భారత్ Vs వెస్టిండిస్: ముఖాముఖి రికార్డులివే, కోహ్లీసేన సాధించేనా?


హైదరాబాద్: నెల రోజుల భారత పర్యటనకు వచ్చిన వెస్టిండిస్ జట్టు... ఈ పర్యటనలో భాగంగా తన తొలి మ్యాచ్‌ని రాజ్‌కోట్ వేదికగా భారత్‌తో గురువారం ఆడనుంది. ఈ పర్యటనలో వెస్టిండిస్ జట్టు తొలుత రెండు టెస్టు మ్యాచ్‌ల సిరిస్, ఆ తర్వాత ఐదు వన్డేలు, మూడు టీ20ల సిరిస్ ఆడనుంది.
రెండు టెస్టు మ్యాచ్‌ల్లో భాగంగా తొలి టెస్టు రాజ్‌కోట్ వేదికగా అక్టోబర్ 4(గురువారం) నుంచి ఆరంభం అవుతుండగా, రెండో టెస్టు హైదరాబాద్ వేదికగా అక్టోబర్ 12 నుంచి ప్రారంభం కానుంది. ఈ పర్యటనకు ముందు వెస్టిండిస్ జట్టు ఆడిన వార్మప్ మ్యాచ్‌ను డ్రాగా ముగించుకుంది.
రెండు రోజుల పాటు జరిగిన ఈ వార్మప్ మ్యాచ్‌లో భారత్‌కు చెందిన అంకిత్ భవే(116) చేయగా, వెస్టిండిస్‌కు చెందిన సునీల్ ఆంబ్రోస్ (114) సెంచరీలతో రాణించారు. ఇప్పటివరకు ఇరు జట్ల మధ్య 94 టెస్టులు జరగ్గా ఇండియా 18 టెస్టుల్లో విజయం సాధించగా, వెస్టిండిస్ 30 టెస్టుల్లో విజయం సాధించింది.
46 టెస్టులు డ్రాగా ముగిశాయి. రెండు టెస్టుల సిరిస్ నేపథ్యంలో భారత్-వెస్టిండిస్ జట్ల మధ్య ఇప్పటివరకు జరిగిన రికార్డులను ఒక్కసారి పరిశీద్దాం...

భారత్-వెస్టిండిస్ జట్ల మధ్య ముఖాముఖి రికార్డు:
మొత్తం ఆడిన మ్యాచ్‌లు - 94
భారత్ గెలిచినవి - 18
వెస్టిండిస్ గెలిచినవి - 30
డ్రాగా ముగిసిన మ్యాచ్‌లు - 46

భారత్‌లో వెస్టిండిస్ ప్రదర్శన
మొత్తం ఆడిన మ్యాచ్‌లు - 45
భారత్ గెలిచినవి - 11
వెస్టిండిస్ గెలిచినవి - 14
డ్రాగా ముగిసిన మ్యాచ్‌లు - 20

అత్యధిక & అత్యల్ప స్కోర్లు
వెస్టిండిస్ అత్యధిక స్కోరు - 644/8
టీమిండియా అత్యధిక స్కోరు - 644/7
వెస్టిండిస్ అత్యల్ప స్కోరు - 103 (2006లో కింగ్‌స్టన్ స్టేడియంలో - రెండో ఇన్నింగ్స్)
టీమిండియా అత్యధిక స్కోరు - 75 (1987లో ఫిరోజ్ షా కోట్ల స్టేడియంలో - తొలి ఇన్నింగ్స్)

అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్
ఈడెన్ గార్డెన్స్ వేదికగా 1958లో జరిగిన టెస్టులో వెస్టిండిస్ ఆటగాడు రోహాన్ కనాయి చేసిన 256 పరుగులే ఇరు జట్లలో అత్యధిక వ్యక్తిగత స్కోరు కావడం విశేషం. ఇక, భారత్ తరుపున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా సునీల్ గవాస్కర్ ఉన్నాడు. చెన్నైలోని చెపాక్ స్టేడియంలో వెస్టిండిస్‌తో జరిగిన మ్యాచ్‌లో గవాస్కర్ 236 పరుగులతో అజేయంగా నిలిచాడు.

అత్యధిక వికెట్లు తీసిన బౌలర్
వెస్టిండిస్‌పై అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా మాజీ క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్ నిలిచాడు. మొత్తం 41 ఇన్నింగ్స్‌ల్లో కపిల్ దేవ్ 89 వికెట్లు పడగొట్టాడు. ఈ జాబితాలో రెండో స్థానంలో వెస్టిండిస్‌కు చెందిన మాల్కమ్ మార్షల్ ఉన్నాడు. 30 ఇన్నింగ్స్‌ల్లో మార్షల్ 76 వికెట్లు తీశాడు.

అత్యధిక పరుగులు చేసిన ఆటగాడు
వెస్టిండిస్ జట్టుపై అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా మాజీ క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ అరుదైన ఘనత సాధించాడు. 48 ఇన్నింగ్స్‌ల్లో గవాస్కర్ 2,749 పరుగులు చేశాడు. 44 ఇన్నింగ్స్‌ల్లో 2,344 పరుగులతో వెస్టిండిస్‌కు చెందిన క్లైవ్ లాయిడ్ ఈ జాబితాలో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications