విశాఖ వన్డేలో రోహిత్ శర్మ సెంచరీ: అరుదైన జాబితాలో చోటు

హైదరాబాద్: విశాఖ వేదికగా వెస్టిండిస్‌తో జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ సెంచరీతో చెలరేగాడు. 107 బంతుల్లో 11 ఫోర్లు, 2 సిక్సుల సాయంతో రోహిత్ శర్మ సెంచరీ సాధించాడు. వన్డేల్లో రోహిత్ శర్మకు ఇది 28వ సెంచరీ కావడం విశేషం. హాఫ్ సెంచరీ సాధించడానికి 67 బంతులు తీసుకున్న రోహిత్ శర్మ... ఆ తర్వాత హాఫ్ సెంచరీని సెంచరీగా మలచేందుకు కేవలం 40 బంతులు తీసుకున్నాడు.
దీంతో ఒక ఇంటర్నేషనల్ ఇయర్‌లో 10 సెంచరీలు సాధించిన మొట్టమొదటి ఓపెనర్‌గా చరిత్ర సృష్టించాడు. అంతేకాదు ఒక క్యాలెండర్ ఇయర్‌లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో సౌరవ్ గంగూలీ, డేవిడ్ వార్నర్‌లతో కలిసి సంయుక్తంగా రెండో స్థానంలో కొనసాగుతున్నాడు.
ఈ జాబితాలో క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్(9-1998) అగ్రస్థానంలో ఉన్నాడు. ఆ తర్వాత సౌరవ్ గంగూలీ(7-2000), ఆస్ట్రేలియా ఆటగాడు డేవిడ్ వార్నర్(7-2016), రోహిత్ శర్మ(7-2019)లు సంయక్తంగా రెండో స్థానంలో కొనసాగుతున్నారు.
ఈ ఏడాది ఆస్ట్రేలియాతో జరిగిన సిరిస్‌లో సెంచరీ సాధించిన రోహిత్ శర్మ ఆ తర్వాత ఇంగ్లాండ్ వేదికగా జరిగిన వన్డే వరల్డ్‌కప్‌లో 5 సెంచరీలు సాధించాడు. ఫలితంగా వన్డేల్లో అత్యధిక సెంచరీలు సాధించిన ఆటగాళ్ల జాబితాలో రోహిత్ శర్మ సంయుక్తంగా నాలుగో స్థానంలో కొనసాగుతున్నాడు.
రోహిత్ శర్మ కంటే ముందు సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ, రికీ పాంటింగ్‌లు ఉన్నారు. ప్రస్తుతం 36 ఓవర్లకు గాను టీమిండియా వికెట్ నష్టపోకుండా215 పరుగులు చేసింది. క్రీజులో రోహిత్ శర్మ(110), కేఎల్ రాహుల్(97) పరుగులతో ఉన్నారు.
Story first published: Wednesday, December 18, 2019, 17:08 [IST]
Other articles published on Dec 18, 2019
Log in for Better Reading Experience!
By signing in, you agree to our Terms and Privacy Policy
Gender
Select your Gender
- Male
- Female
- Others
Age
Select your Age Range
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications