విశాఖ వన్డేలో కోహ్లీ డకౌట్: సెంచరీలతో చెలరేగిన రోహిత్, కేఎల్ రాహుల్

హైదరాబాద్: విశాఖ వేదికగా వెస్టిండిస్‌తో జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియా భారీ లక్ష్యం దిశగా సాగుతోంది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన టీమిండియాకు ఓపెనర్లు రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్‌లు మంచి శుభారంభాన్నిచ్చారు. వీరిద్దరూ కలిసి మొదటి వికెట్‌కు 227 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.
మ్యాచ్ ఆరంభం నుంచీ ఓపెనర్లు రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ చెలరేగి ఆడారు. ఈ క్రమంలో తొలుత రోహిత్ శర్మ 107 బంతుల్లో 11 ఫోర్లు, 2 సిక్సుల సాయంతో రోహిత్ శర్మ సెంచరీ సాధించాడు. వన్డేల్లో రోహిత్ శర్మకు ఇది 28వ సెంచరీ కావడం విశేషం. ఆ తర్వాత కొద్దిసేపటికే కేఎల్ రాహుల్ కూడా సెంచరీ సాధించాడు.
కేల్ రాహుల్ 102 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్సుల సాయంతో 101 పరుగులు చేశాడు. వన్డే వరల్డ్‌కప్ తర్వాత కేఎల్ రాహుల్ చేసిన మొదటి సెంచరీ ఇదే కావడం విశేషం. ఈ సెంచరీతో కేఎల్ రాహుల్ పరిమిత ఓవర్ల ఫార్మాట్‌లో తాను ఫస్ట్ చాయిస్ ఓపెనర్ అని మరోసారి నిరూపించుకున్నాడు.
అయితే, జట్టు స్కోరు 232 పరుగుల వద్ద కేఎల్ రాహుల్(102) జోసెఫ్ బౌలింగ్‌లో రోస్టన్ ఛేజ్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. కేఎల్ రాహుల్ ఔటైన తర్వాత క్రీజులోకి వచ్చిన కెప్టన్ విరాట్ కోహ్లీ డకౌట్‌గా వెనుదిరిగాడు. కీరన్ పొలార్డ్ బౌలింగ్‌లో రోస్టన్ చేజ్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.
కోహ్లీ ఔటైన తర్వాత శ్రేయాస్ అయ్యర్ క్రీజులోకి వచ్చాడు. ప్రస్తుతం 40 ఓవర్లకు గాను టీమిండియా 2 వికెట్లు కోల్పోయి 260 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో రోహిత్ శర్మ(140), అయ్యర్(7) పరుగులతో ఉన్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications