
మొత్తం 8 టెస్టులు ఆడిన ఇషాంత్ శర్మ
38 - కరేబియన్ దీవుల్లో మొత్తం 8 టెస్టులు ఆడిన ఇషాంత్ శర్మ మొత్తం 38 వికెట్లు తీశాడు. ఈ జాబితాలో అనిల్ కుంబ్లే(45), ఎస్ వెంకటరాఘమవన్(39) ఈ జాబితాలో ఇషాంత్ శర్మ కంటే ముందున్నారు.
7 - వెస్టిండిస్‌తో జరిగిన గత ఏడు టెస్టు సిరిస్‌ల్లో టీమిండియా విజయం సాధించింది. జమైకా వేదికగా జరుగుతున్న ఈ టెస్టులో టీమిండియా విజయం సాధిస్తే ఆ రికార్డు మరింత మెరగవుతుంది.

కేఎల్ రాహుల్ మాత్రమే
23.88 - సెప్టెంబర్ 2017 తర్వాత టాప్-5లో ఉన్న 31 మంది ఆటగాళ్లు 20 లేదా అంతకుమించి టెస్టు ఇన్నింగ్స్ ఆడారు. ఈ జాబితాలో కేఎల్ రాహుల్ బ్యాటింగ్ యావరేజి 25 కంటే తక్కువగా ఉంది. ఇప్పటివరకు మొత్తం 28 ఇన్నింగ్స్‌ల్లో 23.88 యావరేజితో కేఎల్ రాహుల్ 645 పరుగులు చేశాడు.
27 - ఈ మ్యాచ్‌లో టీమిండియా గెలిస్తే టెస్టుల్లో టీమిండియాకు అత్యధిక విజయాలనందించిన కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ నిలుస్తాడు. కెప్టెన్‌గా ఇప్పటివరకు 47 టెస్టుల్లో 27 విజయాలు సాధించిన కోహ్లీ.. ప్రస్తుతం మహేంద్ర సింగ్ ధోని (60 టెస్టుల్లో 27)తో సమంగా ఉన్నాడు. గంగూలీ (49 టెస్టుల్లో 21) మూడో స్థానంలో ఉన్నాడు.

సెంచరీకి నోచుకోని షాయ్ హోప్
31 - సెప్టెంబర్ 2017 నుంచి షాయ్ హోప్ టాప్-5లో మొత్తం 31 సార్లు బ్యాటింగ్ చేసినప్పటికీ సెంచరీ సాధించలేకపోయాడు. ఈ సమయంలో ఏ ప్లేయర్ కూడా ఇన్నిసార్లు టాప్-5లో ఆడలేదు. ఈ జాబితాలో భారత బ్యాట్స్‌మన్ అజ్యింకే రహానే రెండో స్థానంలో ఉన్నాడు. 27 ఇన్నింగ్స్‌లు ఆడిన రహానే ఆంటిగ్వా టెస్టులో సెంచరీ సాధించాడు.
60 - రవిచంద్రన్ అశ్విన్ 21.85 యావరేజితో 11 టెస్టుల్లో ఆతిథ్య వెస్టిండిస్ జట్టుపై 60 వికెట్లు పడగొట్టాడు. ఇక, బ్యాటింగ్‌లో 12 ఇన్నింగ్స్‌లు ఆడిన అశ్విన్50.18 యావరేజితో 552 పరుగులు చేశాడు. టెస్టుల్లో అశ్విన్ సాధించిన నాలుగు సెంచరీలు వెస్టిండిస్‌పైనే కావడం విశేషం. విండిస్‌తో జరిగిన నాలుగు టెస్టు సిరిస్‌ల్లో అశ్విన్ రెండు సార్లు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అందుకున్నాడు.

6 వికెట్ల దూరంలో రవీదంర్ జడేజా
7 - టెస్టుల్లో 100 వికెట్లు మైలురాయిని అందుకోవడానికి వెస్టిండిస్ కెప్టెన్ జాసన్ హోల్డర్‌కు మరో ఏడు వికెట్లు కావాలి. ఈ ఘనత సాధిస్తే టెస్టుల్లో 1500కు పైగా పరుగులు, 100కు పైగా వికెట్లు తీసిన నాలుగో వెస్టిండిస్ ప్లేయర్‌గా అరుదైన ఘనత సాధిస్తాడు.
6 - టెస్టుల్లో 200 వికెట్లు మైలురాయిని అందుకోవడానికి జడేజాకు కావాల్సిన వికెట్లు. 150 వికెట్లకు చేరుకోవడానికి షమికి రెండు వికెట్లు అవసరం.
1987 - కేఎల్ రాహుల్ మరో 13 పరుగులు చేస్తే టెస్టుల్లో 2000 పరుగులు మైలురాయిని అందుకుంటాడు. అలాగే మరో 104 పరుగులు చేస్తే ఓపెనర్‌గా టెస్టుల్లో 2000 పరుగుల మైలురాయిని అందుకున్న పదో భారత బ్యాట్స్‌మన్‌గా అరుదైన ఘనత సాధిస్తాడు.


Click it and Unblock the Notifications












