ఐదు వికెట్లు కోల్పోయినా... పటిష్టస్థితిలోనే టీమండియా: మయాంక్ వెల్లడి

హైదరాబాద్: ఐదు వికెట్లు చేజార్చుకున్నా... టీమిండియా పటిష్టస్థితిలోనే ఉందని టెస్టు ఓపెనర్ మయాంక్ అగర్వాల్ అన్నాడు. శుక్రవారం ప్రారంభమైన రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఓపెనర్ మయాంక్ అగర్వాల్ హాఫ్ సెంచరీతో రాణించిన సంగతి తెలిసిందే. విండిస్ బౌలర్లు కట్టుదిట్టంగా బంతులు విసిరి తమపై బాగా ఒత్తిడి పెంచారని అన్నాడు.

టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా
మయాంక్ అగర్వాల్(55), విరాట్ కోహ్లీ(76) హాఫ్ సెంచరీలతో రాణించడంతో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా తొలిరోజు ఆటముగిసే సమయానికి 90 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 264 పరుగులు చేసింది. మ్యాచ్ అనంతరం మయాంక్ అగర్వాల్ మాట్లాడుతూ "పరిస్థితులు సవాల్‌గా నిలిచాయి. తొలి సెషన్‌లో బంతి దూసుకొచ్చింది" అని అన్నాడు.

పిచ్‌పై తేమ బౌలర్లకు అనుకూలించింది
"కీమర్ రోచ్, జేసన్ హోల్డర్ సరైన ప్రాంతాల్లో సరైన లెంగ్త్‌తో బంతులు విసిరారు. పిచ్‌పై తేమ బౌలర్లకు అనుకూలించింది. ఐదు వికెట్లు చేజార్చుకున్నా, మా జట్టు పటిష్ఠ స్థితిలో నిలిచింది. హోల్డర్ పరుగులు చేసేందుకు అసలు అవకాశమే ఇవ్వలేదు. అద్బుతంగా బంతులు వేశాడు. అతడి బౌలింగ్‌లో ఒక్క చెత్త బంతీ రాలేదు" అని మయాంక్ చెప్పుకొచ్చాడు.

26 ఏళ్ల రకీమ్ కార్న్‌వాల్‌పై మయాంక్ ప్రశంసలు
ఇక, ఈ మ్యాచ్‌లో అంతర్జాతీయ టెస్టు అరంగేట్రం చేసిన 26 ఏళ్ల రకీమ్ కార్న్‌వాల్‌పై మయాంక్ ప్రశంసల వర్షం కురిపించాడు. "రకీమ్ కార్న్‌వాల్ నిలకడగా బంతులు విసిరాడు. బంతిని అనువైన ప్రదేశాల్లో విసిరాడు. అతడి బౌలింగ్‌లో పరుగులు చేయడం అంత సులభమేమీ కాదు. ఇతర స్పిన్నర్లతో పోలిస్తే అతడు ఎక్కువ బౌన్స్ వేస్తున్నాడు" అని అన్నాడు.

తొలి సెషన్ తర్వాత కాస్త మెరుగ్గా బ్యాటింగ్ చేశాం
అయితే, తొలి సెషన్ తర్వాత కాస్త మెరుగ్గా బ్యాటింగ్ చేశామని... ఎండకాసే కొద్దీ పిచ్‌లోని తేమ ఆవిరై వికెట్ కఠినంగా మారిందని మయాంక్ అగర్వాల్ వెల్లడించాడు. ప్రస్తుతం క్రీజులో హనుమ విహారి(42), రిషబ్ పంత్(27) పరుగులతో ఉన్నారు. వెస్టిండిస్ బౌలర్లలో జాసన్ హౌల్డర్‌కు మూడు, కీమర్ రోచ్, కార్న్‌వాల్ తలో వికెట్ తీసుకున్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications