హైదరాబాద్ టెస్ట్, డే1: ఛేజ్ 98 నాటౌట్, వెస్టిండిస్ 295/7


హైదరాబాద్: ఉప్పల్ స్టేడియంలో భారత్‌తో జరుగుతున్న రెండో టెస్టులో వెస్టిండిస్ బ్యాట్స్‌మెన్లు రోస్టన్ చేజ్(98), జాసన్ హోల్డర్(52) రాణించడంతో తొలిరోజు ఆట ముగిసే సమయానికి 7 వికెట్లు కోల్పోయి 295 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో రోస్టన్ చేజ్ (98 నాటౌట్), దేవేంద్ర బిషూ (2 నాటౌట్) పరుగులతో ఉన్నారు.
శుక్రవారం ఆటలో 95 ఓవర్లు ఆడిన కరీబియన్ జట్టు 7 వికెట్ల నష్టానికి 295 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న వెస్టిండిస్ జట్టు తొలి రెండు సెషన్లలో వరుసగా వికెట్లు కోల్పోయింది. దీంతో 59.3 ఓవర్లకు గాను 6 వికెట్లు కోల్పోయి 182 పరుగులు చేసింది.
200 పరుగులైనా దాటుతుందా?
దీంతో పర్యాటక జట్టు కనీసం 200 పరుగులైనా దాటుతుందా లేదా అనే సందేహం క్రికెట్ అభిమానులకు కలిగింది. సరైన సమయంలో క్రీజులోకి వచ్చిన విండిస్ మిడిలార్డర్ బ్యాట్స్‌మన్ రోస్టన్ ఛేజ్(98 నాటౌట్: 174 బంతుల్లో 7ఫోర్లు, సిక్స్) అడ్డుగోడలా మారడంతో వెస్టిండిస్ జట్టు 300 పరుగుల మార్కుకి చేరువగా వచ్చింది.

98 పరుగులతో నాటౌట్‌గా నిలిచిన రోస్టన్ ఛేజ్
భారత బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొన్న రోస్టన్ ఛేజ్ తొలి రోజు ఆట ముగిసే సమయానికి 98 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో వెస్టిండిస్ టాపార్డర్ పూర్తిగా విఫలమైనప్పటికీ, లోయర్ ఆర్డర్ మెరుగైన ప్రదర్శన చేయడం విశేషం. ఈ మ్యాచ్‌లో విండిస్ కెప్టెన్ జాసన్ హోల్డర్(52) హాఫ్ సెంచరీతో రాణించాడు.

చివరి సెషన్‌లో ప్రభావం చూపలేకపోయిన భారత బౌలర్లు
తొలి రెండు సెషన్లలో ఆధిపత్యం ప్రదర్శించిన టీమిండియా బౌలర్లు చివరి సెషన్‌లో మాత్రం తమ ప్రభావాన్ని చూపలేకపోయారు. భారత బౌలర్లలో ఉమేశ్ యాదవ్, కుల్దీప్ యాదవ్ చెరో మూడు వికెట్లు తీయగా.. రవిచంద్రన్ అశ్విన్‌కు ఒక వికెట్ లభించింది. కాగా, హైదరాబాద్ టెస్ట్‌తో అంతర్జాతీయ టెస్టు అరంగేట్రం చేసిన శార్ధూల్ ఠాకూర్ కేవలం పది బంతులు వేసి గాయపడిన సంగతి తెలిసిందే.
అరంగేట్ర రోజే మైదానాన్ని వీడిన శార్ధూల్ ఠాకూర్
దీంతో కెప్టెన్ కోహ్లీ, ఫిజియో సూచన మేరకు మైదానాన్ని వీడాడు. అయితే, శార్ధూల్ ఠాకూర్ తొలి రోజు మొత్తం మైదానంలోకి దిగడని టీమ్ మేనేజ్‌మెంట్ వెల్లడించింది. టీమిండియా ఫిజియో సూచన మేరకు తొలి రోజు అతడు పూర్తిగా విశ్రాంతి తీసుకున్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications