సీలోని భార‌త జ‌ట్టు వ‌న్డే సిరీస్‌లో మాదిరిగానే టీ20 సిరీస్‌లోనూ స‌త్తా చాటాల‌ని భావిస్తుంది. కేఎల్ రాహుల్ సిరీస్‌కు దూర‌మ‌వ‌డంతో రోహిత్‌తో క‌లిసి ఇషాన్ కిష‌న్ ఇన్నింగ్స్ ఓపెన్ చేయ‌డం ఖాయంగా కనిపిస్తోంది. పంత్‌, కోహ్లీ స్థానాలు ఖాయం కాగా, సూర్య‌కుమార్ యాద‌వ్‌, శ్రేయ‌స్ అయ్య‌ర్ ఇద్ద‌రు కూడా తుది జ‌ట్టులో ఉండే

అవ‌కాశం ఉంది. లేదంటే సూర్య‌, అయ్య‌ర్‌ల‌లో ఒక‌రినే తుది జ‌ట్టులోకి తీసుకుని వెంక‌టేష్ అయ్యర్‌ను ఆడించే అవ‌కాశం కూడా ఉంది. ఇక బౌలింగ్‌లో శార్దూల్ ఠాకూర్, చాహ‌ల్ స్థానాలు ఖాయంగా కనిపిస్తుండ‌గా, వీరికి తోడుగా సిరాజ్‌, హ‌ర్ష‌ల్ ప‌టేల్, దీప‌క్ చాహ‌ర్‌, కుల్దీప్ యాద‌వ్ ఆడే అవ‌కాశాలున్నాయి. లేదా సిరాజ్ స్థానంలో వెట‌ర‌న్ పేస‌ర్ భువ‌నేశ్వ‌ర్‌కు అవ‌కాశం ఇచ్చిన ఆశ్చ‌ర్య‌పోవాల్సిన అవ‌స‌రం లేదు.

పిచ్‌

పిచ్‌

పిచ్ బ్యాట‌ర్ల‌కు, బౌల‌ర్ల‌కు స‌మానంగా అనుకూలించ‌నుంది. మంచి ప్ర‌భావం ఉంటుంది. మ్యాచ్ సాగే కొద్ది స్పిన్న‌ర్ల‌కు క‌ష్టం అవొచ్చు. టాస్ గెలిచిన జ‌ట్టు బౌలింగ్ తీసుకునే అవకాశాలే ఎక్కువ‌గా ఉన్నాయి.

తుది జ‌ట్లు (అంచ‌నా)

తుది జ‌ట్లు (అంచ‌నా)

భారత్‌:

రోహిత్‌ శర్మ (కెప్టెన్‌), ఇషాన్‌ కిషన్‌, విరాట్‌ కోహ్లీ, రిషభ్‌ పంత్‌( వికెట్ కీప‌ర్‌), సూర్యకుమార్ యాద‌వ్/శ్రేయాస్‌ అయ్యర్‌, వెంకటేశ్‌ అయ్యర్‌, దీపక్‌ చాహర్‌, శార్దూల్‌ ఠాకూర్‌, హర్షల్‌ పటేల్‌, భువ‌నేశ్వ‌ర్‌/ సిరాజ్‌, యజువేంద్ర చాహల్‌.

వెస్టీండీస్‌:

బ్రాండన్‌ కింగ్‌, కైల్‌ మేయర్స్‌, నికొలస్‌ పూరన్‌, పావెల్‌, కీరన్‌ పొలార్డ్‌ (కెప్టెన్‌), హోల్డర్‌, ఆలెన్‌, షెఫర్డ్‌, ఒడీన్‌ స్మిత్‌, హొసేన్‌, కాట్రెల్‌/డ్రేక్స్‌.

Story first published: Wednesday, February 16, 2022, 7:59 [IST]
Other articles published on Feb 16, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+