For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

950ని పూర్తి చేసుకునేందుకు సిద్ధమవుతోన్న టీమిండియా

India vs West Indies 2nd ODI: India set to become 1st nation to play 950 ODI games

వైజాగ్: ఇండోర్‌లో జరగాల్సిన భారత్‌-వెస్టిండీస్‌ రెండో వన్డే.. అనుకోని విధంగా విశాఖపట్నానికి తరలి వచ్చింది. దీంతో కొంత విరామం తర్వాత సాగర తీరంలో మళ్లీ క్రికెట్‌ సందడి చూడబోతున్నాం. దేశంలో భారత క్రికెట్‌ జట్టుకు బాగా కలిసొచ్చిన మైదానాల్లో విశాఖ మైదానం ఒకటి. ఇక్కడ మొత్తం టీమిండియా మొత్తం 8 వన్డేలాడగా.. అందులో కేవలం ఒకే ఒక్క మ్యాచ్‌లో ఓడింది.

ధోనీలాగే కోహ్లీ కూడా సాధిస్తాడని:

ధోనీలాగే కోహ్లీ కూడా సాధిస్తాడని:

దాంతో పాటుగా మాజీ కెప్టెన్‌ మహేంద్రసింగ్‌ ధోని, విరాట్‌ కోహ్లి, రోహిత్‌ శర్మ లాంటి స్టార్‌ ఆటగాళ్లకు కూడా ఈ మైదానంలో మెరుగైన రికార్డులే ఉన్నాయి. 2005లో ఇక్కడే పాకిస్థాన్‌తో జరిగిన వన్డే మ్యాచ్‌లో ధోని.. 148 పరుగుల మెరుపు ఇన్నింగ్స్‌తో చెలరేగిపోయాడు. మరోవైపు 13 ఏళ్ల క్రితం ధనాధన్‌ ఇన్నింగ్స్‌తో మ‌హేంద్ర‌సింగ్‌ ధోనీ స్టార్‌గా వైజాగ్ మైదానంలోనే చెలరేగిపోయాడు.

10 వేల ప‌రుగులు పూర్తి చేసి నిలిస్తే

10 వేల ప‌రుగులు పూర్తి చేసి నిలిస్తే

అక్కడే టీమిండియా కెప్టెన్ విరాట్‌ కోహ్లీ అత్యంత వేగంగా 10 వేల ప‌రుగులు పూర్తి చేసిన క్రికెటర్‌గానూ నిలిస్తే చూడాల‌ని అభిమానులు ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. సరికొత్త రికార్డులకు కేరాఫ్‌ అడ్రస్‌గా మారిన విశాఖ స్టేడియం.. బుధవారం జరగనున్న వన్డేలో టీమిండియా మరో రికార్డు సృష్టించడానికి వేదిక కానుంది. అదేమిటంటే.. పరిమిత ఓవర్ల ఫార్మాట్‌లో టీమిండియాకిది 950వ వన్డే మ్యాచ్‌ కావడం విశేషం.

అత్యధిక మ్యాచ్‌లాడిన జట్టుగా భారత్‌

అత్యధిక మ్యాచ్‌లాడిన జట్టుగా భారత్‌

దీంతో ఈ ఫార్మాట్‌లో అత్యధిక మ్యాచ్‌లాడిన జట్టుగా భారత్‌ అరుదైన ఘనత వహించనుంది. ఇప్పటివరకూ వన్డే ఫార్మాట్‌లో 949మ్యాచ్‌లాడిన భారత్‌.. 490మ్యాచ్‌ల్లో విజయం సాధించగా, 411మ్యాచ్‌ల్లో ఓటమి చవిచూసింది. అంటే విజయాల శాతం 54.34శాతమన్నమాట. 8 టై కాగా, 40 మ్యాచ్‌ల్లో ఫలితం రాలేదు. ఇక భారత్‌ తర్వాత 916వన్డేలాడి ఆసీస్‌ రెండో స్థానంలో కొనసాగుతోంది.

గెలుపోటముల పరంగా చూసుకుంటే ఆస్ట్రేలియానే

గెలుపోటముల పరంగా చూసుకుంటే ఆస్ట్రేలియానే

గెలుపు-ఓటమిల పరంగా చూసుకుంటే మాత్రం ఈ ఫార్మాట్‌లో మొత్తం 556విజయాలతో ఆస్ట్రేలియానే ముందంజలో ఉంది. 317మ్యాచ్‌లలో మాత్రం ఓటమిపాలైంది. మరోవైపు వన్డే ఫార్మాట్‌లో అత్యధిక మ్యాచ్‌లాడిన జట్ల జాబితాలో మూడో స్థానంలో భారత చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌ కొనసాగుతోంది. ఇప్పటివరకూ 899వన్డే మ్యాచ్‌లాడిన పాక్‌.. 476 విజయాలు, 397పరాజయాలు చవిచూసింది. నాలుగో స్థానంలో శ్రీలంక(827), ఐదో స్థానంలో వెస్టిండీస్‌(781) కొనసాగుతున్నాయి.

Story first published: Wednesday, October 24, 2018, 13:12 [IST]
Other articles published on Oct 24, 2018
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+