ఎస్‌జీ బంతులను టెస్టు క్రికెట్‌లో నిలిపివేస్తేనే మంచిది: ఉమేశ్ యాదవ్

హైదరాబాద్: టెస్టుల్లో లోయర్ ఆర్డర్ ఆటగాళ్లను ఔట్ చేసే క్రమంలో ఎస్‌జీ బంతులతో అంతగా ప్రయోజనం కనబడటం లేదని టీమిండియా పేసర్ ఉమేశ్ యాదవ్ అన్నాడు. టెస్టు క్రికెట్‌లో వాడుతున్న ఎస్‌జీ బంతులు ఐదు ఓవర్లకే పాడవుతున్నాయని, ఆ ప్రభావం మ్యాచ్‌పై పడుతోందని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీతో పాటు అశ్విన్‌లు అసంతృప్తి వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.
టెస్టు క్రికెట్‌లో ఎస్‌జీకి బదులుగా డ్యూక్స్ బంతులు ఉపయోగిస్తే మంచిదని కోహ్లీ సలహా ఇచ్చిన సంగతి తెలిసిందే. "ఒకప్పుడు ఎస్‌జీ బంతులు చాలా బాగుండేవి.. ఎందుకో తెలీదు కానీ ఈ మధ్య కాలంలో ఉత్పత్తి అయినవి చాలా నాసిరకంగా ఉంటున్నాయి" అని కోహ్లీ చెప్పాడు.
"టెస్టు క్రికెట్ ఆడేందుకు డ్యూక్ బంతి బాగుంటుంది. ప్రపంచమంతా ఒకే బంతి వినియోగించాలంటే నేను డ్యూక్ బంతికే ఓటేస్తా. ఎలాంటి పరిస్థితుల్లోనైనా స్పిన్నర్లు, పేసర్లు దాంతో కచ్చితత్వంతో బంతులు వేయగలరు. వేగమూ బాగుంటుంది. అశ్విన్‌తో నేను పూర్తిగా ఏకీభవిస్తా" అని కోహ్లీ అన్నాడు.

ఎస్‌జీ బంతి నాణ్యతపై విరాట్ కోహ్లీ
"బంతి ఐదు ఓవర్లకే పాలిపోవడం ఇంతకు ముందు ఎన్నడూ చూడలేదు. ఒకప్పుడు ఎస్‌జీ బంతి నాణ్యత ఇప్పటికన్నా ఎంతో బాగుండేది. ఇప్పుడెందుకు తగ్గిందో అర్థం కావడం లేదు. డ్యూక్, కూకాబుర్ర బంతుల నాణ్యత బాగుంది. ముడిసరకు దొరకకున్నా, ఇబ్బందులు పడుతున్నా కూకాబుర్ర బంతి నాణ్యతను తగ్గించడం లేదు" అని కోహ్లీ పేర్కొన్నాడు.

ఎస్‌జీ బంతులతో తీవ్ర ఇబ్బందులు
ఇప్పుడు వారి సరసన పేసర్ ఉమేశ్ యాదవ్ కూడా చేరిపోయాడు. ఎస్‌జీ బంతులతో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్న విషయాన్ని తాజాగా ఉమేశ్ యాదవ్ పేర్కొన్నాడు. హైదరాబాద్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టు తొలిరోజు మ్యాచ్ ముగిసిన అనంతరం ఉమేశ్ యాదవ్ మాట్లాడుతూ భారత్ తరహా ట్రాక్‌లపై ఎస్‌జీ బంతులు వినియోగం మంచి ఫలితాల్ని ఇవ్వడం లేదన్నాడు.

లోయర్ ఆర్డర్ ఆటగాళ్లను ఔట్ చేసే క్రమంలో
లోయర్ ఆర్డర్ ఆటగాళ్లను ఔట్ చేసే క్రమంలో ఎస్‌జీ బంతులతో అంతగా ప్రయోజనం కనబడటం లేదని చెప్పుకొచ్చాడు. ఇక్కడ పేస్‌కు కానీ, బౌన్స్‌కు ఎస్‌జీ బంతులు లాభించడం లేదని చెప్పాడు. అదే సమయంలో పిచ్‌లు స్వింగ్‌కు అనుకూలంగా ఉన్నా బంతి మెత్తబడి పోవడంతో దానిని రాబట్టడం కష్టతరంగా మారిందని అన్నాడు.

ఎస్‌జీ బంతుల వాడకాన్ని నిలిపివేస్తే మంచిది
ఈ నేపథ్యంలో ఎస్‌జీ బంతుల వాడకాన్ని టెస్టు క్రికెట్‌లో నిలిపివేస్తేనే మంచిదని ఉమేశ్ యాదవ్ అన్నాడు. డ్యూక్ బంతులు ఇంగ్లాండ్‌లో తయారవుతుండగా, ఎస్‌జీ బంతులు మాత్రం భారత్‌లోనే తయారవుతుండటం విశేషం. ఐసీసీ నిబంధనల ప్రకారం ఏ దేశంలో ఏ బంతి వినియోగించాలన్న నిబంధన లేదు. ఆస్ట్రేలియా, పాకిస్థాన్, శ్రీలంక కూకాబుర్ర బంతులను వినియోగిస్తుండగా.... ఇంగ్లాండ్ డ్యూక్, భారత్ ఎస్‌జీ బంతులను వాడతున్నాయి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications