For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

విశాఖ వన్డేలో పరుగుల వరద: వెస్టిండిస్ విజయ లక్ష్యం 388

India vs West Indies 2nd ODI, Live Score: Rohit Sharma, KL Rahul hundreds higlight Indias 387

హైదరాబాద్: విశాఖ వేదికగా వెస్టిండిస్‌తో జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియా పరుగుల వరద పారించింది. ఓపెనర్లు రోహిత్ శర్మ(138 బంతుల్లో 159; 17 ఫోర్లు, 5 సిక్సులు), కేఎల్ రాహుల్(104 బంతుల్లో 102; 8 ఫోర్లు, 3 సిక్సులు) సెంచరీలతో రాణించడంతో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 387 పరుగులు చేసింది.

ఫలితంగా పర్యాటక జట్టుకు 388 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది. వెస్టిండిస్ బౌలర్లలో షెల్డన్ కాట్రెల్ రెండు వికెట్లు తీయగా... కీమో పాల్, అల్జారీ జోసెఫ్, కీరన్ పొలార్డ్‌లకు తలో వికెట్ లభించింది.

టాస్ ఓడి టీమిండియా బ్యాటింగ్

టాస్ ఓడి టీమిండియా బ్యాటింగ్

ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన వెస్టిండిస్ జట్టు టీమిండియాను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. దీంతో తొలుత బ్యాటింగ్‌కు దిగిన టీమిండియాకు ఓపెనర్లు చక్కటి శుభారంభాన్నిచ్చారు. మ్యాచ్ ఆరంభం నుంచీ వీరిద్దరూ నిలకడగా ఆడుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. ఈ క్రమంలో తొలుత రాహుల్‌ హాఫ్‌ సెంచరీ చేయగా, ఆ తర్వాత రోహిత్‌ హాఫ్ సెంచరీ సాధించాడు.

రోహిత్ శర్మ 28వ సెంచరీ

అనంతరం వీరిద్దరూ హాఫ్ సెంచరీలను సెంచరీలుగా మలిచారు. రోహిత్‌ 107 బంతుల్లో 11 ఫోర్లు, 2 సిక్సర్లతో సెంచరీ సాధించగా, రాహుల్‌ 102 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో సెంచరీ సాధించాడు. వన్డేల్లో రోహిత్ శర్మకు ఇది 28వ సెంచరీ కాగా, కేఎల్ రాహుల్‌కు 3వ సెంచరీ కావడం విశేషం. 28వ సెంచరీతో రోహిత్ శర్మ అనేక రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు.

ఒక క్యాలెండర్ ఇయర్‌లో

ఒక క్యాలెండర్ ఇయర్‌లో

ఒక క్యాలెండర్ ఇయర్‌లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో సౌరవ్ గంగూలీ, డేవిడ్ వార్నర్‌లతో కలిసి సంయుక్తంగా రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. ఈ జాబితాలో క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్(9-1998) అగ్రస్థానంలో ఉన్నాడు. ఆ తర్వాత సౌరవ్ గంగూలీ(7-2000), ఆస్ట్రేలియా ఆటగాడు డేవిడ్ వార్నర్(7-2016), రోహిత్ శర్మ(7-2019)లు సంయక్తంగా రెండో స్థానంలో కొనసాగుతున్నారు.

వరల్డ్‌కప్‌లో రోహిత్ 5 సెంచరీలు

ఈ ఏడాది ఆస్ట్రేలియాతో జరిగిన సిరిస్‌లో సెంచరీ సాధించిన రోహిత్ శర్మ ఆ తర్వాత ఇంగ్లాండ్ వేదికగా జరిగిన వన్డే వరల్డ్‌కప్‌లో 5 సెంచరీలు సాధించాడు. ఫలితంగా వన్డేల్లో అత్యధిక సెంచరీలు సాధించిన ఆటగాళ్ల జాబితాలో రోహిత్ శర్మ సంయుక్తంగా నాలుగో స్థానంలో కొనసాగుతున్నాడు. రోహిత్ శర్మ కంటే ముందు సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ, రికీ పాంటింగ్‌లు ఉన్నారు.

సెంచరీ అనంతరం కేఎల్ రాహుల్ ఔట్

అయితే అల్జరీ జోసెఫ్ వేసిన 37వ ఓవర్‌లో బౌండరీతో సెంచరీ సాధించిన కేఎల్ రాహుల్(102) ఆదే ఓవర్ చివరి బంతికి భారీ షాట్‌కు ప్రయత్నించి క్యాచ్ ఔటయ్యాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన కెప్టెన్ విరాట్ కోహ్లీ అనవసరపు షాట్‌కు యత్నించి పెవిలియన్‌ చేరాడు. పొలార్డ్‌ వేసిన 38వ ఓవర్‌ మూడో బంతిని స్లో షార్ట్‌ బాల్‌గా సంధించగా కోహ్లి పుల్‌ చేయబోయాడు.

కోహ్లీ డకౌట్

కోహ్లీ డకౌట్

అది కాస్తా మిడ్‌ వికెట్‌లో లేవడంతో అక్కడే ఫీల్డింగ్‌ చేస్తున్న రోస్టన్‌ ఛేజ్‌ పట్టుకున్నాడు. దీంతో పరుగుల ఖాతా తెరవకుండానే విరాట్ కోహ్లీ పెవిలియన్‌కు చేరాడు. ఆ తర్వాత జట్టు స్కోరు 292 పరుగుల వద్ద రోహిత్ శర్మ(138 బంతుల్లో 159; 17 ఫోర్లు, 5 సిక్సులు) కాట్రెల్ వేసిన 44వ ఓవర్‌లో కీపర్ హోప్‌కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు.

పంత్, అయ్యర్ మెరుపులు

పంత్, అయ్యర్ మెరుపులు

అనంతరం క్రీజులోకి వచ్చిన యువ ఆటగాళ్లు రిషబ్ పంత్, శ్రేయస్ అయ్యర్‌లు పరుగుల వరద పారించారు. వీరిద్దరూ కలిసి నాలుగో వికెట్‌కు సుమారు యాభైకి పైగా పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. కాట్రెల్ వేసిన 46వ ఓవర్‌లో మూడు ఫోర్లు, రెండు సిక్సులతో పంత్ 24 పరుగులు చేయగా.. ఆ తర్వాత రోస్టన్ ఛేజ్ వేసిన ఓవర్‌లో నాలుగు సిక్సులు, ఒక ఫోర్‌తో అయ్యర్ 31 పరుగులు రాబట్టాడు.

అయ్యర్ హాఫ్ సెంచరీ

అయితే కీమో పాల్ వేసిన 48వ ఓవర్ మూడో బంతికి భారీ షాట్‌కు ప్రయత్నించి రిషబ్ పంత్(39) ఔటయ్యాడు. అనంతరం 49వ ఓవర్ చివరి బంతికి అయ్యర్(53) కూడా వికెట్ కీపర్ హోప్‌కి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 387 పరుగులు చేసింది. విండిస్ బౌలర్లలో షెల్డన్ కాట్రెల్ రెండు వికెట్లు, కీమో పాల్, అల్జారీ జోసెఫ్, కీరన్ పొలార్డ్‌లకు తలో వికెట్ తీశారు

Story first published: Wednesday, December 18, 2019, 17:46 [IST]
Other articles published on Dec 18, 2019
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+