
ఆ ముగ్గురు మెరిస్తే
బ్యాటింగ్ పరంగా చూసుకుంటే భారత్‌కు పెద్దగా ఇబ్బందులు లేవనే చెప్పాలి. అయితే చెన్నై మ్యాచ్‌లో టాప్-3 బ్యాట్స్‌మెన్ విఫలం కావడం ఓటమికి కారణం. విశాఖలో అద్భుత రికార్డు ఉన్న విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలలో ఏ ఒక్కరు చెలరేగినా విండీస్‌కు కష్టాలు తప్పవు. రెండో ఓపెనర్‌గా రాహుల్ రాణిస్తున్నాడు. యువ ఆటగాళ్లు శ్రేయస్ అయ్యర్, రిషభ్ పంత్ రాణించడం భారత్‌కు లాభించే అంశం.

జాదవ్ మరోసారి
కేదార్ జాదవ్ కీలక పరుగులు చేయడంతో జట్టులో అతని స్థానానికి ఢోకా లేదు. చెన్నై మ్యాచ్‌లో దూబే ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్‌కు దిగి విఫలమయ్యాడు. బౌలింగ్‌లోనూ రాణించలేకపోయాడు. దీంతో ఈ యువ ఆటగాడు రాణించాలని టీమ్ మేనేజ్‌మెంట్ ఆశిస్తోంది. అయితే ఓవరాల్‌గా భారత జట్టు పటిష్టంగానే ఉంది. అందరూ తమ స్థాయికి తగ్గ ప్రదర్శన కనబరిస్తే గెలుపు కష్టం కాకపోవచ్చు.

జడేజాపై వేటు
బౌలర్ల వైఫల్యం కారణంగానే చెన్నై మ్యాచ్ చేజారడంతో టీమ్ మేనేజ్‌మెంట్ దానిపై దృష్టి పెట్టింది. ఆల్‌రౌండర్‌కంటే ఒక స్పెషలిస్ట్ బౌలర్ అదనంగా జట్టులో ఉంటే మంచిదని టీమ్ మేనేజ్‌మెంట్ భావిస్తోంది. భిన్నమైన బంతులతో ప్రత్యర్థిని దెబ్బ తీయగల యజువేంద్ర చహల్‌పై అందరి దృష్ఠి నిలిచింది. కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజాలు పెద్దగా ప్రభావం చూపలేకపోవడంతో ఈ లెగ్ స్పిన్నర్‌కు అవకాశం దక్కవచ్చు. అదే జరిగితే.. దూబే, జడేజాలలో ఒకరిని పక్కన పెట్టే అవకాశం ఉంది. దీపక్ చాహర్ ఫర్వాలేదనిపిస్తున్నా.. మొహమ్మద్ షమీ గాడిలో పడాల్సిన అవసరముంది.

జోరులో పొలార్డ్ సేన
పొలార్డ్ నాయకత్వంలో కొత్తగా కనిపిస్తున్న వెస్టిండీస్ జట్టు తొలి మ్యాచ్ జోరును విశాఖలో కూడా కొనసాగించాలని భావిస్తోంది. పిచ్ బ్యాటింగ్‌కు సహకరించడం కూడా వారికి కలిసిరానుంది. హెట్‌మైర్, షై హోప్ బ్యాటింగ్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. లూయిస్, పూరన్, పొలార్డ్‌లతో జట్టు బ్యాటింగ్ మరింత బలంగా కనిపిస్తోంది. పేసర్లు కాట్రెల్, జోసెఫ్, హోల్డర్.. స్పిన్నర్లు వాల్ష్, ఛేజ్ కూడా గత మ్యాచ్‌లో మెరుగ్గానే బౌలింగ్ చేశారు. మొత్తంగా చూస్తే విండీస్ పటిష్టంగానే ఉంది. విండీస్ మాజీ క్రికెటర్ బాసిల్ బుచర్ మృతికి సంతాపంగా విశాఖ మ్యాచ్‌లో విండీస్ క్రికెటర్లు చేతికి నల్ల బ్యాడ్జిలు ధరించి ఆడతారు.

తుది జట్లు (అంచనా)
భారత్: రోహిత్, రాహుల్, కోహ్లీ (కెప్టెన్), అయ్యర్, పంత్, జాదవ్, దూబే, జడేజా/చాహల్, దీపక్, కుల్దీప్, షమీ.
వెస్టిండీస్: హోప్, లూయిస్/అంబ్రీస్, హెట్‌మైర్, పూరన్, పొలార్డ్ (కెప్టెన్), చేజ్, హోల్డర్, పాల్, వాల్ష్ జూనియర్, అల్జారి, కాట్రెల్.


Click it and Unblock the Notifications
