విశాఖలో 2nd ODI: వన్డేల్లో 37వ సెంచరీ సాధించిన విరాట్ కోహ్లీ

హైదరాబాద్: వెస్టిండిస్‌తో జరుగుతున్న ఐదు వన్డేల సిరిస్‌లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ వరుసగా రెండో వన్డేలోనూ సెంచరీ సాధించాడు. బుధవారం విశాఖపట్నం వేదికగా ప్రారంభమైన రెండో వన్డేలో విరాట్ కోహ్లీ 107 బంతుల్లో 10 ఫోర్ల సాయంతో 102 పరుగుతో సెంచరీని సాధించాడు. వన్డేల్లో కోహ్లీకి ఇది 37వ సెంచరీ కావడం విశేషం.

ఈ ఏడాది కోహ్లీ 11 మ్యాచ్‌లలో 989 పరుగులు చేసి 1000 పరుగుల మైలురాయికి చేరువలో ఉన్నాడు. ఈ స్టేడియంలో విరాట్ కోహ్లీకి అద్భుతమైన రికార్డు ఉంది. ఇప్పటి వరకు ఈ స్టేడియంలో నాలుగు వన్డేలాడిన కోహ్లి వరుసగా 118, 117, 99, 65 పరుగులతో సత్తాచాటాడు. తాజాగా ఐదో వన్డే ఆడుతోన్న కోహ్లీ సెంచరీ నమోదు చేయడంతో విశాఖ స్టేడియం కోహ్లీకి లక్కీ గ్రౌండ్‌గా మారిపోయింది.
అంతకు ముందు కోహ్లీ 81 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద 10వేల మైలురాయి అందుకున్నాడు. తాజా సెంచరీతో విండీస్‌పై అత్యధిక సెంచరీలు బాదిన క్రికెటర్‌గా కోహ్లీ(6) రికార్డు సృష్టించాడు. గిబ్స్, ఆమ్లా, డివిలియర్స్‌ల పేరిట ఉన్న 5 సెంచరీల రికార్డును కోహ్లీ అధిగమించాడు.
ఇదిలా ఉంటే విశాఖ స్టేడియంలో ఐదు ఇన్నింగ్స్‌ల్లో మూడో సెంచరీలు సాధించి సరికొత్త రికార్డు సృష్టించాడు. బంగ్లాదేశ్‌లోని మిర్‌పూర్‌లో కోహ్లీ 13 ఇన్నింగ్స్‌లో నాలుగు సెంచరీలు బాదిన కోహ్లీ ఆ తర్వాత విశాఖలోనే ఎక్కువ సెంచరీలు సాధించాడు.
81 పరుగులు చేయడంతో వన్డేల్లో పదివేల పరుగులు
ఈ సిరిస్‌లో భాగంగా గువహటి వేదికగా జరిగిన తొలి వన్డేలో విరాట్ కోహ్లీ సెంచరీ సాధించిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో కోహ్లీ 81 పరుగులు చేయడంతో వన్డేల్లో పదివేల పరుగుల మైలురాయిని అందుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో వన్డేల్లో అత్యంత వేగంగా పది వేల పరుగుల మైలురాయిని అందుకున్న క్రికెటర్‌గా అరుదైన ఘనత సాధించాడు.
ఐదో భారత బ్యాట్స్‌మన్‌గా కోహ్లీ రికార్డు
వన్డేల్లో పది వేల పరుగులు చేసిన ఐదో భారత బ్యాట్స్‌మన్‌గా మొత్తంగా 13వ బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు. ఇప్పటి వరకు భారత్ తరఫున సచిన్ టెండూల్కర్ (18,426), సౌరవ్ గంగూలీ (11,363), రాహుల్ ద్రవిడ్ (10,889), మహేంద్రసింగ్ ధోనీ (10,126) మాత్రమే ఈ రికార్డుని అందుకున్నారు. ఈ క్రమంలో సచిన్ రికార్డుని కోహ్లీ అధిగమించాడు.
సచిన్ రికార్డు బద్దలు
వన్డేల్లో పదివేల పరుగుల మైలురాయిని అందుకోవడానికి సచిన్ 259 ఇన్నింగ్స్‌లు తీసుకోగా కోహ్లీకి 205 ఇన్నింగ్స్‌లు అవసరమయ్యాయి. మరోవైపు సౌరవ్ గంగూలీ 263, రికీ పాంటింగ్ 266 ఇన్నింగ్స్‌లు తీసుకున్నారు. ఇప్పటివరకు సచిన్ (259 ఇన్నింగ్స్) పేరిట ఉన్న రికార్డును కోహ్లీ బద్దలు కొట్టాడు.
పదివేల పరుగులు చేసిన క్రికెటర్లు వీరే
* విరాట్ కోహ్లీ (213 వన్డేలు- భారత్)
* సచిన్ తెందుల్కర్ (266- భారత్)
* సౌరవ్ గంగూలీ (272- భారత్)
* రికీ పాంటింగ్ (272- ఆస్ట్రేలియా)
* జాక్వెస్ కలిస్ (286- దక్షిణాఫ్రికా)
* ఎంఎస్ ధోనీ (320- భారత్)
* బ్రియన్ లారా (287- వెస్టిండీస్)
* రాహుల్ ద్రవిడ్ (309- భారత్)
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications