
చహర్ అరంగేట్రం:
2019 ఐపీఎల్లో అదరగొట్టడంతో యువ లెగ్ స్పిన్నర్ రాహుల్ చాహర్‌కు తొలి అంతర్జాతీయ మ్యాచ్ ఆడే అవకాశం దక్కింది. సీనియర్ రవీంద్ర జడేజా స్థానంలో రాహుల్ జట్టులోకి వచ్చాడు. దీంతో టీ20ల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన 81వ క్రికెటర్‌గా రాహుల్ చాహర్ గుర్తింపు పొందాడు. టాస్ వేయడానికి ముందు కెప్టెన్ విరాట్ కోహ్లీ చేతుల మీదుగా జట్టు సభ్యులు అందరి సమక్షంలో రాహుల్ టీమిండియా క్యాప్‌ను అందుకున్నాడు. ఈ సందర్భంగా అందరు అతన్ని అభినందించారు.

నాలుగో పిన్న వయస్కుడిగా:
భారత్ తరఫున టీ20ల్లో అరంగేట్రం చేసిన నాలుగో పిన్న వయస్కుడిగా రాహుల్ చాహర్ నిలిచాడు. 20 ఏళ్ల 2 రోజులకు రాహుల్ టీ20ల్లో అరంగేట్రం చేసాడు. ఈ జాబితాలో స్పిన్నర్ వాషింగ్టన్ సుందర్ (18 ఏళ్ల 80 రోజులు), వికెట్ కీపర్ రిషభ్ పంత్ (19 ఏళ్ల 120 రోజులు), పేసర్ ఇషాంత్ శర్మ (19 ఏళ్ల 152 రోజులు) తొలి మూడు స్థానాల్లో కొనసాగుతున్నారు. సోదరుడు దీపక్ చహర్‌తో కలిసి రాహుల్ ఈ మ్యాచ్ ఆడటం విశేషం. రాహుల్ చహర్ ఈ మ్యాచ్‌లో 3-0-27-1 గణాంకాలు నమోదు చేసాడు.
ఎందరు దరఖాస్తు చేసుకున్నా స్వదేశీ కోచ్‌కే ప్రాధాన్యం.. రవిశాస్త్రి కొనసాగింపు?

సిరీస్ క్లీన్‌స్వీప్:
వెస్టిండీస్‌తో జరిగిన టీ20 సిరీస్‌ను భారత్ 3-0తో క్లీన్‌స్వీప్ చేసింది. మంగళవారం జరిగిన మూడో టీ20లో భారత్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన వెస్టిండీస్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 146 పరుగులు చేసింది. కీరన్ పొలార్డ్ (45 బంతుల్లో 58; 1 ఫోర్, 6 సిక్సర్లు) అర్ధ సెంచరీ చేయగా.. రావ్మన్ పావెల్ (20 బంతుల్లో 32 నాటౌట్; 1 ఫోర్, 2 సిక్సర్లు) ఆకట్టుకున్నాడు. చహర్ 3, సైనీ 2 వికెట్లు తీశారు. లక్ష్య ఛేదనలో రిషభ్ పంత్ (42 బంతుల్లో 65 నాటౌట్; 4 ఫోర్లు, 4 సిక్సర్లు), కెప్టెన్ విరాట్ కోహ్లీ (45 బంతుల్లో 59; 6 ఫోర్లు) మూడో వికెట్‌కు 106 పరుగులు జోడించడంతో భారత్ 19.1 ఓవర్లలో సునాయాస విజయాన్ని అందుకుంది.