For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

రోహిత్‌కు విశ్రాంతి లేదు, భువీ పునరాగమనం: వెస్టిండిస్‌తో తలపడే భారత జట్టిదే

India vs West Indies 2019 : India Announces T20I, ODI Squad For Windies Series
India vs West Indies 2019: India announce T20I, ODI squad for Windies series, Shami makes comeback in T20I, Bhuvi back

హైదరాబాద్: వెస్టిండిస్‌తో సొంతగడ్డపై జరిగే పరిమిత ఓవర్ల సిరిస్‌కు ఎమ్మెస్కే ప్రసాద్‌ నేతృత్వంలోని జాతీయ సీనియర్‌ సెలక్షన్‌ కమిటీ వన్డే, టి20 జట్లను ప్రకటించింది. గాయం నుంచి కోలుకున్న పేసర్‌ భువనేశ్వర్‌ కుమార్‌కు సెలక్టర్లు చోటు కల్పించారు. భారత పర్యటనలో భాగంగా విండిస్ జట్టు మూడు టీ20లు, మూడు వన్డేలు ఆడనుంది.

బంగ్లాతో టీ20ల్లో ఆకట్టుకున్న ఆల్‌రౌండర్‌ శివమ్‌ దూబేకు వన్డేల్లో స్థానమిచ్చారు. విశ్రాంతినిస్తారని భావించినా వైస్ కెప్టెన్ రోహిత్‌ శర్మకు రెండు జట్లలో చోటు కల్పించారు. ఫామ్‌ లేమితో సతమతమవుతున్న ఓపెనర్‌ ధావన్‌కు మరో అవకాశం ఇచ్చారు. కేదార్‌ జాదవ్‌ వన్డే జట్టులో చోటు నిలబెట్టుకున్నాడు.

వన్డే, టెస్టుల్లో రాణిస్తున్న పేసర్‌ షమీని తాజాగా టీ20లకు ఎంపిక చేశారు. షమీ చివరిసారిగా 2017లో టీ20 మ్యాచ్ ఆడాడు. దీపక్‌ చాహర్‌కు వన్డేలకు మళ్లీ పిలుపు లభించింది. టీ20ల్లో క్రునాల్‌కు బదులు జడేజాను తీసుకున్నారు. చైనామన్‌ బౌలర్‌ కుల్దీప్‌ యాదవ్‌కు టి20ల్లో చోటిచ్చారు.

ఇటీవల బంగ్లాదేశ్‌తో టీ20లు ఆడిన ఆల్‌రౌండర్‌ కృనాల్‌ పాండ్యా, పేసర్‌ ఖలీల్‌ అహ్మద్‌లకు ఉద్వాసన పలికారు. వీరితో పాటు సంజూ సామ్సన్, రాహుల్‌ చాహర్‌లను జట్టు నుంచి తప్పించారు. దీంతో సంజూ శాంసన్‌ ఒక్క మ్యాచ్‌ ఆడకుండానే జట్టులో చోటు కోల్పోయాడు.

వన్డే జట్టు : విరాట్‌ కోహ్లి(కెప్టెన్‌), రోహిత్‌ శర్మ, శిఖర్‌ ధవన్‌, కేఎల్‌ రాహుల్‌, రిషబ్‌ పంత్‌, కేదార్‌ జాదవ్‌, మనీష్‌ పాండే, శ్రేయాస్ అయ్యర్‌, రవీంద్ర జడేజా, శివమ్‌ దూబే, యజువేంద్ర చాహల్‌, కుల్దీప్‌ యాదవ్‌, మహ్మద్‌ షమీ, దీపక్‌ చాహర్‌, భువనేశ్వర్‌ కుమార్‌

టీ20 జట్టు : విరాట్‌ కోహ్లి(కెప్టెన్‌), రోహిత్‌ శర్మ, శిఖర్‌ ధవన్‌, కేఎల్‌ రాహుల్‌, రిషబ్‌ పంత్‌, కేదార్‌ జాదవ్‌, మనీష్‌ పాండే, శ్రేయాస్ అయ్యర్‌, రవీంద్ర జడేజా, శివమ్‌ దూబే, యజువేంద్ర చాహల్‌, కుల్దీప్‌ యాదవ్‌, మహ్మద్‌ షమీ, దీపక్‌ చాహర్‌, భువనేశ్వర్‌ కుమార్‌, వాషింగ్టన్‌ సుందర్‌

Story first published: Friday, November 22, 2019, 11:12 [IST]
Other articles published on Nov 22, 2019
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+