For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

భారత్ Vs విండిస్ 2nd ODIకి పొంచి ఉన్న వర్షం ముప్పు?

 India vs West Indies 2nd ODI Weather report: Will rain play spoilsport again?

హైదరాబాద్: కోహ్లీ నాయకత్వంలోని టీమిండియా ప్రస్తుతం వెస్టిండిస్ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ పర్యటనలో భాగంగా ఇరు జట్ల మధ్య రెండో వన్డే ఆదివారం పోర్ట్ ఆఫ్ స్పెయిన్ వేదికగా జరగనుంది. అయితే ఈ మ్యాచ్‌కి వర్షం ముప్పు పొంచి ఉంది.

భారత కాలమానం ప్రకారం రాత్రి 7 గంటలకు జరగాల్సిన మ్యాచ్‌కు కూడా వర్షం అడ్డంకిగా మారనుందని స్థానిక వాతావరణ శాఖ వెల్లడించింది. మ్యాచ్ జరిగే స్టేడియం పరిసరాల్లో ఉదయం, మధ్యాహ్నం కొంత సేపు వర్షం పడే అవకాశాలున్నాయని తెలిపింది.

దీంతో రెండో వన్డే కూడా రద్దు అవుతుందని అభిమానులు ఆందోళన చెందుతున్నారు. మూడు వన్డేల సిరిస్‌లో భాగంగా గుయానా వేదికగా జరగాల్సిన తొలి వన్డేకు వర్షం అడ్డంకిగా మారడంతో మ్యాచ్‌ను అంపైర్లు రద్దు చేసిన సంగతి తెలిసిందే. వర్షం కారణంగా ఆలస్యంగా ప్రారంభమైన తొలి వన్డేను తొలుత అంపైర్లు 43 ఓవర్లకు కుదించారు.

 India vs West Indies 2nd ODI Weather report: Will rain play spoilsport again?

దీంతో టాస్ ఓడిన వెస్టిండిస్ జట్టు బ్యాటింగ్‌ను ఆరంభించింది. ఆ తర్వాత మరోమారు వర్షం కురవడంతో మ్యాచ్‌ను అంఫైర్లు 34 ఓవర్లకు కుదించారు. అయితే, ఇందులో కూడా 13 ఓవర్ల పాటు ఆట సజావుగా సాగింది. అనంతరం ఎడతెరిపి లేని వర్షం కురువడంతో అంపైర్లు మ్యాచ్‌ను రద్దు చేశారు.

వర్షంతో మ్యాచ్ ఆగిపోయే సమయానికి వెస్టిండిస్ జట్టు ఒక వికెట్ కోల్పోయి 54 పరుగులు చేసింది. తొలి వన్డే వర్షం కారణంగా రద్దు అవడంపై టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అసహనం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. కోహ్లీ మాట్లాడుతూ "మ్యాచ్‌ జరుగుతున్నప్పుడు మాటిమాటికి వర్షం అంతరాయం కలిగించడం చిరాకు తెప్పిస్తుంది. ఆట జరిగేటప్పుడు పూర్తిగా వర్షమైనా పడాలి లేదా పూర్తి ఆటైనా కొనసాగాలి" అని అన్నాడు.

"ఇలా దోబూచులాడితే ఇబ్బందిగా ఉంటుంది. ఇక. క్రికెట్‌లో అనూహ్య మార్పులొచ్చాయి. అందుకు ఇంగ్లాండ్‌ ప్రదర్శనే నిదర్శం. టీ20ల ప్రభావంతో వన్డేల్లో 400 స్కోర్లు సునాయాసంగా కొట్టగలుగుతున్నారు. ఆటగాళ్లు ఫిట్‌గా ఉండి అద్భుతంగా ఆడుతున్నారు" అని విరాట్ కోహ్లీ తెలిపాడు. కాగా ఇప్పటికే ఈ పర్యటనలో మూడు టీ20ల సిరీస్‌ను 3-0 తేడాతో కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే.

Story first published: Saturday, August 10, 2019, 18:10 [IST]
Other articles published on Aug 10, 2019
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+