Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

రెండో టీ20: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్.. ఓపెనర్‌గా సునీల్ నరైన్‌

India vs West Indies 2nd T20:India Won The Toss And Elected To Bat First || Oneindia Telugu
india-vs-west-indies-2019-india-have-won-the-toss-and-have

హైదరాబాద్: వెస్టిండిస్ పర్యటనలో భాగంగా మరికొద్ది సేపట్లో రెండో టీ20 మ్యాచ్ ప్రారంభం కానుంది. మూడు టీ20ల సిరిస్‌లో భాగంగా ఫ్లోరిడాలోని సెంట్రల్ బ్రోవార్డ్ రీజినల్ పార్క్ స్టేడియం టర్ఫ్ గ్రౌండ్ వేదికగా వెస్టిండిస్, భారత్ తలపడనున్నాయి. టాస్ గెలిచిన భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఈ టీ20లో టీమిండియా ఎలాంటి మార్పులు చేయలేదు. మరోవైపు వెస్టిండిస్ మరోవైపు వెస్టిండిస్ ఒక మార్పు చేసింది.

శనివారం రాత్రి జరిగిన తొలి టీ20లో టీమిండియా 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో కూడా జయకేతనం ఎగురవేసి సిరీస్‌ను కైవసం చేసుకోవాలని కోహ్లీసేన భావిస్తోంది. మరోవైపు ఈ టీ20లో గెలిచి సిరీస్‌ను సమం చేయాలని కార్లోస్ బ్రాత్‌వైట్‌ సేన రంగంలోకి దిగుతోంది. ఈ నేపథ్యంలో ఈ మ్యాచ్ రసవత్తరంగా సాగే అవకాశం ఉంది. హార్డ్ హిట్టర్లతో నిండిన వెస్టిండిస్ జట్టును తక్కువ అంచనా వేస్తే.. టీమిండియా మూల్యం చెల్లించుకోక తప్పదు.

తొలి టీ20లో బ్యాటింగ్‌లో మనీశ్‌ పాండే.. బౌలింగ్‌లో నవదీప్‌ సైనీ అద్భుతంగా రాణించారు. ఈ నేపథ్యంలో వీరిపై రెండో టీ20లో కూడా భారీ అంచనాలు ఏర్పడ్డాయి. వచ్చే ఏడాది జరగనున్న టీ20 ప్రపంచకప్‌ను దృష్టిలో పెట్టుకుని పలువురు యువ క్రికెటర్లకు ఈ సిరిస్‌లో సెలక్టర్లు చోటు కల్పించారు. అమెరికాలో క్రికెట్‌కి ఆదరణ పెంచేందుకు ఈ టీ20ని ఫ్లోరిడాలో నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే.

జట్టు:
భారత్: రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీ (కెప్టెన్), మనీష్ పాండే, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), కృనాల్ పాండ్యా, రవీంద్ర జడేజా, భువనేశ్వర్ కుమార్, ఖలీల్ అహ్మద్, వాషింగ్టన్ సుందర్, నవదీప్ సైనీ.

వెస్టిండీస్: ఎవిన్ లూయిస్‌, సునీల్ నరైన్‌, షిమ్రాన్ హెట్‌మయెర్‌, నికోలస్ పూరన్‌, కీరన్ పొలార్డ్‌, రోవ్మెన్ పావెల్‌, కార్లోస్ బ్రాత్‌వైట్‌ (కెప్టెన్‌), కీమో పాల్‌, ఖరీ పియరీ, ఓషానే థామస్‌, షెల్డన్ కాట్రెల్‌.

Story first published: Sunday, August 4, 2019, 19:44 [IST]
Other articles published on Aug 4, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+