న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

రెండో టీ20.. భారత్ తుది జట్టు ఇదే!!?

India vs West Indies: India Predicted XI for 2nd T20I || Oneindia Telugu
India vs West Indies 2019: Probable India XI For 2nd T20I on August 4

హైదరాబాద్: వెస్టిండిస్ పర్యటనలో భాగంగా శనివారం రాత్రి జరిగిన తొలి టీ20లో టీమిండియా ఘన విజయం సాధించింది. ఇదే ఊపులో ఆదివారం రెండో టీ20కి సిద్ధమైంది. మూడు టీ20ల సిరిస్‌లో భాగంగా ఫ్లోరిడాలోని సెంట్రల్ బ్రోవార్డ్ రీజినల్ పార్క్ స్టేడియం టర్ఫ్ గ్రౌండ్ వేదికగా రెండో టీ20 జరగనుంది.

ఉద్రికత్త పరిస్థితులు.. వంద మందికి పైగా క్రికెటర్ల తరలింపుఉద్రికత్త పరిస్థితులు.. వంద మందికి పైగా క్రికెటర్ల తరలింపు

ఈ మ్యాచ్‌లో కూడా విజయం సాధించి సిరీస్‌ను కైవసం చేసుకోవాలని కోహ్లీసేన భావిస్తోంది. మరోవైపు రెండో టీ20లో గెలిచి సిరీస్‌ను సమం చేయాలని కార్లోస్ బ్రాత్‌వైట్‌ సేన రంగంలోకి దిగుతోంది. ఈ నేపథ్యంలో ఈ మ్యాచ్ రసవత్తరంగా సాగే అవకాశం ఉంది. హార్డ్ హిట్టర్లతో నిండిన వెస్టిండిస్ జట్టును తక్కువ అంచనా వేస్తే.. టీమిండియా మూల్యం చెల్లించుకోక తప్పదు.

వచ్చే ఏడాది జరగనున్న టీ20 ప్రపంచకప్‌ను దృష్టిలో పెట్టుకుని పలువురు యువ క్రికెటర్లకు ఈ సిరిస్‌లో సెలక్టర్లు చోటు కల్పించారు. తొలి టీ20లో బ్యాటింగ్‌లో మనీశ్‌ పాండే.. బౌలింగ్‌లో నవదీప్‌ సైనీ అద్భుతంగా రాణించారు. ఈ నేపథ్యంలో వీరిపై రెండో టీ20లో కూడా భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అమెరికాలో క్రికెట్‌కి ఆదరణ పెంచేందుకు ఈ టీ20ని ఫ్లోరిడాలో నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే.

థాయ్‌లాండ్‌ ఓపెన్‌.. చరిత్ర సృష్టించిన సాత్విక్‌-చిరాగ్‌ జోడీథాయ్‌లాండ్‌ ఓపెన్‌.. చరిత్ర సృష్టించిన సాత్విక్‌-చిరాగ్‌ జోడీ

మొదటి టీ20లో టీమిండియా యువ పేసర్ నవదీప్‌ సైనీ (3/17) అద్భుత ప్రదర్శన చేశాడు. అరంగేట్ర మ్యాచ్‌లోనే పూరన్‌ (20), హెట్‌మయర్‌ (0), పొలార్డ్‌ (49)ని పెవిలియన్‌ చేర్చాడు. దీంతో తదుపరి మ్యాచులకు చోటు ఖాయం చేసుకున్నాడు. మనీష్ పాండే, ఖలీల్ అహ్మద్, వాషింగ్టన్ సుందర్ ఆకట్టుకోవడంతో రెండో టీ20లో అవకాశం దక్కనుంది. తొలి టీ20 జట్టే దాదాపుగా రెండో టీ20లో ఆడనుంది.

జట్టు (అంచనా):
భారత్: రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీ (కెప్టెన్), మనీష్ పాండే, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), కృనాల్ పాండ్యా, రవీంద్ర జడేజా, భువనేశ్వర్ కుమార్, ఖలీల్ అహ్మద్, వాషింగ్టన్ సుందర్, నవదీప్ సైనీ.

వెస్టిండీస్: ఎవిన్ లూయిస్‌, జాన్ క్యాంప్‌బెల్‌, షిమ్రాన్ హెట్‌మయెర్‌, నికోలస్ పూరన్‌, కీరన్ పొలార్డ్‌, రోవ్మెన్ పావెల్‌, కార్లోస్ బ్రాత్‌వైట్‌ (కెప్టెన్‌), కీమో పాల్‌, సునీల్ నరైన్‌, ఓషానే థామస్‌, షెల్డన్ కాట్రెల్‌.

Story first published: Sunday, August 4, 2019, 18:13 [IST]
Other articles published on Aug 4, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X