విశాఖ వన్డేలో టీమిండియా 387: రోహిత్ సెంచరీతో బద్దలైన రికార్డులివే!

హైదరాబాద్: విశాఖ వేదికగా వెస్టిండిస్‌తో జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియా పరుగుల వరద పారించింది. ముఖ్యంగా ఓపెనర్లు రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్‌లు ఆకాశమే హద్దుగా చెలరేగడంతో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 387 పరుగులు చేసింది.
రోహిత్ శర్మ(159; 138 బంతుల్లో 17 ఫోర్లు, 5 సిక్సర్లు), కేఎల్ రాహుల్(102; 104 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్సర్లు)లు సెంచరీలకు తోడు శ్రేయస్ అయ‍్యర్(53;32 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్లు), రిషభ్ పంత్(39; 16 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్లు) చెలరేగడంతో టీమిండియా భారీ స్కోరు సాధించింది.
ఫలితంగా పర్యాటక జట్టుకు 388 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది. వెస్టిండిస్ బౌలర్లలో షెల్డన్ కాట్రెల్ రెండు వికెట్లు తీయగా... కీమో పాల్, అల్జారీ జోసెఫ్, కీరన్ పొలార్డ్‌లకు తలో వికెట్ లభించింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా బద్దలు కొట్టిన రికార్డులను ఒక్కసారి పరిశీద్దాం...

రోహిత్ శర్మ సిక్సర్ల రికార్డు
ఒక క్యాలెండర్ ఇయర్ అత్యధిక అంతర్జాతీయ సిక్సర్లు సాధించిన రికార్డును రోహిత్ నెలకొల్పాడు. 2018లో 74 సిక్సర్లు బాదిన రోహిత్ శర్మ ఈ ఏడాది ఇప్పటివరకూ 77 సిక్సర్లు కొట్టాడు. ఫలితంగా అంతర్జాతీయ క్రికెట్‌లో ఒక క్యాలెండర్ ఇయర్ అత్యధిక సిక్సర్లు కొట్టిన రికార్డునిన నెలకొల్పాడు. ఈ జాబితాలో ఆ తర్వాతి స్థానాల్లో ఏబీ డివిలియర్స్(65 సిక్సర్లు), ఇయాన్ మోర్గాన్(60 సిక్సర్లు) ఐదో స్థానంలో ఉన్నాడు.
* 77 Rohit Sharma (2019)
* 74 Rohit Sharma (2018)
* 65 Rohit Sharma (2017)
* 63 AB de Villiers (2015)
* 60 Eoin Morgan (2019)

ఒక ఓవర్‌లో అత్యధిక పరుగుల రికార్డు
ఈ మ్యాచ్‌లో ఒక ఓవర్‌లో అత్యధిక పరుగుల రికార్డును టీమిండియా సవరించింది. 1999లో న్యూజిలాండ్‌తో జరిగిన వన్డే మ్యాచ్‌లో సచిన్ టెండూల్కర్-అజేయ్ జడేజాల జోడి ఒక ఓవర్‌లో 28 పరుగులు సాధించగా ఈ మ్యాచ్‌లో శ్రేయస్ అయ్యర్-రిషభ్ పంత్‌ల జోడి ఆ రికార్డుని బద్దలు కొట్టింది. ఈ మ్యాచ్‌లో రోస్టన్ ఛేజ్ వేసిన 47 ఓవర్‌లో అయ్యర్-పంత్ జోడీ ఒక ఓవర్‌లో 31 పరుగులు సాధించింది.
* 31 - అయ్యర్/ పంత్ v WI Vizag 2019
* 28 - సచిన్/ జడేజా v NZ Hyderabad 1999
* 27 - జహీర్ ఖాన్/ అజిత్ అగార్కర్ v Zim Jodhpur 2000

రెండో అత్యుత్తమ స్కోరు
ఈ మ్యాచ్‌లో టీమిండియా మరో అరుదైన రికార్డుని నమోదు చేసింది. వన్డేల్లో వెస్టిండిస్‌పై రెండో అత్యుత్తమ స్కోరును నమోదు చేసింది. 2011లో ఇండోర్‌లో జరిగిన మ్యాచ్‌లో విండీస్‌పై భారత్ 418 పరుగులు సాధించగా, ఆ తర్వాత స్థానంలో బుధవారం నాటి మ్యాచ్ తాజాగా చేరింది.
* 418/5 Indore 2011
* 387/5 Vizag 2019
* 377/5 Mumbai BS 2018
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications