For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఎంతో ఒత్తిడిలో హ్యాట్రిక్‌ తీసా.. కెరీర్‌లో ఇదే నా బెస్ట్‌ పర్ఫార్మెన్స్‌: కుల్దీప్‌

India vs West Indies 2nd ODI: This hat-trick tops my list says Kuldeep Yadav

వైజాగ్: నాలుగు నెలల విరామం తర్వాత జట్టులోకి వచ్చా. ఎంతో ఒత్తిడిలో 'హ్యాట్రిక్‌' సాధించా. కెరీర్‌లో ఇదే నా బెస్ట్‌ పర్ఫార్మెన్స్‌ అని చైనామన్ స్పిన్నర్ కుల్దీప్‌ యాదవ్‌ తెలిపాడు. విశాఖ వేదికగా బుధవారం విండీస్‌తో జరిగిన రెండో వన్డేలో భారత్‌ 107 పరుగులతో ఘన విజయం సాధించింది. ఈ వన్డేలో కుల్దీప్‌ హ్యాట్రిక్‌ (3/52) తీసి విజయంలో కీలక పాత్ర పోషించాడు.

జట్టు నుండి తప్పించారు:

జట్టు నుండి తప్పించారు:

మ్యాచ్ అనంతరం తన హ్యాట్రిక్‌పై కుల్దీప్‌ యాదవ్‌ మాట్లాడుతూ... 'గత పది నెలలు నాకు చాలా కఠినమైనవి. స్థిరమైన ప్రదర్శన తరువాత ఓ దశలో వికెట్లు రావడం కష్టంగా మారింది. నా బౌలింగ్‌ గురించి మరోసారి ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రపంచకప్ తర్వాత నన్ను జట్టు నుండి తప్పించారు. చాలా భారంగా అనిపించింది. ఈ నాలుగు నెలల కాలంలో ఎంతో కష్టపడ్డా' అని అన్నాడు.

 నా బెస్ట్‌ పర్ఫార్మెన్స్‌:

నా బెస్ట్‌ పర్ఫార్మెన్స్‌:

'నాలుగు నెలల విరామం తర్వాత ముంబైలో వెస్టిండీస్‌తో జరిగిన టీ20 మ్యాచ్‌తో మళ్లీ టీమిండియాలోకి వచ్చాను. కొంతకాలం అంతర్జాతీయ క్రికెట్ ఆడలేదు కాబట్టి భయపడ్డా. ఎంతో ఒత్తిడిలో 'హ్యాట్రిక్‌' సాధించా. చాలా ఆనందం కలిగింది. అందుకే మైదానంలో పరిగెత్తా. కెరీర్‌లో ఇదే నా బెస్ట్‌ పర్ఫార్మెన్స్‌. నాలుగైదు నెలల కష్టంకు ఫలితం దక్కింది' అని కుల్దీప్‌ పేర్కొన్నాడు. ఐపీఎల్‌, వరల్డ్‌ కప్‌లలో పేలవ ఆటతో కుల్దీప్‌ జట్టులో స్థానం కోల్పోయాడు.

 ఎలాంటి బంతి వేయాలో అర్ధం కాలేదు:

ఎలాంటి బంతి వేయాలో అర్ధం కాలేదు:

'హ్యాట్రిక్‌కు ముందు ఎలాంటి బంతి వేయాలో అర్ధం కాలేదు. ఆఫ్ మిడిల్ లైన్ బౌలింగ్ చేయాలని నిర్ణయిచుకున్నా. అందుకే రెండవ స్లిప్ ఉంచాను. నా బౌలింగ్‌లో వైవిధ్యంపై చాలా కష్టపడ్డా. అది ఈ మ్యాచులో అమలు చేశా. కోచ్ భరత్ అరుణ్‌ కూడా కొన్ని సూచలు చేసారు. భారతదేశంలో ట్రాక్‌లు నెమ్మదిగా ఉంటాయి కాబట్టి దానికి తగ్గట్టుగా బౌలింగ్ చేయాల్సి ఉంటుంది' అని కుల్దీప్‌ చెప్పుకొచ్చాడు.

భారత్‌ నుంచి 'ఒకే ఒక్కడు':

భారత్‌ నుంచి 'ఒకే ఒక్కడు':

33వ ఓవర్లో బౌలింగ్ వచ్చిన కుల్దీప్ తొలి మూడు బంతులకు 7 పరుగులివ్వగా.. తదుపరి 3 బంతులకు హ్యాట్రిక్‌ తీసాడు. నాల్గో బంతికి షై హోప్ (78)ను, ఐదవ బంతికి జేసన్ హోల్డర్ (11)ను, ఆరో బంతికి జోసెఫ్ (0)ను ఔట్ చేసి హ్యాట్రిక్ నమోదు చేశాడు. 2017లో కోల్‌కతాలో ఆసీస్‌తో జరిగిన వన్డేలో కూడా కుల్దీప్‌ హ్యాట్రిక్‌ సాధించాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో రెండుసార్లు హ్యాట్రిక్‌ సాధించిన తొలి భారత బౌలర్‌గా నయా రికార్డును లిఖించాడు.

Story first published: Thursday, December 19, 2019, 15:19 [IST]
Other articles published on Dec 19, 2019
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+