Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

అర్ధ సెంచరీతో రాణించిన శివమ్ దుబే, విండీస్ లక్ష్యం 171

 India Vs West Indies 2nd T20: Dubes first 50 helps IND post 170

తిరువనంతపురం: కేరళలోని తిరువనంతపురంలోని గ్రీన్ ఫీల్డ్ అంతర్జాతీయ స్టేడియంలో జరుగుతున్న రెండో ట్వంటీ 20లో వెస్టిండీస్ టాస్ గెలిచి తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. తొలి ట్వంటీ 20లో టీమిండియాను విజయం వరించింది. ఇప్పుడు రెండో ట్వంటీ 20లో గెలుపు కోసం ఇరుజట్లు పోరాడుతున్నాయి.

రెండో ట్వంటీ 20 తొలి ఇన్నింగ్స్‌లో భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 170 పరుగులు చేసింది. వెస్టిండీస్ ముందు 171 పరుగుల లక్ష్యం ఉంచింది. రోహిత్ శర్మ 15, కేఎల్ రాహుల్ 11, దుబే 54, విరాట్ కోహ్లీ 19, పంత్ 33, అయ్యర్ 10, జడెజా 9, చాహార్ 1 పరుగు చేశారు. దుబే అర్ధ సెంచరీతో రాణించారు. పంత్ కూడా రాణించారు.

వెస్టిండీస్ బౌలర్లలో కాట్రెల్, పీర్రె, హోల్డర్‌లు ఒక్కో వికెట్ తీశారు. విలియమ్స్, వాల్ష్‌లు చెరీ రెండు వికెట్లు తీశారు. అంతకుముందు, టీమిండియాలో తుది జట్టులో స్థానం కోసం ఎదురు చూస్తున్న సంజు శాంసన్‌కు నిరాశ మిగిలింది.

భారత్ జట్టులో రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ (కెప్టెన్), రిషభ్ పంత్, శ్రేయాస్ అయ్యర్, శివమ్ దుబే, రవీంద్ర జడెజా, వాషింగ్టన్ సుందర్ భువనేశ్వర్, దీపక్ చాహార్, యజ్వేంద్ర చాహాల్ ఉన్నారు. విండీస్ జట్టులో సిమన్స్, లూయీస్, కింగ్, హెట్ మెయిర్, పొలార్డ్ (కెప్టెన్), హోల్డర్, పూరన్, పియర్, హెడెన్, వాల్ష్,, విలియమ్స్, కాట్రెల్ ఉన్నారు.

Story first published: Sunday, December 8, 2019, 21:20 [IST]
Other articles published on Dec 8, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+